అన్వేషించండి

Zomato New Name: 'శాశ్వతం'గా పేరు మార్చుకున్న జొమాటో - ఫుడ్‌ సర్వీస్‌లు కూడా మారతాయా?

Zomato Became Eternal: నూతన మార్పు కార్పొరేట్ సంస్థకు మాత్రమే వర్తిస్తుందని & జొమాటో బ్రాండ్ పేరు లేదా యాప్‌లో ఎటువంటి మార్పులు ఉండవని ఫుడ్ డెలివెరీ దిగ్గజం తెలిపింది.

Zomato Will Now Be Eternal Ltd: ఆన్‌లైన్‌ ఆర్డర్‌ ద్వారా ఇంటి వద్దకు ఆహారం తెప్పించుకోకపోయినా, జొమాటో పేరు వినని వ్యక్తి పట్టణాలు, నగరాల్లో దాదాపుగా ఉండడు. అంతలా పాపులర్‌ అయింది జొమాటో. ఇప్పుడు, ఆ కంపెనీ పేరు మారింది. కార్పొరేట్ పేరును అధికారికంగా "ఎటర్నల్ లిమిటెడ్‌" (Eternal Ltd)గా మార్చడానికి, జొమాటో లిమిటెడ్, తన షేర్‌హోల్డర్ల నుంచి తుది ఆమోదం పొందింది. ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఎటర్నల్‌ అంటే 'శాశ్వతంగా ఉండేది' అని అర్ధం.

పేరుతో పాటు ఫుడ్‌ డెలివెరీ సర్వీస్‌లు కూడా మారతాయా?
పేరు మార్పు కార్పొరేట్ సంస్థకు మాత్రమే వర్తిస్తుందని ఎక్సేంజ్‌ ఫైలింగ్‌లో ఆ కంపెనీ స్పష్టం చేసింది. జొమాటో బ్రాండ్ పేరు లేదా యాప్‌ లేదా సర్వీస్‌ల్లో ఎటువంటి మార్పులు ఉండవని వెల్లడించింది.

తన క్విక్‌ కామర్స్‌ కంపెనీ బ్లింకిట్‌ ‍‌(Zomato's Quick Commerce Company Blinkit) కార్యకలాపాలను వైవిధ్యపరిచే ప్రయత్నాలలో ఇది ఒక పెద్ద ముందడుగు అవుతుందని, ఫుడ్‌ డెలివెరీ సర్వీస్‌ అందరికీ తెలిసిన జొమాటో బ్రాండ్ పేరిటే కొనసాగుతుందని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.

వాస్తవానికి, కంపెనీ పేరు & బ్రాండ్‌ పేరు ఒకేలా ఉండకూడదని, జొమాటో (ఇప్పుడు ఎటెర్నల్‌ లిమిటెడ్‌) సీఈవో దీపిందర్ గోయల్ ‍‌(Zomato CEO Deepinder Goyal) గతంలోనే చెప్పారు. కార్పొరేట్‌ కంపెనీ పేరు, బ్రాండ్‌ పేరును వేర్వేరుగా ఉంచుతామన్న మాటను ఇప్పుడు నిజం చేశారు. ఉదాహరణకు.. మనందరికీ తెలిసి తాజ్‌మహల్‌ టీపొడిలో 'తాజ్‌మహల్‌' అనేది బ్రాండ్‌ పేరు. 'హిందుస్థాన్‌ యూనిలీవర్‌ లిమిటెడ్‌'కు చెందిన బ్రాండ్‌ ఇది. సేమ్‌ అలాగే, ఎటర్నల్‌ లిమిటెడ్‌ అనేది కంపెనీ పేరుగా ఉంటుంది, జొమాటో బ్రాండ్‌తో ఫుడ్‌ డెలివెరీ సర్వీస్‌లు కొనసాగుతాయి.

ఈ మార్పులో భాగంగా, జొమాటో కార్పొరేట్ వెబ్‌సైట్ zomato.com నుంచి eternal.com కు అప్‌డేట్‌ అవుతుంది. ఇంకా, కంపెనీ స్టాక్ టిక్కర్ ‍‌(స్టాక్‌ పేరు) ZOMATO నుంచి ETERNAL కు మారుతుంది.

పేరు మార్పు వెనుక పెద్ద ప్లాన్
ఈ రీబ్రాండింగ్ అనేది కంపెనీ దీర్ఘకాలిక వ్యూహాల్లో ఒక భాగం. ఎందుకంటే, ఫుడ్ డెలివరీ సేవలను మించి విస్తరించాలని ఎటర్నల్‌ ఆలోచిస్తోంది, బ్లింకిట్‌ తరహాలో మరిన్ని వ్యాపారాలు చేయాలని చూస్తోంది. జొమాటో అంటే కేవలం ఫుడ్‌ డెలివెరీ మాత్రమే గుర్తుకువస్తుంది కాబట్టి, ఆ పరిమితి నుంచి బయటపడేందుకే కార్పొరేట్‌ కంపెనీ పేరును మార్చుకుంది. ఎటర్నల్‌ కింద బ్లింకిట్‌తో పాటు డిస్ట్రిక్ట్, హైపర్‌ప్యూర్ బ్రాండ్స్‌ కూడా పని చేస్తున్నాయి.

జొమాటో షేర్‌ ధర
స్టాక్‌ మార్కెట్‌లో కొనసాగుతున్న అమ్మకాల ఒత్తిడి కారణంగా, ఈ రోజు (సోమవారం, 10 మార్చి 2025) జొమాటో షేర్లు 2.45% పతనమై రూ.211.51 వద్ద క్లోజ్‌ అయ్యాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: పాత పద్ధతులు వదిలేయండి, ఈ క్వాలిటీస్‌ ఉంటే మీ సంపద సరసరా పెరుగుతుంది! 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nellore Mayor Politics: వైసీపీకి రాజీనామా చేసినా నెల్లూరు మేయర్ పీఠం గల్లంతే - అవిశ్వాసం పెట్టిన టీడీపీ మద్దతు కార్పొరేటర్లు
వైసీపీకి రాజీనామా చేసినా నెల్లూరు మేయర్ పీఠం గల్లంతే - అవిశ్వాసం పెట్టిన టీడీపీ మద్దతు కార్పొరేటర్లు
Wanaparthy Kavitha: నాపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిరంజన్ రెడ్డి పుచ్చ లేసి పోతుంది -  కవిత వార్నింగ్
నాపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిరంజన్ రెడ్డి పుచ్చ లేసి పోతుంది - కవిత వార్నింగ్
The Raja Saab : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ప్రభాస్ డైరెక్టర్ సారీ - అసలు రీజన్ ఏంటంటే రాజా సాబ్?
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ప్రభాస్ డైరెక్టర్ సారీ - అసలు రీజన్ ఏంటంటే రాజా సాబ్?
Nalgonda Politics: నల్గొండలో సీఎం రేవంత్ వర్సెస్ మంత్రి కోమటిరెడ్డి.. చిచ్చురేపిన డీసీసీ అధ్యక్ష పదవి
నల్గొండలో సీఎం రేవంత్ వర్సెస్ మంత్రి కోమటిరెడ్డి.. చిచ్చురేపిన డీసీసీ అధ్యక్ష పదవి
Advertisement

వీడియోలు

India vs South Africa ODI | టీమిండియా ODI స్క్వాడ్ పై ట్రోల్స్ | ABP Desam
Bollywood legend Dharmendra Passed Away | బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర అస్తమయం | ABP Desam
కెప్టెన్‌గా రాహుల్.. షమీకి మళ్లీ నిరాశే..!
India vs South Africa 2nd Test Match Highlights | మూడో సెషన్లో టీమిండియా కం బ్యాక్
England vs Australia Ashes 2025 | ఆస్ట్రేలియా ఘన విజయం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nellore Mayor Politics: వైసీపీకి రాజీనామా చేసినా నెల్లూరు మేయర్ పీఠం గల్లంతే - అవిశ్వాసం పెట్టిన టీడీపీ మద్దతు కార్పొరేటర్లు
వైసీపీకి రాజీనామా చేసినా నెల్లూరు మేయర్ పీఠం గల్లంతే - అవిశ్వాసం పెట్టిన టీడీపీ మద్దతు కార్పొరేటర్లు
Wanaparthy Kavitha: నాపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిరంజన్ రెడ్డి పుచ్చ లేసి పోతుంది -  కవిత వార్నింగ్
నాపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిరంజన్ రెడ్డి పుచ్చ లేసి పోతుంది - కవిత వార్నింగ్
The Raja Saab : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ప్రభాస్ డైరెక్టర్ సారీ - అసలు రీజన్ ఏంటంటే రాజా సాబ్?
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ప్రభాస్ డైరెక్టర్ సారీ - అసలు రీజన్ ఏంటంటే రాజా సాబ్?
Nalgonda Politics: నల్గొండలో సీఎం రేవంత్ వర్సెస్ మంత్రి కోమటిరెడ్డి.. చిచ్చురేపిన డీసీసీ అధ్యక్ష పదవి
నల్గొండలో సీఎం రేవంత్ వర్సెస్ మంత్రి కోమటిరెడ్డి.. చిచ్చురేపిన డీసీసీ అధ్యక్ష పదవి
Dharmendra Net Worth: బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్ర ఆస్తి విలువ ఎన్ని కోట్లో తెలుసా? ఫ్యామిలీకి వచ్చేది ఎంతంటే?
బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్ర ఆస్తి విలువ ఎన్ని కోట్లో తెలుసా? ఫ్యామిలీకి వచ్చేది ఎంతంటే?
CJI SuryaKant: నూతన CJIగా ప్రమాణం చేసిన జస్టిస్ సూర్యకాంత్.. ఆయన ఇచ్చిన 10 ముఖ్యమైన తీర్పులు ఇవే
నూతన CJIగా ప్రమాణం చేసిన జస్టిస్ సూర్యకాంత్.. ఆయన ఇచ్చిన 10 ముఖ్యమైన తీర్పులు ఇవే
Balakrishna : బాలయ్యతో హీరోయిన్ స్పెషల్ సాంగ్? - సిల్వర్ స్క్రీన్‌పై ఈ కాంబో ఎక్స్‌పెక్ట్ చేసుండరు!
బాలయ్యతో హీరోయిన్ స్పెషల్ సాంగ్? - సిల్వర్ స్క్రీన్‌పై ఈ కాంబో ఎక్స్‌పెక్ట్ చేసుండరు!
Maruti S Presso Price: మారుతి ఆల్టో కన్నా చౌక కారు, 3.5 లక్షలతో కొత్త బ్రాండెడ్ 5 సీటర్ కారు !
మారుతి ఆల్టో కన్నా చౌక కారు, 3.5 లక్షలతో కొత్త బ్రాండెడ్ 5 సీటర్ కారు !
Embed widget