అన్వేషించండి

Suriya 44: సూర్య గ్యాంగ్‌స్టర్ కాదు... కొత్త సినిమా బ్యాక్‌డ్రాప్ మీద క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్

Suriya Sivakumar Latest Movie: కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'సూర్య 44' గురించి తాజాగా డైరెక్టర్ కార్తీక్ సుబ్బారాజ్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టారు.

తమిళ స్టార్ హీరో సూర్య పాన్ ఇండియా మూవీ 'కంగువ' (Kanguva) రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా విడుదల కాకముందే కార్తీక్ సుబ్బారాజ్ దర్శకత్వంలో సూర్య మరో ప్రాజెక్టును లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ గురించి డైరెక్టర్ కార్తీక్ సుబ్బారాజ్ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. 

కోలీవుడ్ స్టార్ సూర్య పాన్ ఇండియా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే పలు విభిన్నమైన సినిమాలతో సౌత్ లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సూర్యకు తెలుగులో కూడా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఇక ఇప్పుడు ఉత్తరాది ప్రేక్షకులను కూడా తన యాక్టింగ్ స్కిల్స్ తో మాయ చేసి పాన్ ఇండియా హీరోగా మారబోతున్నారు. ప్రస్తుతం తన పాన్ ఇండియన్ యాక్షన్ డ్రామా 'కంగువ' ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. 'కంగువ' తర్వాత సూర్య ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నాడు. తాత్కాలికంగా ఈ సినిమాకు 'సూర్య 44'నే టైటిల్ ను పెట్టగా కేవలం ఐదు నెలల్లో ఈ సినిమా నిర్మాణాన్ని ముగించారు. 'సూర్య 44'లో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. సూర్య పుట్టినరోజు కానుకగా ఇప్పటికే చిత్రబృందం ఒక గ్లింప్స్‌ను విడుదల చేసింది. అయితే దాన్ని చూశాక అందరూ 'సూర్య 44' ఒక గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా అన్పించింది అంటూ కామెంట్స్ చేశారు. అంతే కాదు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అండర్ వరల్డ్ మాఫియా చుట్టూ తిరుగుతుందని మొదటి నుండి అభిమానులు భావిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీని గురించి స్పందిస్తూ దర్శకుడు షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు.

Read Also: బేబీ బంప్‌తో షాక్ ఇచ్చిన 'లెజెండ్' హీరోయిన్ - త్వరలో తల్లి కానున్న రాధికా ఆప్టే

కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ “నేను ఏదైనా సినిమా చేస్తుంటే జనాలు దాన్ని గ్యాంగ్‌స్టర్ చిత్రంగా భావిస్తారు. అయితే నిజానికి 'సూర్య44' గ్యాంగ్‌స్టర్ చిత్రం కాదు. ఇదొక ప్రేమకథ. యాక్షన్‌ ఎక్కువగా ఉంటుంది, అయితే ప్రేమకథే సినిమా ప్రధానాంశం. చాలా ఏళ్లుగా లవ్ స్టోరీ చేయాలనుకున్నాను. సూర్య సర్, పూజా హెగ్డే బోర్డ్‌లోకి రావడంతో నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను'' అంటూ ఈ మూవీ అసలు గ్యాంగ్ స్టర్ డ్రామా కాదన్న విషయాన్ని వెల్లడించారు. "ఖచ్చితంగా సినిమాలో యాక్షన్ ఉంది. కానీ ఇది గ్యాంగ్‌స్టర్‌కి సంబంధించిన చిత్రం కాదు. ఇది గ్యాంగ్‌స్టర్ కథ కాదు. ఈ ఊహాగానాలన్నీ ఎలా మొదలయ్యాయో నాకు తెలియదు" అంటూ ఈ మూవీ గురించి చక్కర్లు కొడుతున్న రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టారు. సూర్య 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సంతోష్ నారాయణన్ స్వరాలు సమకూరుస్తున్నారు. 2025 సమ్మర్‌లో 'సూర్య 44'ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని కార్తీక్ సుబ్బరాజ్ తెలిపారు. కాగా ప్రస్తుతం సూర్య అభిమానులు మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'కంగువ' రిలీజ్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

Also Readజైల్లో ఉన్న జానీ మాస్టర్‌కు మద్దతుగా ఆనీ... నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేయడం, కేసు మీద షాకింగ్ కామెంట్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
ZEBRA Twitter Review - 'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tragedy Incident: ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
Embed widget