'అఖండ 2' లో సనాతన ధర్మం ఎపిసోడ్స్ హైలెట్!
ఈ నేల అసురుడిది కాదు.. ఈశ్వరుడిది పరమేశ్వరుడిది.. కాదని తాకితే జరిగేది తాండవం అఖండ తాండవం అఖండ 2లో డైలాగ్ ఇది
డివోషనల్ టచ్ ఇస్తూ అఖండ 2ని బోయపాటి తెరకెక్కించనున్నాడని..బాలయ్య క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉండబోతోందని తెలుస్తోంది
అఖండ 2 లో సనాతన ధర్మానికి సంబంధించిన సీన్స్ ఉండబోతున్నాయని..మూవీకి ఇవే హైలెట్ కాబోతున్నాయని టాక్
తిరుమల లడ్డూ ఇష్యూతో సనాతన ధర్మాన్ని రక్షించాలనే నినాదాన్ని హోరెత్తించారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..
ఇప్పుడు అఖండ 2 లో సనానత ధర్మంపై జరుగుతున్న దాడిని హైలెట్ చేయబోతున్నారని తెలుస్తోంది...
ఇద్దరు కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని చేతులమీదుగా అఖండ పూజా కార్యక్రమాలు జరిగాయి..బ్రాహ్మణి క్లాప్ కొట్టగా తేజస్విని కెమెరా స్విచాన్ చేశారు
అఖండ మూవీకి సీక్వెల్ గా బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తోన్న మూవీఇది...క్యాప్షన్ తాండవం..
అఖండలో హీరోయిన్ గా నటించిన ప్రగ్యాజైశ్వాల్ అఖండ 2 లోనూ హీరోయిన్ గా నటిస్తోంది
బాలకృష్ణ - బోయపాటి మూవీ అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలుంటాయ్.. సింహా, లెజెండ్, అఖండ తో హ్యాట్రిక్ కొట్టడంతో అఖండ 2 తో అంతకుమించి హిట్ పక్కా అని ఫిక్సైపోయారు