IPL 2025 Jio Offers: మీ దగ్గర రూ.100 ఉంటే చాలు, జియో హాట్‌స్టార్ సబ్‌స్ర్కిప్షన్ ఉచితం - IPL మెరుపులన్నీ చూడొచ్చు!
Jio Mobile Recharge Plan: కొత్త IPL సీజన్ ప్రారంభానికి ముందు రిలయన్స్ జియో చాలా తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. దీనిలో 90 రోజుల పాటు జియో హాట్‌స్టార్ సబ్‌స్ర్కిప్షన్ కూడా లభిస్తుంది.

Jio Mobile Recharge Plan Offers For IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ (IPL 18th Edition) ఈ నెల మూడో వారంలో, 2025 మార్చి 22 నుంచి ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025) మజాను ఆస్వాదించిన క్రికెట్ ప్రియులు, ఇప్పుడు ఐపీఎల్ కొత్త సీజన్‌పై దృష్టి పెట్టారు. క్రికెట్ అభిమానుల కోసం, ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో 100 రూపాయల రీఛార్జ్ ప్లాన్‌ను పరిచయం చేసింది. కొన్నాళ్ల క్రితం లాంచ్ అయిన ఈ కొత్త ప్లాన్ "డేటా ఓన్లీ" రీఛార్జ్ ప్యాక్. దీనిలో 100 రూపాయల రీఛార్జ్‌తో మీకు 5 GB డేటా & 90 రోజుల జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ (Jio Hotstar Subscription) లభిస్తుంది. డేటా ప్రయోజనాలతో కూడిన ఈ ప్యాక్ ప్రస్తుతం జియో రీఛార్జ్ ఫ్లాట్‌ఫామ్ Jio.comలో అందుబాటులో ఉంది.
జియో సినిమా & డిస్నీ+ హాట్‌స్టార్ విలీనం తర్వాత, రిలయన్స్ జియో తన అన్ని రీఛార్జ్ ప్లాన్‌ల నుంచి బేసిక్ జియో సినిమా బెనిఫిట్‌ను తొలగించింది. ఈ నేపథ్యంలో, మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే IPL 18వ సీజన్ (IPL 18th Season) ఫీవర్‌ను మీరు మిస్ కాకూడదు అనుకుంటే Jio Hotstar సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి.
100 రూపాయల జియో ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు
ఈ ప్యాక్ తీసుకుంటే 90 రోజులు చెల్లుబాటు గడువు ఉంటుంది.
దీనిలో యూజర్‌కు మొత్తం 5 GB హై స్పీడ్ ఇంటర్నెట్ లభిస్తుంది.
5 GB పరిమితి అయిపోయిన తర్వాత కూడా డేటా అందుబాటులో ఉంటుంది. కాకపోతే, అప్పుడు ఇంటర్నెట్ వేగం 64 Kbpsకు పరిమితం అవుతుంది.
ఈ ప్లాన్‌లో కాలింగ్ & SMS సౌకర్యం ఉండదు
జియో 100 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్‌ను బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. దీని ద్వారా మీరు స్మార్ట్‌ఫోన్ & స్మార్ట్ టీవీలో 1080p రిజల్యూషన్‌లో 90 రోజుల పాటు కంటెంట్ చూడవచ్చు. ఇది IPL అభిమానులకు బెస్ట్ ఆప్షన్ అవుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, దీనిలో కాలింగ్ లేదా SMS సౌకర్యం ఉండదు. జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన ఈ కొత్త 'డేటా ఓన్లీ ప్యాక్'ను యాక్టివేట్ చేయడానికి, వినియోగదారులు బేస్ ప్లాన్ తీసుకోవాలి లేదా మీ ఫోన్‌లో ఇప్పటికే ఉండాలి.
రూ.100 ప్లాన్ ఇతర రెగ్యులర్ ప్లాన్‌ల కంటే భిన్నం, ఎందుకంటే?
ఐపీఎల్ ప్రియుల కోసం మరో రెగ్యులర్ ప్లాన్ కూడా Jio.comలో లిస్ట్ అయి ఉంది, దానిలోనూ జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు. ఆ ప్లాన్ ధర 149 రూపాయలు, 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. దీనిలో కంటెంట్‌ను కేవలం ఒక్క పరికరంలో మాత్రమే చూడగలరు. ఇది ప్రీమియం ప్లాన్ కాదు కాబట్టి ప్రకటనలు కూడా ఉంటాయి. అయితే, 100 రూపాయల ప్లాన్‌లో, వినియోగదారులు స్మార్ట్‌ఫోన్ & స్మార్ట్‌టీవీ రెండింటిలోనూ IPL మ్యాచ్‌లను చూడొచ్చు. ఇంకా, జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న వెబ్ సిరీస్‌లు, సినిమాలను కూడా 1080p రిజల్యూషన్‌లో వీక్షించవచ్చు. దీనితో పోలిస్తే, జియో హాట్‌స్టార్ సూపర్ ప్లాన్‌కు సమానమైన స్టాండ్ ఎలోన్ రీఛార్జ్ ప్లాన్ మరొకటి ఉంది, దాని ధర 299 రూపాయలు.





















