అన్వేషించండి

DNA Diet for Diabetes : DNA డైట్​ గురించి తెలుసా? డయాబెటిస్​ ప్రమాదాన్ని తగ్గిస్తుందంటోన్న కొత్త అధ్యయనం

DNA Diet : డీఎన్​ఏ డైట్​తో టైప్​ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని చెప్తున్నారు నిపుణులు. కొత్త అధ్యయనం దీనికి అనుకూల ఫలితాలు ఇచ్చింది. ఈ డిఎన్ఏ డైట్ ఏంటో, దానివల్ల కలిగే లాభాలేంటో చూసేద్దాం.

DNA diet May Lower Type 2 Diabetes Risk : టైప్​ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో DNA డైట్ మంచిఫలితాలు ఇస్తుందని తాజా అధ్యయనం తెలిపింది. అయితే ఈ డీఎన్​ఏ డైట్​ గురించిన పూర్తి వివరాలు ఏంటి? ఇది టైప్​ 2 డయాబెటిస్​ని ఎలా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. 

DNA డైట్ 

DNA డైట్ అంటే ఓ వ్యక్తి DNA ప్రొఫైల్​కు అనుగుణంగా డైట్​ని రూపొందించడం. ఇలా డిజైన్​ చేసిన డైట్​ రక్తంలో చక్కెర స్థాయిలు నిర్వహించడంలో, టైప్​ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారిలో.. ఆ ప్రమాదాన్ని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుందని కొత్త పరిశోధనలు చెప్తున్నాయి. 

పరిశోధన వివరాలు

యునైటెడ్​ కింగ్​డమ్​లోని ఇంపీరియల్ కాలేజ్ లండన్, DnaNudge నడ్జ్ కలిసి ఈ అధ్యయనం చేసింది. దానికి సంబంధించిన ఫలితాలు సైంటిఫిక్ రిపోర్ట్స్ ట్రస్టెడ్ సోర్స్​లో ప్రచురించింది. ఈ పరిశోధనలో భాగంగా రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్న 148 మంది వ్యక్తులను ఎంచుకున్నారు. కొంతకాలంగా వారు తింటున్న ఫుడ్స్ గురించి తెలుసుకున్నారు. అనంతరం వారి DNAకి అనుకూలమైన ఆహారాన్ని అందించారు. 

పరిశోధన ఫలితాలు

పరిశోధకులు 6,12, 26 వారాల వ్యవధిలో.. పరిశోధనలో పాల్గొన్నవారి గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ స్థాయిలను అంచనా వేశారు. మొదటి ఆరు వారాల్లో పెద్ద తేడా లేకపోయినా.. 26 వారాల సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలలో గణనీయమైన మెరుగుదల కనిపించినట్లు తెలిపారు. రక్తంలో సగటు చక్కెర స్థాయిలను సూచించే గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్​లను కొలిచి.. ప్రాథమిక అంచనాలు చేశారు.

ఈ డైట్​ ద్వారా రక్తంలోని గ్లూకోజ్ నియంత్రణలో గణనీయమైన మార్పులు చూసినట్లు ప్రచురించారు. ఈ పరిశోధనలో పాల్గొన్న వారి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడానికి, టైప్​ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలను తగ్గించడానికి DNA డైట్​ ఉపయోగపడిందని తేల్చారు. ఈ పరిశోధన జన్యు డేటా ఆధారంగా ఆరోగ్య సమస్యలను కంట్రోల్ చేయవచ్చని నిరూపించింది. 

డయాబెటిస్ - ప్రీ డయాబెటిస్ 

డయాబెటిస్ అనేది శరీరం రక్తంలో గ్లూకోజ్​ను నిర్వహణను ప్రభావితం చేసే దీర్ఘకాలిక వ్యాధి. టైప్​ 2 డయాబెటిస్​తో శరీరం ఇన్సులిన్​ను సమర్థవంతంగా ఉపయోగించనివ్వకుండా చేస్తుంది. ప్రీ డయాబెటిస్ సమయంలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సాధారణ పరిధికి మించి పెరుగుతాయి. ఈ సమయంలో డీఎన్​ఏ డైట్​ ఫాలో అవ్వడం వల్ల టైప్​ 2 డయాబెటిస్​ను రివర్స్ చేసుకోవచ్చు. లేదా రాకుండా పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు. జీవశైలిలో మార్పులు ప్రీ డయాబెటిస్ నుంచి, టైప్ 2 డయాబెస్ పురోగతిని పొందవచ్చు. 

పండ్లు, కూరగాయలు, హెల్తీ ఫ్యాట్స్, తృణధాన్యాలను వారి డైట్​లో చేర్చారు. అంతేకాకుండా లైఫ్​స్టైల్​లో మార్పులు వల్ల కూడా ఈ డయాబెటిస్​ని దూరం చేసుకోవచ్చని తెలిపారు. ఈ డీఎన్ఏ ఆధారంగా తీసుకునే డైట్​ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందినా.. దీనిపై మరిన్ని పరిశోధనలు జరిగితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు. 

Also Read : మధుమేహం ఈ మధ్యే వచ్చిందా? అయితే ఈ డైట్​ ప్లాన్​ని ఫాలో అవుతూ.. లైఫ్​ స్టైల్​లో ఈ మార్పులు చేసేయండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Embed widget