Newborn Health Alert : నవజాత శిశువులకు కామన్‌గా వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవే.. కొత్తగా పేరెంట్ అయినవాళ్లు కచ్చితంగా తెలుసుకోవాలట
Newborn Health Guide : అప్పుడే పుట్టిన పిల్లలకు కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. తల్లిదండ్రులు కంగారు పడకుండా వాటిని అర్థం చేసుకుని.. వైద్య సహాయం తీసుకోవాల్సి ఉంటుంది.

Common Newborn Health Issues : నవజాత శిశువును చూసుకోవడం అంటే చాలా అటెంటివ్గా ఉండాలి. తల్లి గర్భం నుంచి బయట ప్రపంచంలోకి వచ్చిన తర్వాత.. వారు వివిధ రకాల అనారోగ్యాలకు గురవుతారు. పిల్లల ఇమ్యూనిటీని బట్టి.. వివిధ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని నిపుణులు చెప్తున్నారు. అయితే వాటిని అర్థం చేసుకుని.. ఆరోగ్య సమస్యల లక్షణాలు గుర్తించి.. వాటికి తగిన వైద్య సహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు.
అప్పుడే పుట్టిన పిల్లల్లో ఆరోగ్య సమస్యలు వస్తాయట. అయితే వాటివల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని చెప్తున్నారు. అలాగే పిల్లల్లో ఈ తరహా సమస్యలు రావడం కామన్ అని కూడా చెప్తున్నారు. దాదాపు 10 శాతం మంది శిశువులు డెలివరీ తర్వాత ఆరోగ్య సమస్యలు కలిగి ఉంటారట.
నెలలు నిండకుండానే..
నెలలు నిండకుండానే లేదా పిండం నుంచి నవజాత శిశువు మారడంలో ఇబ్బందులు, రక్తంలో షుగర్ తగ్గడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, అంటువ్యాధులు, ఇతర సమస్యలు ఉంటే నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచుతారు. నవజాత శిశువులకు ట్రీట్మెంట్ చేయడానికి ఇది ప్రత్యేకమైన సదుపాయమని చెప్తున్నారు.
తీవ్రమైన ఆరోగ్య సమస్యలు
చాలామంది పిల్లలకు పుట్టిన కొద్దికాలానికే తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అవేంటో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
కామెర్లు
నవజాత శిశువుల్లో ఎక్కువగా వచ్చే తీవ్రమైన సమస్య కామెర్లు. పిల్లలు పుట్టిన 3 లేదా 4వ రోజు ఇది వచ్చి.. వారంన్నర వరకు ఉండొచ్చు. కళ్ల రంగు మారే అవకాశం ఉంది. బిలిరుబిన్ స్థాయిలు అధికంగా ఉంటే ఈ సమస్య వస్తుంది. కాలేయం పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల జరుగుతుంది. తర్వాత మెల్లిగా ఈ లక్షణాలు అదృశ్యమవుతాయి. ప్రసవం తర్వాత 24 గంటలలోపు ఇది ప్రారంభమైతే.. మూడువారాల కంటే ఎక్కువకాలం కొనసాగితే వైద్యుల సూచనలు తీసుకోవాలి.
కడుపు ఉబ్బరం..
కొందరు శిశువులకు కడుపు ఉబ్బినట్లు ఉంటుంది. మలబద్ధకం, కడుపులో వాయువు సాధారణమైన కారణం అవుతాయి. అయినప్పటికీ.. సమస్య ఎక్కువరోజులు ఉంటే.. వైద్యుని దగ్గరికి తీసుకెళ్లాలి.
దగ్గు
పిల్లలకు తల్లులు పాలు ఇచ్చినన తర్వాత దగ్గుతారు. కోపింగ్ మెకానిజమ్ అభివృద్ధి చెందడాన్ని ఇది సూచిస్తుంది. దగ్గు కంటిన్యూగా వస్తే ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థలో సమస్యగా గుర్తించాలి. వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాలి.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
పిల్లలు గాలి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. కడుపులో శ్లేష్మం, ముక్కులో గద్యాలై పరిమాణం వల్ల శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. అయితే ఇది కామన్ అయినా.. కంటిన్యూగా వస్తే వైద్యుల సలహా తీసుకోవాలి.
ఇన్ఫెక్షన్లు
పిల్లలకు తరచుగా చెవి నొప్పి, ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. దానివల్ల పిల్లలు చిరాకు పడుతూ, ఏడుస్తూ ఉంటారు. సాధారణంగా కంటే ఎక్కువసార్లు ఏడిస్తే.. చెవులను లాగడం లేదా మసాజ్ చేయడం చేయాలి. నిద్రలేమి, ఆకలి వల్ల కూడా ఏడుస్తూ ఉండొచ్చు. వైద్యుల సలహా తీసుకుని.. చికిత్స అందించాలి.
గ్యాస్ నొప్పి
శిశువు జీర్ణాశయంలోని గ్యాస్ నొప్పిని కలిగిస్తుంది. దీనివల్ల పిల్లలు ఎక్కువగా ఏడుస్తారు. లేదా నీరసంగా ఉంటారు. ఈ సమస్యను గుర్తిస్తే వైద్య నిపుణులను సంప్రదించాలి. దీనివల్ల త్వరగా మంచి ఫలితాలు ఉంటాయి.
చర్మ సమస్యలు
శిశువు చర్మంపై మచ్చలు, స్కిన్ పగలడం, రంగు మారడం, పొడిబారడం చూస్తూ ఉంటాము. ఇవి కొన్ని వారాల్లో క్లియర్ అవుతాయి. బేబి చర్మంపై పొరలను ఊడుతూ.. కొత్తవాటితో భర్తీ అవుతాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. లోషన్లు, క్రీమ్స్ వాడకపోవడమే మంచిది.
దద్దుర్లు
ఫుడ్, నిద్ర విషయంలో జరిగే మార్పుల వల్ల పిల్లలకు దద్దుర్లు, గట్ ఏరియాలో రెడ్నెస్ చికాకు కలిగిస్తాయి. పిల్లలకు వేసే దుస్తుల వల్ల కూడా ఇలా జరగొచ్చు. కాబట్టి న్యాపీ రాష్‌ను నివారించడానికి.. మంచి దుస్తులు, డైపర్లు ఎంపిక చేసుకోవాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ర్యాష్ తగ్గకుంటే వైద్యుల దగ్గరికి తీసుకెళ్లాలి.
తలపై మచ్చలు, పొలుసు వంటి సమస్యలు వస్తాయి. అవి గట్టిపడి తీయడం కష్టమైతే.. కచ్చితంగా వైద్యులు సూచించే షాంపూను వాడాల్సి ఉంటుంది. అలాగే వాటిని తొలగించాలన్నా బాగా ఫోర్స్‌తో కాకుండా సుకుమారంగా తొలగించేందుకు ప్రయత్నించాలి. ఇవే కాకుండా ఇతర అలెర్జీలు కూడా వస్తుంటాయి. అలాంటివి గుర్తిస్తే శిశువైద్యుల దగ్గరకు తీసుకెళ్లాలి. వారు ట్రీట్మెంట్ అందించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తారు.
Also Read : ప్రెగ్నెన్సీ సమయంలో కచ్చితంగా తినాల్సిన పండ్లు ఇవే.. డెలివరీ సమయానికి స్ట్రాంగ్‌గా అవుతారట






















