అన్వేషించండి

TDP problem Kolikapudi: అదేపనిగా కెలికేస్తున్న కొలికపూడి - చర్యలు తీసుకోలేకపోతున్న టీడీపీ హైకమాండ్- సమస్య పరిష్కారం ఎలా?

MLA Kolikapudi:టీడీపీలో కొలికపూడి చిచ్చు తగ్గడం లేదు. అమరావతి ఉద్యమకారుడు ఇప్పుడు టీడీపీకి మింగుడుపడని నేతగా మారారు. విజయవాడ ఎంపీని చూపించి ఆయన టీడీపీని టార్గెట్ చేస్తున్నారన్న ఆగ్రహం కనిపిస్తోంది.

Kolikapudi has become a problem for TDP but they are unable to take action:   తెలుగుదేశం పార్టీలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం ప్రస్తుతం ఒక పెను తుఫానును సృష్టిస్తోంది. అమరావతి పరిరక్షణ ఉద్యమం నుండి పుట్టిన నాయకుడిగా, చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆయన, ఇప్పుడు అదే పార్టీకి అతిపెద్ద సమస్యగా పరిణమించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్  తో విభేదాలను సాకుగా చూపుతూ, ఆయన సాగిస్తున్న విమర్శలు నేరుగా పార్టీ ప్రతిష్ఠనే దెబ్బతీస్తున్నాయని ఆ పార్టీ అగ్రనేతలు మండి పడుతున్నా ఏమీ చేయలేకపోతున్నారు. 

 సొంత పార్టీపైనే  దండయాత్ర 

అమరావతి ఉద్యమ సమయంలో పోరాట పటిమను చూసి, స్థానిక నేతల వ్యతిరేకత ఉన్నప్పటికీ తిరువూరు నుంచి  చంద్రబాబు ఆయనకు టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. అయితే, గెలిచిన నాటి నుండి కొలికపూడి తన బాణాలను ప్రత్యర్థులపై కాకుండా సొంత పార్టీ నేతలపైనే గురిపెడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో లేని భయం ఇప్పుడు ఉందంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు టీడీపీకి తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇది కేవలం ఎంపీతో ఉన్న పట్టింపుల వల్ల చేస్తున్న విమర్శలు కాదని, పార్టీని టార్గెట్ చేయడమే ఆయన ప్రధాన లక్ష్యమని కేడర్ భావిస్తోంది.

 గతం తాలూకు నీడలు వెంటాడుతున్నాయా? 

అమరావతి ఉద్యమానికి ముందు కొలికపూడి వైసీపీ సానుభూతిపరుడిగా ఉండేవారన్న గతాన్ని ఇప్పుడు టీడీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. ప్రస్తుతం ఆయన అనుసరిస్తున్న తీరును బట్టి, ఆయనను జగన్ కోవర్ట్ గా సోషల్ మీడియాలోనూ, అంతర్గత చర్చల్లోనూ సంబోధించడం మొదలైంది. జగన్ హయాంలో రక్షణ ఉందని, ఇప్పుడు బెదిరింపులు వస్తున్నాయని ఆయన అనడం వెనుక లోతైన రాజకీయ అర్థం ఉందని, ఇది ప్రత్యర్థులకు ఆయుధాలను అందించడమేనని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

అధిష్ఠానం వ్యూహాత్మక మౌనం 

ఇంత వివాదం జరుగుతున్నా నారా లోకేష్ ఆయనను విందుకు ఆహ్వానించడం, పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నచ్చజెప్పే ప్రయత్నం చేయడం వెనుక బలమైన కారణాలు ఉండవచ్చునని చెబుతున్నారు.  ఒక దళిత ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకుంటే అది వర్గపరంగా తప్పుడు సంకేతాలు వెళ్తుందనే ఆందోళన ఒకటైతే, అమరావతి ఉద్యమకారుడిగా ఆయనకున్న గుర్తింపు వల్ల వెంటనే చర్యలు తీసుకోవడానికి అధిష్ఠానం వెనుకాడుతోందని చెబుతున్నారు.  ఈ   వెసులుబాటుతో ఆయన పార్టీ క్రమశిక్షణను గాడి తప్పిస్తున్నారన్న   విమర్శలు కూడా వస్తున్నాయి 

 కఠిన నిర్ణయానికి సమయం ఆసన్నమైందా? 

కొలికపూడి వైఖరి వల్ల పార్టీ క్యాడర్ నైతిక స్థైర్యం దెబ్బతింటోంది. ఒక ఎమ్మెల్యే బహిరంగంగా పార్టీ విధానాలను తప్పుబట్టడం క్రమశిక్షణారాహిత్యానికి పరాకాష్ట అని క్షేత్రస్థాయి కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. చర్యలు తీసుకుంటే ఆయనను  బాధితుడిగా  చూపి ప్రతిపక్షం రాజకీయం చేసే అవకాశం ఉన్నప్పటికీ, తీసుకోకపోతే అంతర్గత నష్టం మరింత పెరిగే ప్రమాదం ఉంది. పార్టీ కన్నా ఎవరూ ఎక్కువ కాదని నిరూపించాల్సిన బాధ్యత ఇప్పుడు చంద్రబాబు నాయుడిపైనే ఉంది. ఎప్పటికప్పుడు ఆయన అంతా సర్దుబాటు అయిందన చెబుతున్నప్పటికీ ఒక్క రోజు కూడా ఈ సర్దుబాటు ఉండటం లేదు.  

టాప్ హెడ్ లైన్స్

Dharmana Prasada Rao : మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తప్పదు - భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ క్రెడిట్ జగన్‌దే - ధర్మాన సంచలన వ్యాఖ్యలు |
మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తప్పదు - భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ క్రెడిట్ జగన్‌దే - ధర్మాన సంచలన వ్యాఖ్యలు |
Rahul Gandhi Speech In Parliament: కొందరు మూర్ఖులు ఎవరి మాట వినరు, తమకు నచ్చిందే చేస్తారు? రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సభలో దుమారం
కొందరు మూర్ఖులు ఎవరి మాట వినరు, తమకు నచ్చిందే చేస్తారు? రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సభలో దుమారం
Chandrababu 4.0 PR Strategy: చంద్రబాబు 4.0'లో మారిన పీఆర్ మార్క్ - మోదీ వ్యూహంతో రీ-పొజిషనింగ్ - అంతా వైరల్ కంటెంటే!
చంద్రబాబు 4.0'లో మారిన పీఆర్ మార్క్ - మోదీ వ్యూహంతో రీ-పొజిషనింగ్ - అంతా వైరల్ కంటెంటే!
Dhanush Political Entry: విజయ్ బాటలో ధనుష్ ? తమిళ రాజకీయాల్లోకి మరో హీరో.. 2031 లక్ష్యంగా కామ్‌గా స్క్రిప్ట్!
విజయ్ బాటలో ధనుష్ ? తమిళ రాజకీయాల్లోకి మరో హీరో.. 2031 లక్ష్యంగా కామ్‌గా స్క్రిప్ట్!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Ram Charan : ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
Vaibhav Sooryavanshi News: వైభవ్ సూర్యవంశీకి ప్ర‌మోష‌న్.. ఆజ‌ట్టుకు  వైస్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్న 15 ఇయ‌ర్స్ కిడ్
వైభవ్ సూర్యవంశీకి ప్ర‌మోష‌న్.. ఆ జ‌ట్టుకు  వైస్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్న 15 ఇయ‌ర్స్ కిడ్
Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
Embed widget