Vijayasai Reddy: నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
వైసీపీ రాజ్యసభ ఎంపీ, వైయస్ జగన్మోహన్ రెడ్డి తరువాత ఆ పార్టీలో నెంబర్ 2గా చాలా రోజులు వెలుగు వెలిగిన విజయసాయిరెడ్డి ఇటీవల రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఆయన నందమూరి కుటుంబానికి దగ్గరవుతున్నారు.

తెలుగు రాష్ట్ర రాజకీయాలలో విజయసాయి రెడ్డి తాజా అడుగులు సంచలనం అవుతున్నాయి. వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్ళిన ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. త్వరలో వైసిపి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. ప్రస్తుతం వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి లండన్‌లో ఉన్నారు. ఆయన రాక కోసం విజయసాయి రెడ్డి వెయిట్ చేస్తున్నారు. వచ్చిన తర్వాత రాజీనామా సమర్పించనున్నారు. రాజకీయాలకు ఆయన గుడ్ బై చెప్పారు. కుటుంబంతో కలిసి టైమ్ స్పెండ్ చేస్తున్నారు. అయితే నందమూరి కుటుంబంతో ఆయన కనిపించడం కొంత మందికి మింగుడు పడడం లేదు.
నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి
వైసిపికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు తమ తమ అంచనాలు చెప్పారు. తెలుగుదేశం పార్టీకి దగ్గర అయ్యే అవకాశాలను కూడా కొట్టి పారేయలేమని ఇంకొందరు జోస్యం చెప్పారు. ప్రస్తుతానికి అయితే ఆయన రాజకీయ నాయకులు ఎవరితోనూ కనిపించడం లేదు. కానీ... నందమూరి కుటుంబానికి దగ్గరగా ఉన్నారు.
నందమూరి కుటుంబ సభ్యుడు దివంగత కథానాయకుడు, తారక రత్న భార్య అలేఖ్య తెలుసు కదా! విజయసాయి రెడ్డితో పాటు దిగిన ఫోటోను ఆవిడ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'వీకెండ్ విత్ విఎస్ఆర్' అని పేర్కొన్నారు. అది అసలు సంగతి. ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. విజయసాయి రెడ్డి మళ్లీ రాజకీయాల్లోకి వచ్చినా రాకున్నా... ఆయన కుమార్తె మాత్రం బీజేపీలో చేసే అవకాశం ఉందట.
నందమూరి కుటుంబానికి కోడలు కాకముందు నుంచి విజయసాయి రెడ్డితో అలేఖ్యకు బంధుత్వం ఉంది. ఆమెకు ఆయన బాబాయ్ వరుస అవుతారు. తారకరత్న, అలేఖ్య వివాహానికి అప్పట్లో ఇరువురి కుటుంబ సభ్యులు అంగీకరించకపోతే... విజయసాయి రెడ్డి తమకు మద్దతు ఇచ్చారని అలేఖ్య గతంలో తెలిపారు.
View this post on Instagram
తారకరత్న మరణించిన తర్వాత కార్యక్రమాల్లోనూ విజయసాయి రెడ్డి ప్రముఖంగా కనిపించారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో ఆయన సన్నిహితంగా మాట్లాడడం కెమెరాల కంట పడింది. అప్పట్లో ఆయన మీద జగన్మోహన్ రెడ్డి కాస్త అసహనం వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాలలో వినపడింది కూడా! అదంతా గతం... ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజకీయాలకు రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన ఏ కుటుంబంతో కనిపించినా సరే ఎవరు ఏమి అనలేరు. ఆయనపై పొలిటికల్ బాస్ ఎవరూ లేరు. భవిష్యత్తులో మళ్లీ రాజకీయాలలోకి రానని విజయసాయి రెడ్డి తెలిపారు. రాజకీయాలలో ఏదైనా జరగొచ్చు... ఆయన మళ్లీ వచ్చినా రావచ్చు.
Also Read: అల్లు అర్జున్ వస్తున్నాడు... కండిషన్స్ అప్లై... చైతూ టీమ్ అలా చేయక తప్పదు మరి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

