సైబర్ క్రైమ్ కోర్డినేషన్ సెంటర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమాకం!
నేషనల్ క్రష్ రష్మిక మందన వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. తెలుగు, తమిళం, హిందీలో వరుస సినిమాలతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా దూసుకెళుతోంది..
యానిమల్ తో బాలీవుడ్ లో క్రేజ్ సొంతం చేసుకున్న రష్మిక త్వరలో విక్కీ కౌశల్ ‘చావా’ సినిమాతో రాబోతోంది. డిసెంబరు 6 న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.
అదే డిసెంబరు 6న ఆమె నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప 2 థియేటర్లలో సందడి చేయబోతోంది. అంటే ఒకే రోజు రష్మిక మూవీస్ రెండు విడుదలవుతున్నాయ్...
మూవీస్ సంగతి పక్కనపెడితే సోషల్ యాక్టివిటీస్ లో భాగం అవ్వాలని భావిస్తోంది రష్మిక. ఇందులో భాగంగా AI సాయంతో సెలబ్రెటీల డీప్ ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసి సైబర్ క్రైమ్స్ కి పాల్పడేవారికి వ్యతిరేకంగా పోరాడబోతోంది
ఆ మధ్య రష్మిక డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.. అప్పటి నుంచి ఈ సైబర్ క్రైమ్స్ కి వ్యతిరేకంగా పోరాడాలని డిసైడ్ అయిందట నేషనల్ క్రష్..
కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో నడిచే సైబర్ క్రైమ్ కోర్డినేషన్ సెంటర్ కు బ్రాండ్ అంబాసిడర్ నియమాకం అయింది నేషనల్ క్రష్.
సైబర్ క్రైమ్ పై విస్తృతంగా అవగాహన కల్పిస్తానని..సైబర్ క్రైమ్ క్రిమినల్స్ ని ఏదో రూపంలో టార్గెట్ చేస్తానని చెప్పుకొచ్చింది రష్మిక
ఇలాంటి వారి ఉచ్చులో చిక్కకుండా మనం అలర్ట్ గా ఉండాలన్న రష్మిక.. వారినుంచి మనల్ని మనం కాపాడుకుంటూ ఎవరూ వారి బారిన పడకుండా చేయాలంది
తన బాధ్యతగా సైబర్ క్రైమ్స్ నేరాలు అరికట్టేందుకు తవంతు బాధ్యతగా అవగాహన కల్పిస్తానంది.