Pregnancy Planning : పీరియడ్స్ సమయంలో కలిస్తే పిల్లలు పుడతారా? ఆ పదిరోజుల్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మంచిదట
Pregnancy Tips : ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటుంటే.. కచ్చితంగా పీరియడ్ సైకిల్‌పై అవగాహన ఉండాలంటున్నారు నిపుణులు. అయితే ఆ పదిరోజుల్లో కలిస్తే మాత్రం ఛాన్స్‌లు ఎక్కువ ఉంటాయట.

Best Time to Get Pregnant : ప్రెగ్నెన్సీ అనేది పీరియడ్ సైకిల్‌పై ఆధారపడి ఉంటుంది. అందుకే పీరియడ్ సమయంలో కలిస్తే మంచిదో.. పీరియడ్‌లో తర్వాత కలిస్తే మంచిదా? ముందు కలిస్తే మంచిదా అనే ఆలోచన చాలామందిలో ఉంటుంది. మరి ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకునేవారు పీరియడ్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? ఏ సమయంలో కలిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించాల్సిన ఆ పదిరోజులు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
పీరియడ్ సైకిల్..
పీరియడ్ సమయంలో గర్భసంచిలో ఉన్న లైనింగ్ ద్వారా బ్లీడింగ్ ద్వారా బయటకి వస్తుంది. అండాశయాల నుంచి అండం విడుదలైన తర్వాత ఇది వస్తుంది. ఇలా వచ్చిన అండం గర్భసంచిలో ఉన్న ట్యూబ్ దగ్గర ఎదురు చూస్తుంది. అక్కడ కణాలు ఉంటే వాటితో ఫలదీకరణమైతే.. అప్పుడు ఆ పిండం.. ప్రెగ్నెన్సీగా మారుతుంది. అలా కానీ సమయంలో అండం పీరియడ్ రూపంలో బ్లీడింగ్ లాగా బయటకు వస్తుంది.
పీరియడ్ ఎప్పుడు వచ్చినా.. దానికి పదిహేను రోజులముందు అండం విడుదల అవుతుంది. అంటే మీకు నెలకు వచ్చినా.. 45 రోజులకు వచ్చినా సరే.. దానికి పదిహేను రోజులు ముందు మాత్రమే పిండం విడుదల అవుతుంది. అండం విడుదలైన 14, 15 రోజులకు పీరియడ్స్ వస్తుంది.
పీరియడ్ సైకిల్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే..
పీరియడ్‌కి ముందు కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుందా అనే క్వశ్చన్ మీలో ఉందా? నిపుణులు చెప్పేది ఏంటంటే.. పీరియడ్‌కి పదిహేను రోజుల ముందు అండం విడుదల అవుతుంది కాబట్టి.. ఆ సమయంలో 4 లేదా 5 సార్లు.. కొన్నిసందర్భాల్లో ఒక్కసారి కలిసినా.. ప్రెగ్నెన్సీ రావొచ్చు. అండం విడుదలైన మూడు నాలుగురోజుల ముందు.. విడుదలైన తర్వాత లేదా విడుదలైన మూడు నాలుగు రోజుల తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకునేవారు కలవొచ్చు.
స్పెర్మ్ కణాలు మహిళల శరీరంలో మూడు, నాలుగు రోజులు ఉంటాయట. అలా స్టోర్ అయి ఉన్న స్పెర్మ్ అండంతో ఫలదీకరణం చెందుతుంది. అయితే అండానికి 12 నుంచి 24 గంటలు మాత్రమే ఉంటుంది.
పీరియడ్ ముందు కలిస్తే..
పీరియడ్ వచ్చే 1 లేదా 2 రెండు రోజుల ముందు కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అండం విడుదలై.. దాని లైఫ్ స్పాన్ కూడా అయిపోతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్స్ తక్కువగా ఉంటాయట.
పీరియడ్ సమయంలో కలిస్తే..
పీరియడ్ సమయంలో భార్య భర్తలు కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్స్‌లు ఉంటాయా అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. పీరియడ్ మసయంలో గర్భసంచి లైనింగ్ బయటకు వచ్చేస్తుంది కాబట్టి గర్భసంచి ప్రెగ్నెన్సీకి రెడీ ఉండదు.
పీరియడ్ అయిన వెంటనే కలిస్తే..
పీరియడ్ అయిన వెంటనే కలిసినా తరువాత కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే శరీరం నెక్స్ట్ సైకిల్‌కి అండాన్ని విడుదల రెడీ చేయడంలో బిజీగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తక్కువ. ఎందుకంటే అండాలు చాలా చిన్నగా ఉంటాయి.
కాబట్టి పీరియడ్‌కి ముందే రాదు, పీరియడ్ సమయంలో, పీరియడ్ వెంటనే కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అండం విడుదలయ్యే ముందు నాలుగు రోజులు.. అండం విడుదలయ్యే రోజు.. అండం విడుదలైన నాలుగు రోజుల తర్వాత కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.






















