అన్వేషించండి

Husband plans to murder his wife: రోడ్డు ప్రమాదం స్కెచ్‌తో భార్యను చంపేశాడు - కానీ బస్సు డాష్ క్యామ్ పట్టించేసింది!

Dashcam: ఓ వ్యక్తితన భార్యను చంపాలని ప్లాన్ చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండడా ప్రమాదం చేయించాడు.కానీ దొరికిపోయాడు. ఎలాగో తెలుసా?

KSRTC bus dashcam exposed Murder Plan: కర్ణాటకలోని ధార్వాడ్‌లో జరిగిన ఒక హత్యాయత్నం కేసు సినిమా స్టోరీని తలపిస్తోంది. భార్యను వదిలించుకోవడానికి భర్త వేసిన రూ. 40 లక్షల స్కెచ్‌ను ఒక బస్సు డ్యాష్‌క్యామ్  బట్టబయలు చేసింది. 

రూ. 40 లక్షల సుపారీ - పక్కా ప్లాన్ 

ధార్వాడ్ జిల్లాకు చెందిన కిరణ్ అనే వ్యక్తి తన భార్యను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం తన స్నేహితులతో కలిసి ఒక పక్కా ప్లాన్ వేశాడు. నేరుగా చంపితే దొరికిపోతామన్న భయంతో, దీనిని ఒక  రోడ్డు ప్రమాదం లా చిత్రీకరించాలని ప్లాన్ చేశాడు. ఇందుకోసం ఏకంగా రూ. 40 లక్షల సుపారీ  ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్లాన్ ప్రకారం, జనవరి 25న కిరణ్ తన భార్యతో కలిసి టూవీలర్‌పై వెళ్తుండగా, వెనుక నుంచి ఒక వాహనంతో బలంగా ఢీకొట్టి ఆమెను చంపేయాలి.

ఘటన జరిగిన తీరు                            

కిరణ్ తన భార్యను బైక్‌పై తీసుకువెళుతుండగా, ముందే అనుకున్నట్లుగా ఒక కారు వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య తీవ్రంగా గాయపడింది. ఇది చూసిన చుట్టుపక్కల వారు సాధారణ ప్రమాదమే అనుకున్నారు. కిరణ్ కూడా అమాయకుడిలా నటిస్తూ భార్యను ఆసుపత్రిలో చేర్పించాడు. అయితే, వారి టైం బాగోలేదు.  సరిగ్గా అదే సమయంలో అదే దారిలో వెళ్తున్న ఒక కర్ణాటక ఆర్టీసీ  బస్సు ఆ దృశ్యాన్ని రికార్డ్ చేసింది.

 పోలీసులకు చిక్కిన క్లూ                          

ప్రమాదం జరిగిన తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు సిసిటివి విజువల్స్ కోసం వెతకడం ప్రారంభించారు. ఆ సమయంలో ఆ మార్గంలో వెళ్లిన KSRTC బస్సులోని డ్యాష్‌క్యామ్ ఫుటేజీని పరిశీలించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా వాహనం ఢీకొంటే వెంటనే ఆగడమో లేదా వేరే వైపు తిప్పడమో చేస్తారు. కానీ ఆ కారు కావాలనే లక్ష్యంగా చేసుకుని బైక్‌ను ఢీకొట్టడం, కారులో ఉన్న వారు కిరణ్‌తో సైగలు చేయడం వీడియోలో స్పష్టంగా కనిపించాయి.

బట్టబయలైన కుట్ర                        

ఈ వీడియో ఆధారంగా కిరణ్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారించగా, అసలు విషయం బయటపడింది. భార్యను చంపేందుకు తాను ఇచ్చిన సుపారీ వివరాలను, ఇతర నిందితుల పేర్లను కిరణ్ వెల్లడించాడు. ఆ కారు డ్రైవర్ మరియు ఇతర స్నేహితులకు రూ. 40 లక్షలు ఇస్తానని ఆశ చూపినట్లు అంగీకరించాడు. కేవలం ఒక బస్సు కెమెరా లేకపోతే ఇది ఒక ప్రమాదంగానే మిగిలిపోయేది.  ప్రస్తుతం కిరణ్‌తో పాటు అతనికి సహకరించిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. టెక్నాలజీ సహాయంతో ఒక నేరగాడు ఎలా దొరికిపోయాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.                 

టాప్ హెడ్ లైన్స్

Bengaluru Daycare Child Abuse: బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Nalgonda Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
Ongole Crime News: టూర్‌కు వెళ్లిన ఫ్యామిలీ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
ఒంగోలులో ఓ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
Instagram Reel: రీల్స్ పిచ్చి కొంపముంచింది! వజ్రాల నెక్లెస్ దొంగిలించి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్ చేసిన పనిమనిషి.. ఏడాది తర్వాత సీన్ రివర్స్!
రీల్స్ పిచ్చి కొంపముంచింది! వజ్రాల నెక్లెస్ దొంగిలించి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్ చేసిన పనిమనిషి.. ఏడాది తర్వాత సీన్ రివర్స్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Chicken Leg Roast : నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
Bengaluru Daycare Child Abuse: బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Embed widget