అన్వేషించండి

Karthika Masam 2025 Start and End Date: కార్తీకమాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!

Karthika Masam 2025: పరమేశ్వరుడు, శ్రీ మహా విష్ణువుకి ప్రీతికరమైన కార్తీకమాసం ఈ ఏడాది ఎప్పటి నుంచి మొదలవుతుంది? క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులేంటో ఇక్కడ తెలుసుకోండి

Karthika Masam Start and End Date 2025: దీపావళి అమావాస్యతో ఆశ్వయుజమాసం పూర్తవుతుంది..ఆ మర్నాడు పాడ్యమి నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతుంది.  ఈ ఏడాది అమావాస్య తిథి తగులు మిగులు రావడంతో అక్టోబరు 20న దీపావళి జరుపుకుంటారు. ఆ మరుసటి రోజు కూడా సూర్యోదయం సమయానికి అమావాస్య ఉండడంతో కార్తీకమాసం...అక్టోబరు 22 బుధవారం నుంచి ప్రారంభమవుతోంది. 
 
బ్రహ్మ ముహూర్తంలో కార్తీకస్నానం ఆచరించడంతో కార్తీకమాసం ప్రారంభమవుతుంది. అందుకే సూర్యోదయ సమయానికి ఏ రోజు అయితే పాడ్యమి తిథి ఉంటుందో ఆ రోజునుంచి ప్రారంభం. అందుకే 2025 లో అక్టోబరు 22 బుధవారం నుంచి కార్తీకమాసం మొదలవుతోంది
 
2022 అక్టోబరు 22 బుధవారం కార్తీకమాసం ప్రారంభం పాడ్యమి


అక్టోబరు 23 గురువారం యమవిదియ - భగినీహస్త భోజనం -భాయ్ దూజ్

అక్టోబరు 25 శనివారం నాగులచవితి

అక్టోబరు 26 ఆదివారం నాగపంచమి

అక్టోబరు 27 సోమవారం కార్తీకమాసం మొదటి సోమవారం

అక్టోబరు 29 బుధవారం  కార్తావీర్యజయంతి 

అక్టోబరు 31 శుక్రవారం యజ్ఞావల్క జయంతి

నవంబరు  1 శనివారం కార్తీక శుక్ల ఏకాదశి

నవంబరు  02 ఆదివారం క్షీరాబ్ది ద్వాదశి

నవంబరు 03 కార్తీకమాసం రెండో సోమవారం

నవంబరు  05 బుధవారం  జ్వాలా తోరణం, కార్తీక పూర్ణిమ (Karthika Pournami 2025), కేదారనోములు,గురునానక్ జయంతి

నవంబరు 10 కార్తీకమాసం మూడో సోమవారం

నవంబరు 15 శనివారం కార్తీక బహుళ ఏకాదశి

నవంబరు  16 ఆదివారం వృశ్చిక సంక్రాంతి

నవంబరు 17 కార్తీకమాసం నాలుగో సోమవారం

నవంబర్  20 గురువారం పోలిస్వర్గం ( కార్తీకమాసం ఆఖరు రోజు)
 
కార్తీకం నెల రోజుల్లో  సోమవారాలు,  జ్వాలాతోరణం..శివుడి  ప్రాముఖ్యత తెలియజేస్తే.. బలిపాడ్యమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. 

కార్తీకపురాణంలో మొదటి 15 అధ్యాయాలు శివుడి ప్రాముఖ్యత, చివరి 15 అధ్యాయాలు విష్ణువు గురింతి ఉంటుంది.

ఈ ఏడాది (2025)  అక్టోబరు 22 నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతోంది..నవంబర్ 20 తో ముగుస్తుంది
 
న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం 
నచవేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్థమమ్

కార్తీక మాసానికి సమానమైన నెల లేదు..శ్రీ మహావిష్ణువుకి సమానమైన దైవం లేదు..వేదాలతో సమానమైన శాస్త్రాలు లేవు..గంగతో సమానమైన తీర్థం లేదు అని ఈ శ్లోకం అర్థం.

కార్తీక మాసం మొత్తం నియమాలు పాటిస్తారు. కొందరు కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజు మాత్రమే అనుసరిస్తారు. ఈ నెల రోజులు నియమాలు పాటించేవారు శాఖాహారం మాత్రమే తీసుకుంటారు.  వానాకాలం పూర్తై చలి మొదలయ్యే రోజులు కావడంతో..ఈ నెల రోజులు దుప్పట్లు, కంబళ్లు, స్వెట్టర్లు దానం చేస్తే పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. 
  
కార్తీకమాసం నియమాలు పాటించేవారు ఇవి మర్చిపోవద్దు
 
ఈ నెల రోజులు వెల్లుల్లి, ఉల్లి, మద్యం, మాంసానికి దూరంగా ఉండాలి

ప్రతికూల ఆలోచనలు దరిచేరనివ్వవద్దు
 
నమ్మకం లేకపోతే భగవంతుడిని పూజించవద్దు..కానీ..దైవాన్ని దూషించకండి
 
దీపారాధన కోసం నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వినియోగించండి..నూనె వంటికి రాసుకోవద్దు
 
కార్తీకంలో మినుములు తినడం, నలుగు పెట్టుకుని స్నానం  ఆచరించడం చేయకూడదు
 
కార్తీకమాసంలో నియమాలు పాటించేవారు..ఈ నియమాలు పాటించని వారి చేతి భోజనం చేయకూడదు

గమనిక:  ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించినవి.  ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Navy Day 2025 : భారత నౌకాదళ దినోత్సవం వెనుక చరిత్ర ఇదే.. ఇండియన్ నేవీ పాకిస్తాన్​కి అప్పట్లోనే చుక్కలు చూపించిందిగా
భారత నౌకాదళ దినోత్సవం వెనుక చరిత్ర ఇదే.. ఇండియన్ నేవీ పాకిస్తాన్​కి అప్పట్లోనే చుక్కలు చూపించిందిగా
South Africa Win: 359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్  పరాజయం
359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్ పరాజయం
Adani meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ  భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
Kokapet Lands Auction: మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
Advertisement

వీడియోలు

Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
SP Balasubrahmanyam Statue Controversy | బాలు విగ్రహం చుట్టూ పెద్ద వివాదం | ABP Desam
విరాట్ కోహ్లీ రాణిస్తే సిరీస్ మనదే..!
వద్దనుకున్నోళ్లే దిక్కయ్యారు.. రోహిత్, విరాట్ లేకపోతే సఫారీలతో ఓడిపోయేవాళ్లం: కైఫ్
2027 వన్డే వరల్డ్ కప్ టార్గెట్‌గా కంబ్యాక్‌కి కోహ్లీ రెడీ!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Navy Day 2025 : భారత నౌకాదళ దినోత్సవం వెనుక చరిత్ర ఇదే.. ఇండియన్ నేవీ పాకిస్తాన్​కి అప్పట్లోనే చుక్కలు చూపించిందిగా
భారత నౌకాదళ దినోత్సవం వెనుక చరిత్ర ఇదే.. ఇండియన్ నేవీ పాకిస్తాన్​కి అప్పట్లోనే చుక్కలు చూపించిందిగా
South Africa Win: 359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్  పరాజయం
359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్ పరాజయం
Adani meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ  భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
Kokapet Lands Auction: మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
Telangana Ponguleti: వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
Hornbill Festival : హార్న్‌బిల్ ఫెస్టివల్ 2025.. నాగాలాండ్​లో జరిగే ఈ ట్రెడీషనల్ ఈవెంట్​ గురించి తెలుసా?
హార్న్‌బిల్ ఫెస్టివల్ 2025.. నాగాలాండ్​లో జరిగే ఈ ట్రెడీషనల్ ఈవెంట్​ గురించి తెలుసా?
Sharmila criticized Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు -  ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు - ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
Super Soft Idlis : ఇడ్లీలు మెత్తగా రావట్లేదా? స్పాంజీగా, తెల్లగా రావాలంటే ఈ హోటల్ స్టైల్ రెసిపీని ఫాలో అయిపోండి
ఇడ్లీలు మెత్తగా రావట్లేదా? స్పాంజీగా, తెల్లగా రావాలంటే ఈ హోటల్ స్టైల్ రెసిపీని ఫాలో అయిపోండి
Embed widget