సమ్మర్​ పెద్దలకే కష్టంగా ఉందంటే పిల్లలకు ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే వారి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

తరచుగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తూ ఉంటే పిల్లలు హైడ్రేటెడ్​గా ఉంటారు.

ఫార్మూలా ఫీడింగ్ ఇస్తే.. వారికి ఓరఎస్, సాలిడ్ ఫుడ్స్ తినిపించాక నీళ్లను ఇస్తూ ఉండాలి.

పలుచని కాటన్ దుస్తులు వేస్తే పిల్లలకు హాయిగా ఉంటుంది. సిల్క్, పట్టువంటివి వేయకపోవడమే మంచిది.

ఎయిర్​ఫ్లో బాగుండేలా చూసుకోండి. పిల్లలను ఎండలో తిప్పకపోవడమే మంచిది.

పిల్లలు ఉండే ప్రాంతాల్లో వారి శరీర ఉష్ణోగ్రత, వారు తట్టుకోగలిగే స్థితిని బట్టి ఫ్యాన్ వేసి ఉంచండి.

డైపర్స్ మారుస్తూ ఉంటే.. ర్యాష్ లాంటివి రాకుండా ఉంటాయి. ఇరిటేషన్​ని పోగెట్టే క్రీమ్స్​ని ఉపయోగించండి.

పిల్లల నిద్రకు ఇబ్బంది లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి.

బయటకు తీసుకెళ్తే బాడీ మొత్తం కవర్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకోండి.

ఇవి కేవలం అవగాహన కోసమే నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.