Today Top Headlines: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా - తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు షాక్, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Today Top Headlines In AP And Telangana:
1. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా
కోరం లేకపోవడంతో తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. మొత్తం 50 మంది పాల్గొనాల్సి ఉండగా, కేవలం 22 మంది హాజరయ్యారు. 50 శాతం కోరం లేకపోవడంతో ఎన్నికకు వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారి, జేసీ శుభం బన్సల్ మీడియాకు తెలిపారు. గత కొన్ని రోజులుగా తిరుపతిలో రాజకీయాలు వేడెక్కాయి. నేడు తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉన్న క్రమంలో ఆదివారం రాత్రి కొందరు వైసీపీ కార్పొరేటర్లను బలవంతంగా హోటళ్లకు తరలించారు. ఇది కచ్చితంగా కూటమి నేతల పనేనని, వైసీపీ ఇంఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి ఆరోపించడం తెలిసిందే. ఇంకా చదవండి.
2. ఏపీకి బడ్జెట్ కేటాయింపు విమర్శలపై సీఎం చంద్రబాబు క్లారిటీ
2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. సమ్మిళిత వృద్ధితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. అభివృద్ధి జరగాలంటే బీజేపీకి ఓటు వేయాలన్నారు. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో మన దేశం పేరు మార్మోగుతోందని తెలిపారు. ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ (Union Budget) పైనా స్పందించిన చంద్రబాబు.. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ లో కేటాయింపులున్నాయని కొనియాడారు. ఇంకా చదవండి.
3. ఏకంగా సీఎం చంద్రబాబు భూమి కబ్జాకు యత్నం
భూముల విలువ రోజురోజుకూ పెరుగుతుండడంతో కేటుగాళ్లు కూడా అందుకు తగ్గ ప్లాన్లతో నకిలీ పత్రాలు క్రియేట్ చేస్తున్నారు. కోట్లు సంపాదించేందుకు స్కెచ్ వేసి కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పుడు ఈ ల్యాండ్ మాఫియా ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి భూమిపైనే కన్నేసింది. ఆయనపై ఉన్న భూమి విలువ ఇప్పుడు కోట్లలో ఉండడంతో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి, రుణ కోసం బ్యాంకుకు వెళ్లడంతో అసలు బాగోతం బయటపడింది. దీంతో ఈ కేసులో కీలక సూత్రధారిని పోలీసులు అరెస్ట్ చేశారు. భూముల సంరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ల్యాండ్ కాజేసే యత్నం చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఇంకా చదవండి.
4. తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సుప్రీం షాక్
తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత రెండో పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఇంకా చదవండి.
5. కరీంనగర్ మెడికల్ కాలేజీ స్టూడెంట్ ఆత్మహత్య
ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నా...ర్యాగింగ్(Ragging) భూతం వీడటం లేదు. విద్యావ్యవస్థలో కాలనుగుణంగా ఎన్నో మార్పులు వచ్చినా...ఈ ర్యాగింగ్ జాడ్యం మాత్రం వదలడం లేదు. అమాయక విద్యార్థులు ర్యాగింగ్ ఒత్తిడి తట్టుకోలేక తీవ్ర మానసిక వేదనకు గురవుతుండగా...మరికొందరు బలవన్మరణానలకు(Suicide) పాల్పడుతున్నారు. కరీంనగర్‌లో ఓ పీజీ విద్యార్థిని ఈ ర్యాగింగ్ కాటుకు బలైపోయింది. ఇంకా చదవండి.





















