Chittor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - లారీ, బస్సు ఢీకొని నలుగురు మృతి, 14 మందికి గాయాలు
Andhra News: చిత్తూరు జిల్లాలో తిరుపతి - చెన్నై రహదారిలో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. లారీ, బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందగా.. 14 మందికి గాయాలయ్యాయి.

Severe Road Accident In Chittor District: చిత్తూరు జిల్లా (Chittor District) ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరుపతి - చెన్నై రహదారిలో నగరి (Nagari) మున్సిపల్ పరిధి టూరిజం రెస్టారెంట్ సమీపంలోని జాతీయ రహదారిపై లారీ, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో 14 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రైవేట్ బస్సును లారీ పక్క నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో వడమాలపేట సీతారామాపురం గ్రామానికి చెందిన పార్థసారధి నాయుడు (62), రాజేంద్రనాయుడు (60), తిరుపతికి చెందిన మణిగండ (8)తో పాటు సుమారు 60 ఏళ్ల వయస్సు గల మరో గుర్తు తెలియని వ్యక్తి మరణించినట్లు గుర్తించారు. తమిళనాడుకు చెందిన చిన్నమలై (55) పరిస్థితి విషమంగా ఉండగా, తిరుపతికి చెందిన సుబ్బరత్నమ్మ (42), భరత్ (40), తిరువళ్లూరుకు చెందిన సుధాకర్ (50) అనే వారికి తీవ్రగాయాలయ్యాయి. మరో 10 మందికి గాయాలు కాగా.. క్షతగాత్రులను నగరి ఏరియా ఆస్పత్రికి తరలించగా ప్రాథమిక వైద్య చికిత్స అందించిన వైద్యులు తీవ్రగాయాలైన వారిని మెరుగైన వైద్యసేవలకు తిరుపతి రూయాకు తరలించారు. బస్సు వేగంగా వెళ్లడమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు తెలిపారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Crime News: యువతి స్నానం చేస్తుండగా వీడియో తీసిన యువకుడు - బంధించిన యువతి కుటుంబసభ్యులు, చివరకు!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

