అన్వేషించండి

Valmiki Jayanti 2024 : అక్టోబరు 17 వాల్మీకి జయంతి .. విశిష్టత ఏంటి - రాష్ట్ర పండుగగా నిర్వహించనున్న ఏపీ ప్రభుత్వం!

Valmiki Jayanti : ఆశ్వయుజమాసం పౌర్ణమి రోజు వాల్మీకి జయంతి జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబరు 17న పౌర్ణమి తిథి వచ్చింది. ఈ ఏడాది నుంచి వాల్మీకి జయంతిని ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది

Valmiki Jayanti 2024 Date: వాల్మీకి మహర్షి పుట్టుక గురించి స్పష్టమైన ఆధారాలు లేవు కానీ కశ్యపుడు - అదితి కుమారుల్లో ఒకరైన వరుణ్ - చార్సి దంపతులకు జన్మించిన కుమారుడు అని చెబుతారు. వాల్మీకి బ్రహ్మ అంశలో జన్మించాడని కొందరు చెబుతారు. దారి దోపిడీలు చేస్తూ, జంతువులును వేటాడి వధించేవాడని.. నారదమహర్షి బోధనతో తపస్సుచేసుకునేందుకు ఉపమక్రమించాడు. ఏళ్ల తరబడి రామనామం జపిస్తూ తపస్సులో ఉండిపోవడంతో చుట్టూ పుట్టలు పెరిగిపోయాయి. పుట్టలను వల్మీకం అంటారు.. అలా పుట్టల నుంచి బయటకు రావడంతో వాల్మీకి అని పిలుస్తారు.   

Also Read: అరుణాచల గిరిప్రదక్షిణ అంటే అలా చుట్టి వచ్చేయడం కాదు ఈ 44 ఎనర్జీ పాయింట్స్ చూడాల్సిందే!

అరణ్యవాసం , రావణ సంహారం తర్వాత సీత, లక్ష్మణుడితో కలసి శ్రీరామచంద్రుడు అయోధ్య చేరుకుంటాడు. రాజుగా పట్టాభిషిక్తుడు అవుతాడు. ఆ సమయంలో రాజ్యంలో ప్రజలు కొందరు..లంకలో ఉండి వచ్చిన సీతను రామయ్య ఏలుకుంటున్నాడని మాట్లాడుతారు. ఆ సంగతి తెలిసిన రాముడు సీతమ్మను అడవిలో విడిచిపెట్టి రమ్మని సోదరుడిని ఆజ్ఞాపిస్తాడు. ఈ సమయంలో సీతమ్మకు ఆశ్రయం ఇచ్చింది వాల్మీకి మహర్షినే. లవకుశలు అక్కడే జన్మించారు. 

పూజనీయ గ్రంధం రామాయణం వాల్మీకి మహర్షి రచించారు. రామాయణం భారతీయ వాఙ్మయంలో ఆదికావ్యంగా..దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహర్షిని ఆదికవిగా చెబుతారు. రామాయణం కావ్యంలోని కథ త్రేతాయుగంలో జరిగిందని వాల్మీకి పేర్కొన్నారు. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన రామావతారం గురించి రాసిన ఈ గ్రంధంలో  ఓమనిషి నైతిక జీవితాన్ని ఎలా గడపాలో మార్గనిర్దేశం చేసే పవిత్ర గ్రంధం ఇది. రావణ సంహారం, రాజ్య పట్టాభిషేకం తర్వాత శ్రీరామచంద్రుడు సరయూ నదిలో  జలసమాధి పొంది అవతార పరిసమాప్తి చెందారని చెబుతారు. సీతాదేవి తిరిగి తల్లి భూదేవిని చేరుకుంది. 

Also Read: అరుణాచల గిరిప్రదక్షిణలో 44 ఎనర్జీ పాయింట్స్ - అవి ఏవి వాటి విశిష్టత ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

దేశం వ్యాప్తంగా వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఉత్తరాది ప్రాంతాల్లో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు కాషాయవస్త్రాలు ధరించి శోభాయాత్రలు నిర్వహిస్తారు. దాన ధర్మాలు చేస్తారు.  రామాలయం, ఆంజేనేయుడి ఆలయాల్లో ఈ రోజు వాల్మీకి రామాయణం పఠిస్తారు..

వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబరు 17 గురువారం రోజు అన్ని జిల్లాల్లో అధికారికంగా వేడుకలు నిర్వహించాలని పేర్కొంది. అనంతపురం వేదికగా  రాష్ట్ర స్థాయి వాల్మీకి జయంతి వేడుకను నిర్వహించనున్నారు. ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని బోయ, వాల్మీకి ప్రజలు పాదయాత్రలో విజ్ఞప్తి చేశారని..ఈ మేరకు రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశామని చెప్పారు లోకేష్.    రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులపై వాల్మీకి సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ క‌లెక్టర్లు నేతృత్వంలో ఈ పండుగ నిర్వహించాల‌ని  బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌.స‌విత ఆదేశించారు.   

Also Read: అరుణాచలంలో నిత్యం గిరిప్రదక్షిణ చేసే టోపీ అమ్మ ఎవరు.. ఆమెను చూస్తే భక్తులకు ఎందుకంత పూనకం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Warning to MLAs : ఎమ్మెల్యేల చేతులు కట్టేస్తున్న చంద్రబాబు - ఇసుక, లిక్కర్ జోలికెళ్తే అంతే - ఇక వారికి దారేది ?
ఎమ్మెల్యేల చేతులు కట్టేస్తున్న చంద్రబాబు - ఇసుక, లిక్కర్ జోలికెళ్తే అంతే - ఇక వారికి దారేది ?
Moosi Politics : వరదలతో చెన్నై, బెంగళూరు ప్రజలకు కష్టాలు - హైడ్రా, మూసి ప్రక్షాళనకు నైతిక బలం వచ్చినట్లేనా ?
వరదలతో చెన్నై, బెంగళూరు ప్రజలకు కష్టాలు - హైడ్రా, మూసి ప్రక్షాళనకు నైతిక బలం వచ్చినట్లేనా ?
Valmiki Jayanti 2024 : అక్టోబరు 17  వాల్మీకి జయంతి .. విశిష్టత ఏంటి -  రాష్ట్ర పండుగగా నిర్వహించనున్న ఏపీ ప్రభుత్వం!
అక్టోబరు 17 వాల్మీకి జయంతి .. విశిష్టత ఏంటి - రాష్ట్ర పండుగగా నిర్వహించనున్న ఏపీ ప్రభుత్వం!
Today Weather Report: నెల్లూరు జిల్లా తడ వద్ద తీరం దాటిన వాయుగుండం - బెంగళూరు, చెన్నైలో వాతావరణం ఎలా ఉంది?
నెల్లూరు జిల్లా తడ వద్ద తీరం దాటిన వాయుగుండం - బెంగళూరు, చెన్నైలో వాతావరణం ఎలా ఉంది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Vizianagaram Pydithalli sirimanu utsavam | విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం ఎప్పుడైనా చూశారా.? | ABPNita Ambani on Ratan Tata | రతన్ టాటాపై నీతా అంబానీ కీలక వ్యాఖ్యలు | ABP Desamఅద్దె కంప్యూటర్‌తో 100 Cr. టర్నోవర్, రాజమండ్రిలోనే సాఫ్ట్‌వేర్ కంపెనీహెజ్బుల్లా రహస్య సొరంగం వీడియో షేర్ చేసిన ఇజ్రాయేల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Warning to MLAs : ఎమ్మెల్యేల చేతులు కట్టేస్తున్న చంద్రబాబు - ఇసుక, లిక్కర్ జోలికెళ్తే అంతే - ఇక వారికి దారేది ?
ఎమ్మెల్యేల చేతులు కట్టేస్తున్న చంద్రబాబు - ఇసుక, లిక్కర్ జోలికెళ్తే అంతే - ఇక వారికి దారేది ?
Moosi Politics : వరదలతో చెన్నై, బెంగళూరు ప్రజలకు కష్టాలు - హైడ్రా, మూసి ప్రక్షాళనకు నైతిక బలం వచ్చినట్లేనా ?
వరదలతో చెన్నై, బెంగళూరు ప్రజలకు కష్టాలు - హైడ్రా, మూసి ప్రక్షాళనకు నైతిక బలం వచ్చినట్లేనా ?
Valmiki Jayanti 2024 : అక్టోబరు 17  వాల్మీకి జయంతి .. విశిష్టత ఏంటి -  రాష్ట్ర పండుగగా నిర్వహించనున్న ఏపీ ప్రభుత్వం!
అక్టోబరు 17 వాల్మీకి జయంతి .. విశిష్టత ఏంటి - రాష్ట్ర పండుగగా నిర్వహించనున్న ఏపీ ప్రభుత్వం!
Today Weather Report: నెల్లూరు జిల్లా తడ వద్ద తీరం దాటిన వాయుగుండం - బెంగళూరు, చెన్నైలో వాతావరణం ఎలా ఉంది?
నెల్లూరు జిల్లా తడ వద్ద తీరం దాటిన వాయుగుండం - బెంగళూరు, చెన్నైలో వాతావరణం ఎలా ఉంది?
Rains Update: ఏపీలో ఆ జిల్లాల్లో ఆకస్మిక వరదలు, నేడు స్కూళ్లకు సెలవులు - తెలంగాణలో మోస్తరు వర్షాలు
ఏపీలో ఆ జిల్లాల్లో ఆకస్మిక వరదలు, నేడు స్కూళ్లకు సెలవులు - తెలంగాణలో మోస్తరు వర్షాలు
AP Cabinet Decisions: చెత్త పన్ను రద్దుకు తీర్మానం, 6 కొత్త పాలసీలకు ఆమోదం- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే
చెత్త పన్ను రద్దుకు తీర్మానం, 6 కొత్త పాలసీలకు ఆమోదం- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే
New Lady of Justice Statue: న్యాయదేవత కళ్లకు తొలగిన గంతలు, కొత్త విగ్రహంలో ఈ మార్పులు గమనించారా!
న్యాయదేవత కళ్లకు తొలగిన గంతలు, కొత్త విగ్రహంలో ఈ మార్పులు గమనించారా!
Akhanda 2 Thandavam: పాన్ ఇండియా గేమ్‌లో బాలయ్య - ‘అఖండ 2’తో గ్రాండ్ ఎంట్రీకి రెడీ!
పాన్ ఇండియా గేమ్‌లో బాలయ్య - ‘అఖండ 2’తో గ్రాండ్ ఎంట్రీకి రెడీ!
Embed widget