Amrutham Serial: అప్పాజీ తిక్క కుదిర్చేందుకు అంజి, అమృతం ఏం చేశారో తెలుసా? - ఈ ఎపిసోడ్‌లో పుకార్లతోనే నవ్వులు పూయించేశారుగా..
Amrutham Serial Review: 90sలో వచ్చిన హాస్య రసామృత సీరియల్ అమృతం అంటే అందరికీ హార్ట్ ఫేవరెట్. ఆ నవ్వులను మళ్లీ మీకు అందించేందుకు కాస్త స్టెస్ రిలీఫ్‌గా ఈ ఎపిసోడ్ చూసేయండి.

Amrutham Serial Episode 5 Review: అమృతం సీరియల్ (Amrutham Serial) అంటేనే ఎప్పటికీ ఓ క్రేజ్. గుణ్ణం గంగరాజు దర్శకత్వంలో 90sలో వచ్చిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్ ఇప్పటికీ అలరిస్తూనే ఉంది. శివాజీరాజా, నరేశ్, హర్షవర్ధన్, గుండు హనుమంతరావు, వాసు ఇంటూరి, నారిపెద్ది శివన్నారాయణ, నరేశ్, రాగిణి, ఝూన్సీ కీలక పాత్రలు పోషించారు. అంజి, అమృతం తమ కామెడీ టైమింగ్స్, పంచులతో నవ్వులు ఆద్యంతం నవ్వులు పూయిస్తూనే ఉంటారు. ఇప్పటికీ చాలామందికి అమృతం సీరియల్ అంటేనే ఓ స్టెస్ రిలీఫ్‌లా పని చేస్తుంది. మరి అలాంటి హాస్య రసామృతాన్ని మళ్లీ మీకు గుర్తు చేస్తూ ఓ సరదా ఎపిసోడ్ మీ కోసం..
నరుడా.. వానరుడా.. అంత పని చేశాడా..?
ఈ ఎపిసోడ్‌లో పుకార్లతోనే నవ్వులు పూయిస్తారు.. మన అంజి అమృతం. అప్పాజీని భయపెట్టి మరీ ఇంటి సడెన్ చెకింగ్స్‌కు రాకుండా చేస్తారు. అసలు స్టోరీలోకి వెళ్తే.. అమృతం, సంజీవని సింహాచలం ట్రిప్ ముగించుకుని ఇంటికి వస్తారు. ఇంటి బయట ఎక్కువ మంది మీడియా వాళ్లు హడావుడి అది చూసీ కంగారుగా లోపలకి వెళ్తారు. ఒళ్లంతా గాట్లు, దెబ్బలతో అంజి మీడియా ఛానెళ్లకు ఇంటర్వ్యూ ఇస్తుంటాడు. ఓ మనిషి రూపంలో ఉన్న ఓ వింత జంతువు రాత్రి తనపై దాడి చేసిందని.. ఒళ్లంతా రక్కేసిందని చెబుతాడు. అది నర వానరం అంటూ పుకార్లు పుట్టిస్తాడు. మీడియా అంతా ఇది కవర్ చేస్తుంది.
ఆ నర వానరం ఇలా రోజుకొకరిపై దాడి చేసిందనే వార్తలు షికారు చేస్తుంటాయి. అయితే, ఇలా అవన్నీ పుకార్లేనని.. వీటిని పుట్టించిన వారిపై చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ టీవీలో చెబుతారు. దీంతో అంజి టెన్షన్ పడతాడు. మరోవైపు, అమృతం కూడా నర వానరం పుకార్లపై భయపడుతుంటాడు. ఈ లోపు ఇంటి ఓనర్ అప్పాజీ వచ్చి రాత్రి 9 గంటల తర్వాత లైట్ వేశారంటూ అమృతంతో గొడవ పెట్టుకుంటాడు. దీంతో టార్చర్ ఫీలైన అమృతం ఎలాగైనా అప్పాజీ నైట్ విజిట్స్ ఆపాలనుకుంటాడు. మరోవైపు, అంజి నర వానరం గెటప్ వేసి రాత్రి సమయంలో అప్పాజీతో పాటు కొందరిని భయపెడతాడు. అయితే, అప్పాజీని భయపెట్టాలని అమృతం కూడా నర వానరం గెటప్ వేస్తాడు. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు అమృతం, అంజి నర వానరం గెటప్స్ వేస్తారు.
అంజి ప్లానే అదంతా..
ఇద్దరికీ విషయం తెలిసిన తర్వాత అమృతానికి అసలు విషయం చెబుతాడు అంజి. తన భార్య శాంత తనను కొట్టిందని అది బయటకు చెప్తే పరువు పోతుందని అందుకే తానే వింత జంతువు పుకారు పుట్టించానని చెబుతాడు. అయితే, కమిషనర్ పట్టుకుంటారనే భయంతో ఆ పుకారు నిజం చేయాలని ఇలా గెటప్ వేసినట్లు చెబుతాడు. తాను కూడా ప్రతి రోజూ రాత్రి ఇంటి చుట్టూ కాపలా కాసే అప్పాజీని బెదిరించేందుకే ఈ గెటప్ వేసినట్లు చెబుతాడు అమృతం. ఇలా ఇద్దరూ అప్పాజీని బెదిరిస్తారు. దీంతో భయంతో అప్పాజీ పారిపోతాడు. ఆ తర్వాత రోజు ఉదయం అమృతం ఇంటికి వచ్చిన అప్పాజీ నర వానరాలు రెండు అని రాత్రి బయటకు తిరగొద్దని హెచ్చరిస్తాడు. ఈ లోపు ఓ అబ్బాయి వానరం మాస్క్ వేసుకోగా అమ్మో అప్పుడే పిల్లలను కూడా పెట్టేసింది అంటూ భయపడతాడు అప్పాజీ.. నరుడు, వానరుడు ఎంత పని చేశాడో కదా..






















