అనుష్క నటించిన అరుంధతి (2009) ఒక మంచి ఫాంటసీ థ్రిల్లర్. కళ్యాణ్ రామ్ బింబిసార (2022) కూడా మంచి ఫాంటసీ టైమ్ ట్రావెల్ థ్రిల్లర్. రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’ కూడా మంచి ఫాంటసీ థ్రిల్లర్. శంకర్ దర్శకత్వంలోనే తెరకెక్కిన ‘ఐ’ సినిమా కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్‌ల ‘రోబో’, ‘2.0’ మంచి హైబడ్జెట్ సైన్స్ ఫిక్షన్ సినిమాలు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలోనే తెరకెక్కిన ‘మగధీర’ తెలుగులో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. కిచ్చా సుదీప్ నటించిన ‘విక్రాంత్ రోణ’ మంచి హై బడ్జెట్ డిఫరెంట్ థ్రిల్లర్. సూర్య నటించిన సరికొత్త ఫాంటసీ థ్రిల్లర్ ‘కంగువా’ త్వరలో విడుదల కానుంది. సీనియర్ ఎన్టీఆర్ ‘పాతాళ భైరవి’ అప్పట్లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది.