అన్వేషించండి

అస్సాంలో కూలిన సుఖోయ్ ఫైటర్ జెట్.. ఇద్దరు IAF పైలట్లు మృతి

Sukhoi fighter jet | అస్సాంలోని కార్బి ఆంగ్లాంగ్ జిల్లాలో సుఖోయ్ Su-30MKI కూలిపోవడంతో ఇద్దరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్లు మృతిచెందారు.

కార్బి ఆంగ్లాంగ్: అస్సాంలోని కార్బి ఆంగ్లాంగ్ జిల్లాలో సుఖోయ్ Su-30MKI యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో భారత వైమానిక దళానికి (IAF) చెందిన ఇద్దరు పైలట్లు అమరులయ్యారు. పైలట్‌లను స్క్వాడ్రన్ లీడర్ అనుజ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ పుర్వేష్ దురాగ్‌కర్ అని గుర్తించినట్లు ఐఏఎఫ్ తెలిపింది. 

ఇండియన్ ఏయిర్ ఫోర్స్ తమ ఎక్స్ ఖాతాలో ఇందుకు సంబంధించిన విషయాలను పోస్ట్ చేసింది. IAF సిబ్బంది తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తాం. KI శిక్షణ మిషన్ కోసం బయలుదేరిన కొద్దిసేపటికే జోర్హాట్ ఎయిర్‌బేస్ నుండి అదృశ్యమైందని, ఆ తర్వాత కూలిపోయిందని సమాచారం. ఈ ఎయిర్‌బేస్ ప్రమాద స్థలం నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.

రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఈ ఫైటర్ జెట్ తో గురువారం రాత్రి 7:42 గంటలకు సంబంధాలు తెగిపోయాయని అధికారులు తెలిపారు. Su-30MKI అనేది రెండు సీట్ల మల్టీపర్పస్ ఫైటర్ జెట్. రష్యా విమాన తయారీదారు అయిన సుఖోయ్ దీన్ని డెవలప్ చేసింది. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం లైసెన్స్ కింద హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) సుఖోయ్ ఫైటర్ జెట్స్ తయారు చేస్తోంది.

 అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానం సుఖోయ్ 
భారత వైమానిక దళం 260 కంటే ఎక్కువ Su-30MKI జెట్ విమానాలను కలిగి ఉంది. ఈ ఫైటర్ జెట్ కూలిపోయిన తీరు చూస్తుంటే, దాని నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2000 ల ప్రారంభంలో IAF లో చేరిన సుఖోయ్ Su-30 MKI అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాలలో ఒకటిగా చెప్పవచ్చు. 

ముందు ఎప్పుడు కూలిపోయింది
అయితే, సుఖోయ్ జెట్ కూలడం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు సుఖోయ్-30 MKI విమానం కూలిపోవడం తెలిసిందే. ఆగస్టు 2019లో సుఖోయ్-30 MKI సాధారణ ట్రైనింగ్ మిషన్ సమయంలో అస్సాంలోని తేజ్‌పూర్ సమీపంలో వరి పొలంలో కూలిపోయింది. ఆ ఘటనలో ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడగలిగారు. 

మే 2015లో సుఖోయ్-30 MKI విమానం టేకాఫ్ అయిన వెంటనే తేజ్‌పూర్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుండి సుమారు 36 కిలోమీటర్ల దూరంలో క్రాష్ అయింది. ప్రమాదం జరుగుతున్న సమయంలో కొంత ముందుగా ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

India Census 2027: జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
Embed widget