స్ట్రాబెర్రీలను ఇష్టంగా తింటారా? అయితే దీనితో ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఎన్నో ప్రయోజనాలు అందుతాయి.

వీటిలోని విటమిన్ సి వంటి ఎన్నో యాంటీఆక్సిడెంట్లు స్కిన్ డ్యామేజ్ కాకుండా, ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.

యాంటీఆక్సిడెంట్లు ముడతలను, వృద్ధాప్యఛాయలను దూరం చేస్తాయి. మచ్చలు తగ్గించి ఫ్రెష్ లుక్​ని ఇస్తాయి.

ఆల్ఫా హైడ్రాక్సీ లక్షణాలు చర్మాన్ని ఎక్స్​ఫోలియేట్ చేసి.. మృతకణాలను తొలగించి మెరిసే చర్మాన్ని అందిస్తాయి.

చర్మానికి మాయిశ్చరైజ్ అందించి.. స్కిన్ డ్రై కాకుండా హెల్ప్ చేస్తాయి. మంటను తగ్గిస్తాయి.

స్ట్రాబెర్రీల్లోని సాలిసిలిక్​ యాసిడ్ పింపుల్స్​ని తగ్గించి.. మచ్చలను కూడా తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.

వీటిలోని లింకోపెనె యాంటీఆక్సిడెంట్ సన్ డ్యామేజ్​ నుంచి స్కిన్​ని కాపాడడమే కాకుండా స్కిన్ క్యాన్సర్​ను రాకుండా హెల్ప్ చేస్తుంది.

దీనిలోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి.. స్కిన్​ని సుతిమెత్తగా చేస్తుంది.

వీటిలోని యాంటీఇన్​ఫ్లమేటరీ లక్షణాలు స్కిన్​ ఇరిటేషన్​ను, రెడ్​నెస్​ను తగ్గిస్తాయి.

వీటిని డైరక్ట్​గా తిన్నా, మాస్క్​గా వేసుకున్నా, జ్యూస్​గా తీసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయి.