Kondapochamma Sagar Tragedy | కొండపోచమ్మసాగర్ లో పెను విషాదం | ABP Desam
సిద్ధిపేట జిల్లా మర్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్ లో పెను విషాదం నెలకొంది. సరాదాగా సెల్ఫీలు దిగుదామని ప్రాజెక్టులోకి దిగిన ఏడుగురు కుర్రాళ్లలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవటం తీవ్ర విషాదాన్ని నింపింది.
ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ఏడుగురు చిన్న వయస్సు కుర్రాళ్లు డ్యామ్ లోకి దిగారు. మృతి చెందిన కుర్రోల్లలంతా 17-20 సంవత్సరాల వయస్సులో ఉన్న వాళ్లే. మృతులు ధనుష్, లోహిత్, ధనేశ్వర్, సాహిల్, జతిన్ గా గుర్తించారు. మృగాంక్, ఇబ్రహీం అనే కుర్రాళ్లను మాత్రం స్థానికులు కాపాడగలిగారు. మృతి చెందిన యువకులంతా ముషీరాబాద్ కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు 15లక్షల సాయం అందించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ ఘటనతో ఒక్కసారిగా తెలంగాణ అంతా ఉలిక్కిపడింది. ఒకే చోట ఐదుగురు కుర్రాళ్లు చనిపోవటంతో పరిస్థితి తీవ్రత పెరిగి విషాద పరిస్థితులు నెలకొన్నాయి.





















