కోలుకున్న రజనీకాంత్..వేట్టయన్ టీమ్ తో ఫొటోస్ వైరల్!
సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ మూవీ వేట్టయన్ - ద హంటర్ మూవీ అక్టోబరు 10 న దసరా కానుకగా థియేటర్లలో రిలీజై మంచి టాక్ సొంతం చేసుకుంది
కలెక్షన్లపరంగా దూసుకుపోతోంది. వయసుతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర చెడుగుడు ఆడేసుకున్నారు రజనీకాంత్
ఫైట్స్, డాన్స్, నటన..ఎక్కడా తగ్గేదే లే అన్నట్టు ఫుల్ ఎనర్జీతో కనిపించారు సూపర్ స్టార్. విడుదలై వారం రోజుల్లోపే వరల్డ్ వైడ్ గా 240 కోట్లు వసూలు చేసింది.
సూపర్ స్టార్ తో పాటూ...అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫాహద్ ఫాజిల్, రానా , రితికా సింగ్, దుశారా విజయన్ ఇందులో ముఖ్యపాత్రల్లో నటించి మెప్పించారు
ఈ మధ్య అనారోగ్యంతో బాధపడిన రజనీకాంత్ ను కలిసేందుకు వేట్టయన్ మూవీ టీమ్ ఆయన ఇంటికెళ్లారు..ఈ ఫొటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి
ఫొటోస్ లో ఎనర్జటిక్ గా కనిపిస్తున్న తలైవాని చూసి అంతా ఆనందంలో మునిగితేలుతున్నారు.. కొద్ది రోజుల క్రితం అనారోగ్యంలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు రజనీకాంత్
హార్ట్ ప్రాబ్లెమ్ ఉన్నట్టు గుర్తించిన వైద్యులు ట్రీట్మెంట్ చేశారు..హాస్పిటల్ నుంచి డిశ్శార్జ్ అయిన తర్వాత బయటకొచ్చిన ఫొటోస్ ఇవే
వేట్టయన్ బాక్సాఫీస్ దగ్గర భారీగా వసూలు చేస్తోంది..ఈ సక్సెస్ ను రజనీకాంత్ తో కలసి సెలబ్రేట్ చేసుకునేందుకు వెళ్లారు మూవీ టీమ్
త్వరలోనే రజనీకాంత్ కూలీ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.. లోకేష్ కనగరాజ్ దర్శకుడు...