అన్వేషించండి

Konda Surekha : వరుస వివాదాలతో సొంత పార్టీకి సమస్యగా మారిన కొండా సురేఖ - రేవంత్ కూడా కాపాడలేరా ?

Telangana Congress : వరుస వివాదాలతో కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారారు. రేవంత్ కూడా కాపాడలేని పరిస్థితిని ఆమె తెచ్చుకుంటున్నారని కాంగ్రెస్‌లోనే విమర్శలు వినిపిస్తన్నాయి.

Surekha has become a headache for the Congress : తెలంగాణలో ఫైర్ బ్రాండ్ లీడర్‌గా పేరున్న కొండా సురేఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది కాక ముందు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. తన శాఖ విషయంలో కాదు. అవినీతి విషయంలో కాదు. పూర్తిగా రాజకీయ కారణాలతోనే వివాదాస్పదమవుతున్నారు. ఓ వైపు నాగార్జున ఫ్యామిలీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, మరో వైపు సొంత పార్టీ నేతలతో లేని సఖ్యత కారణంగా ఆమె ఉక్కపోత ఎదుర్కొంటున్నారు. ఆమెపై ఫిర్యాదు చేసేందుకు వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీకి వెళ్లాలనుకుంటున్నారు. అయితే కొండా సురేఖ మాత్రం తన రాజకీయం విషయంలో తగ్గేదే లేదంటున్నారు. 

వరంగల్‌లో నేతలంతా ఓ వైపు సురేఖ ఓ వైపు 

వరంగల్‌లో కాంగ్రెస్ నేతలంతా ఓ వైపు ఉంటే కొండా సురేఖ ఓ వైపు ఉన్నారు.  గత ఎన్నికల్లో పరకాల నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు.  అయితే పరకాలతో రాజకీయ అనుబంధం ఉన్న కొండా దంపతులు అక్కడ రాజకీయం జోరుగానే చేస్తున్నారు.పరకాల కాంగ్రెస్ వ్యవహారాల్లో కొండా దంపతుల జోక్యం ఎక్కువగా ఉంటోంది. ఈ మధ్య కాలంలో చాలా వివాదాలు కూడా వచ్చాయి. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే లీడర్ విషయంలోనూ కొండా దంపతులు గతంలో ఇబ్బందికరంగా ప్రవర్తించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక సీతక్కతోనూ వివాదాల గురించి మడియాలో విస్తృత ప్రచారం జరిగింది. దీంతో వరంగల్ నేతలంతా కొండా సురేఖపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారు.  అయితే తమ సహజమైన రాజకీయాలు, ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం పెత్తనం మాదే అన్నట్లుగా కొండా దంపతులు చేస్తున్న రాజకీయం ఎవరికీ నచ్చడం లేదు. 

సీఎం రేవంత్ రెడ్డిపై ప్రధాని మోదీకి ఫిర్యాదు, అసలేం జరిగింది?

నాగార్జున కుటుంబం పై వ్యాఖ్యలతో హైకమాండ్‌ వద్ద రిమార్కులు

బీఆర్ఎస్ సోషల్ మీడియా తనపై అనుచిత పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ కేటీఆర్ ను టార్గెట్ చేసిన కొండా సురేఖ .. ఈ వివాదంలోకి నాగార్జున ఫ్యామిలీని తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించినా నాగార్జున తగ్గలేదు. పరువు నష్టం కేసు వేశారు. కేటీఆర్ కూడా అదే పని చేశారు. ఈ వ్యాఖ్యలు హైకమాండ్ దృష్టికి కూడా వెళ్లాయని..మంత్రి పదవి నుంచి  రాజీనామా చేయిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఈ వివాదం కారణంగా ఆమెతో రాజీనామా చేయించేందుకు రేవంత్ రెడ్డి సుముఖంగా లేరని.. సురేఖకు మద్దతుగా ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతూ వస్తున్నాయి. 

ఆ ఒక్క కారణంతోనే మూసీ బ్యూటిఫికేషన్‌ ప్రాజెక్టుకు కేసీఆర్‌ నో చెప్పారు- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

రేవంత్ కూడా కాపాడలేరా ? 

వరుస వివాదాలకు తోడు.. సొంత పార్టీలో అలజడికి కారణం అవుతున్న కొండా సురేఖను కాపాడాలని రేవంత్ ప్రయత్నిస్తున్నా సాధ్యం కాని పరిస్థితులు ఏర్పడుతున్నాయని కాంగ్రెస్‌లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.  కొండా సురేఖ విషయంలో రేవంత్ రెడ్డి పాజిటివ్ గా ఉన్నారు.   ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కొండా సురేఖను పిలిపించుకుని మాట్లాడినట్లుగా తెలుస్తోంది .  రాజకీయాలు డైనమిక్ గా ఉంటాయని..  పరిస్థితుల్ని బట్టి మారకపోతే రాజకీయ భవిష్యత్ ఉండదని.. అందరితో కలిసి పని చేయాలని  హితబోధ చేసినట్లు చెబుతున్నారు.  

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget