Weight Loss Meal Plan : పోషకాలతో కూడిన హెల్తీ డైట్ ప్లాన్.. ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఇది
Healthy Weight Loss Meal Plan : పోషకాలతో కూడిన ఆహారాన్ని శరీరానికి అందించాలనుకుంటే మీరు మంచి డైట్ ప్లాన్‌ని ఫాలో అవ్వాలి. రోజంతా ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటూ బరువు తగ్గాలనుకుంటే ఇది ఫాలో అయిపోండి.

Effective Weight Loss Meal Plan : మనం తీసుకునే ఆహారం.. ఆరోగ్యాన్ని, చర్మాన్ని ఆకృతిని నేరుగా ప్రభావితం చేస్తుంది. అందుకే సమతుల్యమైన, పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటూ ఉండాలి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడుతూ.. చర్మ సమస్యలను దూరం చేస్తుంది. జంక్ ఫుడ్, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు బరువు పెరగడానికి, దీర్ఘకాలిక సమస్యలకు దారి తీస్తాయి. కాబట్టి హెల్తీ లైఫ్ స్టైల్‌తో పాటు బరువు తగ్గడంలో వండర్స్ చేసే మీల్ ప్లాన్‌ని కూడా ఫాలో అవ్వాలి.
అందరూ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఫిట్‌గా, బరువు తగ్గాలంటే భోజనం తినడం మానేయకూడదు. హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అప్పుడే మీరు అనుకున్న లక్ష్యాలను ఆరోగ్యకరంగా చేరుకుంటారు. మరి హెల్తీగా ఉండేందుకు ఆహారపు అలవాట్లను ఎలా ప్లాన్ చేసుకోవాలి. ఏ ఫుడ్‌కి దూరంగా ఉంటే మంచిది విషయాలు ఇప్పుడు చూసేద్దాం.
నిద్రలేచిన వెంటనే..
నిద్ర లేచిన పది నుంచి 15 నిమిషాల్లో ఏదైనా ఆహారాన్ని శరీరానికి అందించాలని చెప్తున్నారు. అరటిపండ్లు లేదా బాదం, వాల్నట్స్, నానబెట్టిన గింజలు తీసుకుంటే మంచిది. శరీరానికి కావాల్సిన పోషకాలు అందించి.. రోజంతా మీరు యాక్టివ్‌గా ఉండడంలో హెల్ప్ చేస్తాయి. అలాగే ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీలు తాగకూడదని చెప్తున్నారు. అలా తాగితే మొటిమలు కూడా వస్తాయట. తేలికపాటి పోషకాహారంతో రోజును ప్రారంభిస్తే శరీరం దానికి అలవాటు పడుతుందట.
మధ్యలో క్రేవింగ్స్ వస్తే.. మీరు సీజనల్ ఫ్రూట్స్, కొబ్బరి నీళ్లు, ఇంట్లో తయారు చేసుకున్న హెర్బల్ డ్రింక్స్ తీసుకోవచ్చు. మీరు స్నాక్స్, టీ లాంటివి తీసుకుంటే కడుపు ఉబ్బరం వస్తుంది. ఫ్రెష్, హెల్తీ ఫుడ్ ఆకలిని అరికట్టి.. శరీరానికి పోషకాలు అందిస్తూ హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.
బ్రేక్‌ఫాస్ట్‌గా..
బ్రేక్‌ఫాస్ట్‌గా ఇడ్లీ, దోశ, పోహా వంటివి హాయిగా లిమిటెడ్‌గా తీసుకోవచ్చు. వీటిలో కూడా పోషకాలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయకూడదు. మానేస్తే మీకు క్రేవింగ్స్ ఎక్కువ అవుతాయి. అలాగే మీరు యాక్టివ్‌గా ఉండలేరు.
మధ్యాహ్న భోజనం
చపాతీ, అన్నం, పప్పు, సీజనల్ వెజిటేబుల్స్‌ను మీ డైట్‌లో చేర్చుకోవచ్చు. వీటిలో పోషకాలు ఉంటాయి. తేలికపాటి, సమతుల్య భోజనం మీ కడుపు నిండుగా ఉండేలా చేసి.. హెల్తీగా ఉంచుతుంది. అలాగే జొన్నలు, రాగులు మంచి ఎంపికి. అయితే వీటిని కలిపి ఒకేసారి తీసుకోకూడదు.
స్నాక్స్ టైమ్..
ఎక్కువమంది మిస్టేక్స్ చేసే టైమ్ ఇదే. లంచ్, డిన్నర్‌కి ఎక్కువ సమయం ఉండడంతో చాలామంది క్రేవింగ్స్తో రకరకాల ఫుడ్స్ తినేస్తారు. ఇది అస్సలు మంచిది కాదు. ఈ సమయంలో మీకు ఆకలివేస్తే.. నట్స్, వేరుశెనగలు, స్ప్రౌట్స్‌ను స్నాక్స్‌గా తీసుకోవచ్చు. ఇవి పోషకాలతో నిండి.. కడుపు నిండుగా ఉంచేలా చేస్తాయి. టీ లేదా కాఫీని తక్కువ చక్కెరతో తీసుకోవచ్చు. లేదంటే గ్రీన్ టీ మంచి ఆప్షన్.
డిన్నర్ కోసం..
డిన్నర్ కచ్చితంగా 7 నుంచి 8.30 గంటల మధ్య ఉండేలా చూసుకోండి. నిద్రకు కనీసం 2 నుంచి 3 గంటల ముందు భోజనం చేయాలి. పప్పులతో కిచిడీ, వెజిటెబుల్ సూప్స్ హెల్తీ ఆప్షన్. ఇవి త్వరగా జీర్ణమవుతాయి కూడా. జీర్ణ సమస్యలు దూరమవుతాయి. మెరుగైన నిద్ర కూడా మీ సొంతమవుతుంది.
ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటూ బరువు తగ్గాలనుకునేవారు.. ఈ డైట్‌ని ఫాలో అవ్వొచ్చు. మీ లైఫ్‌స్టైల్‌కి, మీ ఆహారపు అలవాట్లకి, శరీరానికి అందించాల్సిన పోషకాలకు తగ్గట్లు మీరు దీనిని ప్లాన్ చేసుకోవచ్చు. లేదా నిపుణుల సలహాలతో డైట్ తీసుకుని ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.






















