India Win U19 T20 World Cup | ఫైనల్లో గెలిచి టీ20 వరల్డ్ కప్ గెల్చుకున్న టీమిండియా | ABP Desam
తెలంగాణ అమ్మాయి త్రిష మళ్లీ ఫైనల్లోనూ దుమ్మురేపటంతో అండర్ 19 మహిళల టీ20 వరల్డ్ కప్ మన సొంతమైంది. కౌలలంపూర్ లో సౌతాఫ్రికాతో జరిగిన టీమిండియా 9వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా U19 మహిళల జట్టు తెలంగాణ అమ్మాయి త్రిష దెబ్బకు 82పరుగులకే కుప్ప కూలింది. 4 ఓవర్లలో కేవలం 15పరుగులే ఇచ్చి 3వికెట్లు తీసింది భద్రాచలం అమ్మాయి. 83పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఓపెనర్ కమలినీ వికెట్ ను కోల్పోయినా మరో ఓపెనర్ గా దిగిన త్రిషనే సానికా చల్కే తో కలిసి వికెట్ పడకుండా టార్గెట్ ఛేజ్ చేసేసింది. 33 బంతులు ఆడి 8 ఫోర్లతో 44 పరుగులు చేసింది మన త్రిష. ఛల్కే 26పరుగులు చేసి త్రిషకు మంచి సపోర్ట్ ఇచ్చింది. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లో త్రిష ఆల్ రౌండ్ షో తో అదరగొట్టేయటంతో భారత్ 6వ సారి సగర్వంగా U19 మహిళల టీ20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది.





















