Crime News: కూతురి చదువంటూ భర్త కిడ్నీ అమ్మేసింది - ఆ డబ్బు తీసుకుని ప్రియుడితో రాత్రికి రాత్రే జంప్, కట్ చేస్తే..
Crime News: ఓ మహిళ తన భర్తను కూతురి చదువు, పెళ్లి పేరిట ఏమార్చి అతని కిడ్నీ అమ్మేలా చేసింది. చివరకు ఆ డబ్బులతో ప్రియుడితో కలిసి రాత్రికి రాత్రే పరారైంది. ఈ ఘటన వెస్ట్ బెంగాల్‌లో చోటు చేసుకుంది.

A Woman Sold Her Husband's Kidney And Ran Away With Her Boyfriend In West Bengal: ఓ మహిళ కూతురి చదువు కోసం అంటూ భర్తను ఏమార్చింది. అతనికి మాయమాటల చెప్పి నమ్మించి ఏకంగా కిడ్నీనే అమ్మేసింది. ఆ డబ్బుతో ప్రియుడితో రాత్రికి రాత్రే పరారైంది. ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్‌లో (West bengal) చోటు చేసుకుంది. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని హవ్‌డా జిల్లా సంక్రైల్ ప్రాంతంలో ఉండే ఓ మహిళ.. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తన భర్తను కిడ్నీ అమ్మాలని ఒత్తిడి చేసింది. తమ కుమార్తె చదువు, వివాహానికి కిడ్నీ అమ్మాలని.. అలా చేస్తే కుటుంబంలో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని నెలల తరబడి అతన్ని నమ్మించింది. అయితే, భార్య పట్టుబట్టడంతో చేసేదేం లేక ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఆ భర్త అలానే తన కిడ్నీ విక్రయించాడు.
రాత్రికి రాత్రే ప్రియుడితో భార్య జంప్..
భర్త తన కిడ్నీ అమ్మి తీసుకొచ్చిన రూ.10 లక్షలు తీసుకున్న భార్య తన ప్రియుడితో కలిసి పరారైంది. డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేస్తానని భర్తను నమ్మించి.. తనకు ఫేస్‌బుక్‌లో పరిచయమైన పెయింటర్ రవిదాస్ అనే వ్యక్తితో పరారైంది. విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల సాయంతో అక్కడా ఇక్కడా విచారించి బరాక్‌పూర్ ప్రాంతంలో ఓ వ్యక్తితో ఉంటున్నట్లు తెలుసుకుని కుటుంబ సభ్యులతో కలిసి ప్రశ్నించాడు. అయితే, తన భర్తతో మాట్లాడడానికి నిరాకరించిన ఆమె.. విడాకులు ఇస్తానని హెచ్చరించింది. తన భార్య మాటలు నమ్మి మోసపోయానని.. ఎలాగైనా తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

