Vegetables: వర్షాకాలంలో ఈ కూరగాయలకు దూరంగా ఉండటమే ఉత్తమం
వర్షాకాలం అంటే రోగాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ జాగ్రత్తగా ఉండాలి. జలుబు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులకి ఇది అవాసంగా ఉంటుంది.
వర్షాకాలం అంటే రోగాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ జాగ్రత్తగా ఉండాలి. జలుబు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులకి ఇది అవాసంగా ఉంటుంది. ఇంక తినే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ సీజన్ లో కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండటమే మంచిది. తేమ వాతావరణం కారణంగా బ్యాక్టీరియా వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. సూక్ష్మ క్రిములు, బ్యాక్టీరియా వేగంగా సంతానోత్పత్తి చేస్తుంది. దాని వల్ల కూరగాయలు త్వరగా కలుషితం అవుతాయి. అందుకే కొన్ని కూరగాయలు మనం తింటే అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. సాధారణంగా ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ వానాకాలంలో వాటికి దూరంగా ఉండటమే ఉత్తమమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఆకుకూరలు
ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. అత్యంత పోషకమైన ఆహారాల్లో ఇది ఒకటి. వీటిలో అన్ని రకాల విటమిన్స్, ఖనిజాలు లభిస్తాయి. కానీ వర్షాకాలంలో వీటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి తేమ వాతావరణంలో పెరగడమే కారణం. ఫంగస్, బ్యాక్టీరియా వ్యాప్తి ఆకుకురాల వల్ల ఎక్కువగా ఉంటుంది. తేమ పరిసరాలు బ్యాక్టీరియా సంతానోత్పత్తి ప్రదేశంగా మారుతుంది. ఆకుకూరలన్నీ ఇదే వాతావరణంలో పెరుగుతాయి. ఈ బ్యాక్టీరియా సులభంగా చనిపొడు అందుకే ఈ సీజన్ లో వీటిని తినకపోవడమే మంచిది.
క్యాప్సికమ్
క్యాప్సికమ్ లో గ్లూకోసినోలేట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది తినడం వల్ల వాంతులు, వికారం, విరోచనాలు అయ్యే అవకాశం ఉంది. ఈ వర్షాకాలంలో వీటిని తీసుకోవడం వల్ల శ్వాస సంబంధ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ లక్షణాలు ఎక్కువ కాలం పాటు ఉంటాయి. అందుకే వీటికి దూరంగా ఉండటం ఉత్తమం.
కాలీఫ్లవర్
కాలీఫ్లవర్ వద్దని చెప్పేందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఈ పువ్వులో దాగి ఉండే ఫంగస్ కారణంగా కదూ ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. రెండో కారణం ఇందులో గ్లూకోసినోలేట్స్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల వర్షాకాలంలో అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.
వంకాయలు
వంకాయలో ఉండే రుచి వేరే ఏ కూరగాయాలోనూ ఉండదని అంటారు. వర్షాకాలంలో వంకాయ హానికర రసాయనాలని విడుదల చేస్తుంది. ఈ సీజన్ లో వీటిని తీసుకోవడం వల్ల చర్మ సంబంధ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దద్దుర్లు, స్కిన్ ఇన్ఫెక్షన్, చర్మం ఎర్రగా మారి దురద పెట్టడం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే వర్షాకాలంలో ఈ కూరగాయాలు తీసుకోకుండా ఉండటమే మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: నేరేడు పండ్లు షుగర్ పేషెంట్స్ తినొచ్చా? నిపుణులు ఏం చెప్తున్నారంటే
Also Read: ఇవి ఆరోగ్యకరమే కదా అని తిన్నారో - ఇక మీరు రోగాలపాలైనట్లే!