ప్రేమ వివాహం చేసుకున్న ఆలియా భట్ రణబీర్ కపూర్..కెరీర్ ని , వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుని దూసుకుపోతున్నారు. వీరి కుమార్తె పేరు రాహా..
ఈ విషయం స్వయంగా కరిష్మా కపూర్ పాడ్ కాస్ట్ లో ఆలియా భట్ స్వయంగా చెప్పింది.
అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ADHD) కారణంగా ఎక్కువ సమయం సెట్స్ లో ఉండలేనని..తొందరగా షూటింగ్ ముగించే విధానాన్ని ఇష్టపడతానని చెప్పుకొచ్చింది
హైపర్ టెన్షన్ కారణంగా చిన్న చిన్న విషయాలకే ఎక్కువ కంగారుపడిపోతుందట.. రణబీర్ కవర్ చేస్తూ కూల్ చేస్తుంటాడట.
ఈ మధ్య కుమార్తె తో కలసి ఓ ఫొటో దిగుదాం అనుకుంటే ఆలియా చాలా కంగారుపడిపోయిందట.
గతేడాది క్రిస్మస్ సమయంలో లంచ్ కి వెళ్లినప్పుడు కూడా ఇదే పరిస్థతి ఎదురైందని..రణబీర్ కారణంగా బయటపడ్డానని చెప్పుకొచ్చింది.
కుమార్తెకు రాహా అని పేరు పెట్టాక మీడియాకు పరిచయం చేసే సమయంలోనూ సేమ్ సిట్యుయేషన్ అని చెప్పింది ఆలియా...
ఇలా ప్రతి సందర్భంలోనూ తాను హైపర్ టెన్షన్ కి గురిఅవడం..రణబీర్ అర్థంచేసుకుని అక్కడ పరిస్థితిని కూల్ చేయడం అలవాటైపోయిందని చెప్పింది
తనకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలున్నాయని..ఎక్కువ సమయం టాస్క్ లపై దృష్టి పెట్టడం కష్టంగా ఉందని గతంలో ఇంటర్యూలలో చెప్పుకొచ్చింది
రీసెంట్ గా జిగ్రాతో వచ్చింది. ఇంకా స్పై థ్రిల్లర్ ఆల్ఫా , భన్సాలీ దర్శకత్వంలో `లవ్ అండ్ వార్`లో నటిస్తోంది. ఇంకా చాలా ఆఫర్లు లైన్లో ఉన్నాయి...