Pregnancy Diet : ప్రెగ్నెన్సీ సమయంలో కచ్చితంగా తినాల్సిన పండ్లు ఇవే.. డెలివరీ సమయానికి స్ట్రాంగ్‌గా అవుతారట
Pregnancy Tips : గర్భిణీగా ఉన్నప్పుడు కొన్ని ఫుడ్స్ రెగ్యులర్‌గా తింటే.. ప్రసవ సమయానికి తల్లికి బలం చేకూరుతుందని అంటున్నారు. ముఖ్యంగా కొన్ని పండ్లు తింటే మంచిదని చెప్తున్నారు. అవి ఏంటంటే..

Pregnancy Diet : ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు కచ్చితంగా పోషకాహారం తీసుకోవాలి. ఇది కడుపులోని బిడ్డకి, తల్లికీ మేలు చేస్తుంది. పిండం పెరుగుదల బాగుండాలంటే శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా అందించాలి. బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవ్వాలి. ప్రసవానికి శరీరాన్ని ప్రిపేర్ చేయడం కోసం కొన్ని రకాల పండ్లను డైట్లో తీసుకోవాలంటున్నారు నిపుణులు.
పండ్లలో సహజమైన పోషకాలు ఉంటాయి. ఫైబర్‌ని, విటమిన్లను అందించడమే కాకుండా హైడ్రేషన్‌ని ఇస్తాయి. శరీరానికి కావాల్సిన బలాన్ని అందించి.. ప్రసవ సమయానికి శరీరాన్ని సిద్ధం చేస్తాయి. అందుకే కొన్ని పండ్లను కచ్చితంగా డైట్లో చేర్చుకోవాలి. ఇంతకీ ఏ పండు తింటే ఎలాంటి లాభాలు శరీరానికి అందుతాయో ఇప్పుడు చూసేద్దాం.
అరటిపండ్లు
అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాల తిమ్మరి తగ్గించి.. శక్తిని అందిస్తాయి. అలసటను దూరం చేస్తాయి. తల్లులు యాక్టివ్‌గా, స్ట్రాంగ్‌గా ఉండేలా హెల్ప్ చేస్తాయి.
ఆరెంజ్
రోగనిరోధక శక్తిని, హైడ్రేషన్‌ను పెంచుకోవడానికి ఆరెంజ్‌ను తీసుకోవచ్చు. వీటిలో విటిమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అనేమియాను దూరం చేసి.. డెలివరి సమయంలో శక్తిని అందిస్తుంది. నీటి శాతం పుష్కలంగా ఉండడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కి గురికాదు.
యాపిల్స్
యాపిల్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. త్వరగా జీర్ణమవుతుంది. దీనివల్ల మలబద్ధకం దూరమవుతుంది. ప్రెగ్నెన్సీలో వచ్చే డిస్కంఫర్ట్ని ఇది దూ చేస్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది.
దానిమ్మ
దానిమ్మ ఐరన్‌ని అందిస్తుంది. రక్తహీనతను దూరం చేసి.. హెల్తీగా ఉంచడంలో సహాయం చేస్తుంది. కండరాలకు ఆక్సినజన్ను సరఫరా చేసి.. రిలీఫ్‌ని ఇస్తుంది.
బొప్పాయి
పండిన బొప్పాయిలను కూడా వైద్యుల సూచనతో తీసుకోవచ్చు. ఇవి మెరుగైన జీర్ణక్రియను అందిస్తాయి. గుండెల్లో మంటను తగ్గిస్తాయి. విటమిన్ సి, బీటా కెరోటీన్ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.
పుచ్చకాయ
పుచ్చకాయలోని అధిక నీటి శాతం డీహైడ్రేషన్‌ను నిరోధిస్తుంది. ప్రెగ్నెన్సీలో వచ్చే వాపులనుంచి ఉపశమనం ఇస్తుంది. దీనిలోని మెగ్నీషియం కండరాలకు విశ్రాంతిని ఇస్తుంది. కాలు తిమ్మిర్లను తగ్గిస్తుంది.
బెర్రీలు
బెర్రీల్లోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి శరీరానికి శక్తిని అందిస్తాయి. స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ, రాస్ప్బెర్రీలను మీరు డైట్లో తీసుకోవచ్చు. ఇవి ప్రసవ సమయంలో శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి.
అవకాడో
అవకాడోలో హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్, ఫోలేట్, పొటాషియం ఉంటాయి. ఈ మంచి కొవ్వులు పిండం పెరుగుదలకు, వారి బ్రెయిన్ హెల్త్‌కి మేలు చేస్తాయి. శక్తిని అందిస్తాయి.
ఈ పండ్లను మీరు నేరుగా తీసుకోవచ్చు. లేదా స్మూతీలలో, సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల కోసం ఓట్మీల్తో కలిపి తినొచ్చు. ఇవన్నీ మిమ్మల్ని హైడ్రెటెడ్‌గా ఉంచడానికి, శరీరానికి అవసరమైన పోషకాలు అందించడానికి హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా లేబర్ పెయిన్స్‌ని కంట్రోల్ చేయడంలో శరీరానికి మద్ధతు ఇవ్వడంలో బాగా హెల్ప్ చేస్తాయి. అయితే వీటిని తీసుకునేముందు కచ్చితంగా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.
Also Read : ఉదయాన్నే బీట్రూట్, క్యారెజ్ జ్యూస్ తాగితే బరువు తగ్గుతారా? నిపుణుల సలహాలు ఇవే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

