క్యారెట్ జ్యూస్ విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇది స్కిన్​ హెల్త్​కి చాలా మంచిది.

రోజూ దీనిని తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందడంతో పాటు.. అందానికి బెనిఫిట్స్ పొందొచ్చు.

క్యారెట్​ జ్యూస్​లో విటమిన్ సి ఉంటుంది. ఇది కొల్లాజిన్ ఉత్పత్తిని పెంచి ముడతలను, వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది.

దీనిలోని బీటా కెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు స్కిన్ డ్యామేజ్​ కాకుండా, స్కిన్ క్యాన్సర్ రాకుండా కాపాడుతాయి.

యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు కలిసి హైపర్ పిగ్మెంటేషన్​ను పోగొడతాయి. మచ్చలను తగ్గిస్తాయి.

డ్రైనెస్​ని దూరం చేసి.. హైడ్రేషన్​ని అందిస్తాయి. ముడతలు తగ్గుతాయి. స్కిన్ హెల్తీగా ఉంటుంది.

యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు పింపుల్స్ సమస్యను తగ్గించి.. క్లియర్ స్కిన్​ని ప్రమోట్ చేస్తాయి.

విటమిన్ ఏ స్కిన్​ హెల్త్​కి చాలామంచిది. ఇది మీ మేని ఛాయను కూడా మెరుగు చేస్తుంది.

రోజూ ఫ్రెష్​గా క్యారెట్ జ్యూస్ చేసుకుని.. బ్రేక్​ఫాస్ట్ సమయంలో తీసుకుంటే మంచిది.

క్యారెట్​ జ్యూస్​ని తాగడమే కాదు.. ఫేస్​మాస్క్​గా కూడా ఉపయోగించుకోవచ్చు.