అన్వేషించండి

Hormonal Imbalance: మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందా? అందుకు గల కారణాలేంటి

మనం యాక్టివ్ గా ఉండాలంటే హార్మోన్లు పనితీరు సక్రమంగా ఉండాలి. అవి ఏ మాత్రం అటు ఇటుగా ఉన్న దాని ప్రభావం వెంటనే మనలో కనిపిస్తుంది. ఆందోళన, నిద్రలేమి కారణంగా మహిళల్లో హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది.

మనం యాక్టివ్ గా ఉండాలంటే హార్మోన్లు పనితీరు సక్రమంగా ఉండాలి. అవి ఏ మాత్రం అటు ఇటుగా ఉన్న దాని ప్రభావం వెంటనే మనలో కనిపిస్తుంది. రోజువారీ పనుల్లో పడి మహిళలు శారీరక ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టారు. ఫలితంగా హార్మోన్ల సమస్య తలెత్తి మానసిక రుగ్మతలు తలెత్తే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి కారణంగా మహిళల్లో హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది. దీని ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. మహిళల్లో హార్మోన్ స్థాయిలు, హెచ్చుతగ్గులు చాలా మిశ్రమంగా ఉంటాయి. ఇది వారి మానసిక పరిస్థితి మీద ప్రభావం చూపుతుంది. మెదడు చురుగ్గా పని చెయ్యడం, పీరియడ్స్, గర్భధారణ వంటి వాటి మీద హార్మోన్లు తీవ్ర ప్రభావం చూపుతాయి. అందుకే హార్మోన్లు అసమతుల్యత ఏర్పడితే ఇవన్నీ ఎఫ్ఫెక్ట్ అవుతాయి. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ మరియు టెస్టోస్టెరాన్ హార్మోన్లు మహిళలకి చాలా ముఖ్యం.

మహిళల్లో ఈస్ట్రోజెన్‌లో తగ్గుదల అధిక ఆందోళన మరియు చికాకును కలిగిస్తుంది. దీన్ని వెంటనే గుర్తించి పరిష్కరించకపోతే తీవ్రమైన నిరాశకు దారితీస్తుంది. అంతే కాదు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది, ఇది మధుమేహానికి దారితీస్తుంది. థైరాయిడ్ గ్రంథికి సంబంధించి హార్మోన్లు అసమతుల్యత ఏర్పడితే నిద్ర లేమి, ఆందోళన, కండరాల నొప్పి, హృదయ స్పందనలో మార్పులు, పొడి బారిన చర్మం, జుట్టు రాలిపోవడం, పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం వంటి సమస్యలు వచ్చేలా చేస్తుంది. 

హార్మోన్ల అసమతుల్యత కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు 

* హైపోథైరాయిడిజం

* పీరియడ్స్ సమాయనికంటే ముందు రావడం, ఒక్కోసారి ఆలస్యం కావడం 

* మెనోపాజ్

* అడిసన్ వ్యాధి

* మధుమేహం

* డిప్రెషన్

హార్మోన్ల అసమతుల్యతకి కారణాలు 

సరైన నిద్ర లేకపోవడం, మానసిక ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, మెడికల్ కండిషన్స్, దీర్ఘకాలిక ఒత్తిడి, ఆహార లేమి, జీవనశైలిలో మార్పులు. ఇవన్నీ హార్మోన్ల పని తీరు సక్రమగా లేవనే దానికి సంకేతాలు. 

ఈ సమస్యకి ట్రీట్మెంట్ 

ఆరోగ్యకరమైన ఆహారం: శరీరానికి అన్ని పోషకాలు అందే విధమైన ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, చేపలు, చికెన్ మరియు ధాన్యాలతో ఫైబర్, ఖనిజాలు మరియు విటమిన్లు లభించే ఆహారం తీసుకోవాలి. 

వ్యాయామం: ప్రతి రోజు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చెయ్యాలి. జీవక్రియ సక్రమంగా ఉండాలంటే తప్పని సరిగా జాగింగ్, స్విమ్మింగ్ లేదా కొద్ది సేపు వాకింగ్ చెయ్యడం అలవర్చుకోవాలి. 

ధూమపానం మానెయ్యాలి: ఆరోగ్యానికి హాని కలిగించే ధూమపానం, మద్యపానం అలవాట్లు మానుకోవాలి. ఇవి మానసిక, శారీరక ఆరోగ్యానికి హానికరం. 

ధ్యానం: మనసు, ఆలోచనలు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం చెయ్యాలి. ఏవైనా యోగాసనాలు నేర్చుకుని క్రమం తప్పకుండా వాటిని చెయ్యాలి. మనసును అదుపులో పెట్టుకోవడానికి ఆలోచనా విధానం బాగుండేందుకు ధేయనం చెయ్యడం ఉత్తమమైన మార్గం. హార్మోన్స్ పనితీరు సక్రమంగా ఉండేందుకు అవసరమైన ఆటలు ఆడుతూ కూడా ఉండొచ్చు. 

గమనిక: పలు అధ్యయనాలుపరిశోధనలుహెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: వర్షాకాలంలో ఈ కూరగాయలకు దూరంగా ఉండటమే ఉత్తమం

Also Read: ఇవి ఆరోగ్యకరమే కదా అని తిన్నారో - ఇక మీరు రోగాలపాలైనట్లే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
Game Changer : టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
Game Changer : టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Ambedkar Row in Parliament: మరింత తీవ్రమవుతున్న అమిత్‌షా కామెంట్స్ వివాదం- నేడు కాంగ్రెస్‌ దేశవ్యాప్త నిరసనలు
మరింత తీవ్రమవుతున్న అమిత్‌షా కామెంట్స్ వివాదం- నేడు కాంగ్రెస్‌ దేశవ్యాప్త నిరసనలు
Child Constable: ఐదేళ్లకే పోలీస్‌ అయిన బాలుడు- ఒక్కరోజు కాదు పర్మనెంట్‌గా- మేక్‌ ఏ విష్ కానేకాదు, అదెలాగంటే?
ఐదేళ్లకే పోలీస్‌ అయిన బాలుడు- ఒక్కరోజు కాదు పర్మనెంట్‌గా- మేక్‌ ఏ విష్ కానేకాదు, అదెలాగంటే?
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Embed widget