Praggnanandhaa Vs Gukesh: ప్రజ్ఞానంద చేతిలో ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రపంచ చాంపియన్ గుకేశ్
టై బ్రేకర్ లో గుకేశ్ పై 2-1తో టై బ్రేక్ లో విజయం సాధించాడు. దీంతో విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ టోర్నీ గెలిచిన భారతీయునిగా రికార్డుల్లోకి ఎక్కాడు. రెండోసారి కూడా గుకేశ్.. ఈ టోర్నీలో సత్తా చాటలేకపోయాడు.

Chess News: ప్రతిష్టాత్మక టాటా స్టీల్ చెస్ మాస్టర్ టోర్నీని ప్రజ్ఞానంద కైవసం చేసుకున్నాడు. తాజాగా జరిగిన పోటీలో ప్రపంచ చాంపియన్ గుకేశ్ పై 2-1తో టై బ్రేక్ లో విజయం సాధించాడు. దీంతో విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ టోర్నీ గెలిచిన భారతీయునిగా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇటీవలే ప్రపంచ చాంపియన్షిష్ గెలిచిన గుకేశ్.. ఈ టోర్నీలో మాత్రం సత్తా చాటలేకపోయాడు. నిజానికి లీగ్ దశ ముగిసేసరికి ఇరువురు 8.5 పాయింట్లతో టాప్ ప్లేస్ లో నిలిచారు. దీంతో ఇరువురి మధ్య బై బ్రేక్ అనివార్యమైంది. అంతకుముందు తమ చివరి గేమ్ అయిన 13వ గేమ్ లో ప్రజ్ఞానంద, గుకేశ్ ఓడిపోయారు. తెలుగు ప్లేయర్ అర్జున్ ఎరిగైసి చేతిలో గుకేశ్, జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్ చేతిలో ప్రజ్ఞానంద పరాజయం పాలయ్యారు. ప్రజ్ఞానంద, గుకేశ్ టాప్ లో ఉండటంతో ఇరువురి మధ్య విజేతను తేల్చడానికి టై బ్రేక్ ను నిర్వహించారు.
Congratulations Pragg for becoming Tata Steel Masters Champion.
— Johns (@JohnyBravo183) February 2, 2025
The last few seconds were too heartbreaking to watch for Gukesh.
Chess is Brutal 💔 pic.twitter.com/HnqelEtUPP
తొలి గేమ్ లోనే ఆధిపత్యం..
ఇక టైబ్రేక్ లో ఇరువురు ప్లేయర్లు సర్వశక్తులు ఒడ్డి పోరాడారు. అయితే చకచకా పావులు కదిపిన ప్రజ్ఞానంద తొలి గేమ్ ను కైవసం చేసుకున్నాడు. ఇక రెండో గేమ్ లో తేరుకున్న గుకేశ్.. కీలకదశలో సత్తా చాటి మ్యాచ్ ను సమం చేశాడు. మ్యాచ్ ను నిర్ణయించే మూడో గేమ్ లో కీలకదశలో గుకేశ్ తడబడటంతో ప్రజ్ఞానందకు విజయం ఖాయమైంది. దీంతో తొలిసారి ఈ టైటిల్ ను ప్రజ్ఞానంద గెలిచాడు. గతంలో 2003, 2004, 2006లో మూడుసార్లు ఆనంద్ ఈ టోర్నీని గెలిచాడు. అంతకుముందు హూగేవెన్స్ టోర్నీని కూడా 1989, 1998లో ఆనంద్ గెలిచాడు. మ్యాచ్ గెలిచాక ప్రజ్ఞానంద ఆనందం వ్యక్తం చేశాడు. 13వ గేమ్ లో విన్సెంట్ పై స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోయానని పేర్కొన్నాడు. అయితే గుకేశ్ ను ఓడించి, తనకు టై బ్రేక్ లో అవకాశం కల్పించిన తెలుగు ప్లేయర్ అర్జున్ కు ఈ సందర్బంగా ప్రజ్ఞానంద థాంక్స్ చెప్పాడు. ఎట్టకేలకు ఈ టోర్నీని గెలుపొందడం సంతోషంగా ఉందని 19 ఏళ్ల ప్రజ్ఞానంద పేర్కొన్నాడు. నిజానికి ఈ టోర్నీని గెలవాలని బలంగా భావించానని, అయితే ఈక్రమంలో ఒత్తిడికి గురికాలేదని చెప్పుకొచ్చాడు.
కన్నీళ్లు పెట్టుకున్న గుకేశ్..
ఇక చెస్ మాస్టర్స్ టోర్నీలో ఓడిపోవడంతో గుకేశ్ భావోద్వేగానికి గురయ్యాడు. చిన్నపిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. నిజానికి ఈ టోర్నీలో వరుసగా రెండో సారి టై బ్రేకర్ లో ఓడిపోయాడు. గతేడాది చైనాకు చెందిన వీ యీ తో టాప్ ప్లేస్ లో నిలవడంతో ఇద్దరి మధ్య టైబ్రేకర్ నిర్వహించారు. అందులో కూడా గుకేశ్ పరాజయం పాలయ్యాడు. ఇటీవలే ప్రపంచ చెస్ చాంపియన్షిప్ గెలుచుకుని టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిన గుకేశ్ కు ఈ టోర్నీ మాత్రం అందని ద్రాక్ష పుల్లన అన్న చందంగా మారింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

