అన్వేషించండి

Arunachalam Giri Pradakshina Pournami :అరుణాచలంలో కార్తీక పౌర్ణమి శోభ - గిరిప్రదక్షిణ అంటే అలా చుట్టి వచ్చేయడం కాదు ఈ 44 ఎనర్జీ పాయింట్స్ చూడాల్సిందే!

Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణ అంటే అలా తిరిగేయడం కాదు ఈ 44 ఎనర్జీ పాయింట్స్ ను దర్శించుకోవాలి. ఆ ప్రదేశాలు , వాటి విశిష్టత ఇక్కడ తెలుసుకోండి...

Arunachalam Giri Pradakshina Pournami: అరుణాచలం గిరిప్రదక్షిణ ఎలా చేయాలి...ముఖ్యమైన 44 ఎనర్జీ పాయింట్లు ఏంటి? వేటి తర్వాత ఏవి దర్శించుకోవాలో వివరంగా కథనంలో పొందుపరిచాం. ఆలయ ప్రధాన గోపురం రెండో ప్రాకారంలో బ్రహ్మతీర్థం నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభించినప్పటి నుంచి 17 ఎనర్జీ పాయింట్ల గురించి ఓ కథనంలో చెప్పుకున్నాం...18 వ ఎనర్జీ పాయింట్ నుంచి 44 వ ప్రదేశం చేరుకుంటే గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది...

బ్రహ్మతీర్థం నుంచి 17 ఎనర్జీ పాయింట్ అయిన నైరుతి లింగం వరకూ వివరాలు , వాటి విశిష్టత తెలుసుకునేందుకు  ఈ లింక్ క్లిక్ చేయండి...

18.నంది ముఖ దర్శనం - ఇక్కడి నుంచి గిరివైపు చూస్తే..నంది ముఖంలా కనిపిస్తుంది

19.ఎదిర్ నేర్ అన్నామలై - సరిగ్గా ఇది గిరికి వెనుకవైపు ఉంటుంది..ఇక్కడి నుంచి గిరిని చూస్తే శవశక్తి దర్శనం అవుతుంది.. అంటే శివుడు ఓ కొండగా, శక్తి మరోకొండగా కనిపిస్తారు..

20. ఆకాశ నంది - పంచభూతాల్లో భాగంగా ఉండే నందుల్లో నాలుగోది ఆకాశనంది

21. పళని ఆండవార్  ఆలయం- కుమారస్వామి ఇక్కడ తపస్సుచేసి స్వయంభుగా వెలశాడని చెబుతారు..అందుకే ఈ ప్రదేశం అత్యంత పవర్ ఫుల్ 

22. రాజ రాజేశ్వరి ఆలయం - ఇది చిన్న ఆలయమే కానీ మహాశక్తివంతమైన ఆలయం..ఇక్కడి నుంచి కొండను చూస్తే పార్వతీదేవి కొండ మాత్రమే కనిపిస్తుంది...

23. సింహ తీర్థం , సింహ నంది -పంచభూత నందుల్లో ఇది ఐదోది. ఇక్కడున్న సింహతీర్థంలో నీరు తాగితే ఎంతటి వ్యసనం అయినా మానేయగలుగుతారు...ఓ సారి ప్రయత్నించి చూడండి భక్తితో...

24. కన్నప్ప గుడి - ఇది కూడా అటవీశాఖ అధీనంలో ఉంది. రోడ్డుపైనుంచి నమస్కారం చేసుకోవడమే..

25. గౌతమ ఆశ్రమం - గౌతముడు తపస్సు చేసిన ప్రదేశం ఇది

26. సూర్య లింగం - అరుణగిరిపైనుంచి వెళ్లిన సూర్యుడు తేజస్సు కోల్పోయి ఇక్కడ తపస్సు చేసి మళ్లీ తేజస్సు పొందాడని చెబుతారు. ఇక్కడ ఆదిత్య హృదయం చదువుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్య అయినా పరిష్కారం అవుతుంది..
 
27. వరుణ లింగం - వరుణ లింగానికి అధిదేవత శని...గ్రహదోషాలు తొలగించే శక్తి ఉన్న లింగం ఇది

28. మాణిక్య వాచకర్ ఆలయం- మాణిక్యవాచకర్ శివభక్తుడు..ఈయన కీర్తిస్తుంటే పరమేశ్వరుడు ఆ శ్లోకాలను రచించి భద్రపరిచాడని చెబుతారు

29. ఆది అణ్ణామలై - బ్రహ్మదేవుడు ప్రతిష్టించిన ఈ శివలింగం  అరుణాచలేశ్వరుడి కన్నా ముందే ఉందట..
 
30. వాయులింగం - ఈ ఆలయంలో కూర్చుంటే బయట ఎండగా ఉన్నా లోపల చల్లగా ఉంటుంది..ఈ క్షేత్రానికి అధిదేవత కేతువు..

31. వాయు నంది - వాయునంది చాలా శక్తివంతమైనది

32. భగవాన్ బ్రిడ్జ్ - రమణ మహర్షి సేదతీరిన ప్రదేశం ఇది.. 

33. చంద్ర లింగం -  చంద్రుడు ప్రతిష్టించిన శివలింగం ఇది...దీనిని దర్శించుకుంటే మీ జీవితంలో ఉండే కష్టనష్టాలు బాధలు తొలగిపోతాయి...

34. అధికార నంది - శ్రీశైలంలో సాక్షి గణపతిలా అరుణాచలంలో అధికారి నంది అలా అన్నమాట..నంది చెవిలో గోత్రనామాలు చెప్పుకోవాలి

35. అగస్త్య ఆశ్రమం - ఇక్కడి నుంచి కొండను చూస్తే శివపార్వతులు ఇద్దరూ కలసి కనిపిస్తారు. ఇక్కడ దర్శనం చేసుకుంటే వివాహం, సంతాన దోషాలు తొలగిపోతాయి

36. కుబేర లింగం - లక్ష్మీదేవి ఈ లింగాన్ని ఆరాధించి కుబేరుడికి అప్పగించింది. ఇక్కడ శివయ్యను దర్శించుకుంటే భోగభాగ్యాలు కలుగుతాయి.

37. ఇడుక్కు పిళ్లయార్ - చిన్నగా కనిపించే ఇది ఆలయం కాదు. లోపల రెండు యంత్రాలు అమర్చారని...గిరిప్రదిక్షిణ వల్ల వచ్చిన అలసట ఈ ప్రదేశం మాయం చేసేస్తుందని నమ్మకం. 

38. పంచముఖ దర్శనం - ఇక్కడి నుంచి గిరిని చూస్తే ఐదు ముఖాలుగా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతిని కలిగించే ప్రదేశం ఇది

39. ఊసి లింగం - ఊసి అంటే తమిళంలో సూది అని అర్థం..ఇక్కడ శివలింగం సూది ఆకారంలో ఉంటుంది..

40. పచ్చయ్యమ్మ గుడి - ఇక్కడ శ్యామలాదేవి పచ్చయ్యమ్మన్ స్వరూపంలో కొలువైంది...

41. ఈశాన్య లింగం, యజమాన నంది - ఇక్కడితో అష్టదిక్పాలకుల లింగాల దర్శనం పూర్తవుతుంది.

42. షణ్ముఖ ఆలయం - ఇక్కడ స్వామివారు ఆరుముఖాల్లో దర్శనమిస్తాడు..

43. దుర్గాలయం , ఖడ్గ తీర్థం- ఇక్కడ అమ్మవారు మహిషాసురుడిని సంహరించాడని చెబుతారు

44. ప్రవాళ పర్వతం - గిరిప్రదిక్షిణలో ఆఖరి ప్రదేశం ఇది..రమణమహర్షి తల్లికి ఉపదేశం చేసిన ప్రదేశం ఇది 

ఈ 44 ఆలయాలు దర్శించుకునే క్రమంలో మధ్య మధ్యలో మరికొన్ని చిన్న చిన్న ఆలయాలుంటాయి అన్నీ దర్శించుకుని పెద్దాలయం దగ్గరకు చేరుకుంటే గిరిప్రదిక్షిణ పూర్తైనట్టే...ఇదీ గిరిప్రదిక్షిణ చేసిన విధానం....

Arunachalam Giri Pradakshina Pournami :అరుణాచలంలో కార్తీక పౌర్ణమి శోభ -  గిరిప్రదక్షిణ అంటే అలా చుట్టి వచ్చేయడం కాదు ఈ  44 ఎనర్జీ పాయింట్స్ చూడాల్సిందే!
Also Read: పాములకు రెండు నాలుకలు ఎందుకుంటాయి - సర్పజాతి పుట్టుకకు మూలం ఎవరు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Bumrah 5 Wicket Haul: బుమ్రా పాంచ్ పటాకా - హెడ్, స్మిత్ సెంచరీలు, మూడో టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్
బుమ్రా పాంచ్ పటాకా - హెడ్, స్మిత్ సెంచరీలు, మూడో టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Bigg Boss 8 Telugu Finale LIVE: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
Embed widget