Hyderabad Crime News: ప్రియుడు మోసం చేశాడని హైదరాబాద్‌లో విద్యార్థిని ఆత్మహత్య, పోలీసులకు సూసైడ్ నోట్ లభ్యం
Medchal Crime News | ప్రియుడు పెళ్లి చేసుకోవడం లేదని మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

Student committed suicide | హైదరాబాద్: భాగ్యనగరంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక సమస్యలతో హబ్సీగూడలో ఇద్దరు పిల్నల్ని చంపి, భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోగా.. మరోచోట ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకోవడం లేదని మనస్తాపానికి గురై యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కుత్బుల్లాపూర్ లోని పేట్ బషీరాబాద్ (Pet Basheerabad) పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది.
అవి వివరాలిలా ఉన్నాయి..
ప్రియాంక అనే 26 ఏళ్ల యువతి ఎంబీఏ చదువుతోంది. ఆమె మేడ్చల్ జిల్లా (Medchal district) కుత్బుల్లాపూర్ మండలం పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలోని వెన్నెలగడ్డలో ఓ హాస్టల్ లో ఉంటుంది. ఈ క్రమంలో సోమవారం నాడు తాను అంటున్న హాస్టల్ లోనే సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ప్రియాంక ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన హాస్టల్ మేట్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. హాస్టల్ లో పరిశీలించగా పోలీసులకు ప్రియాంక ఆత్మహత్యకు సంబంధించి ఓ సూసైడ్ నోట్ దొరికింది.
ప్రియాంక ఆత్మహత్యకు కారణం ఇదే..
ప్రియాంక ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు గుర్తించారు. రవికుమార్ అనే 28 ఏళ్ల యువకుడ్ని ప్రియాంక ప్రేమిస్తుంది. గత కొంతకాలం నుంచి వీరు ప్రేమించుకుంటున్నారు. అయితే పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి రవికుమార్ ఒప్పుకోవడం లేదు. లవర్ తనను పెళ్లి చేసుకోవడం లేదని మనస్థాపానికి గురైన ప్రియాంక ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొంది. యువతి మృతి పై పెట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రవికుమార్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.






















