Horoscope Today 3rd February 2025: వివాహ సంబంధ చర్చలకు ఈ రాశులవారికి మంచి సమయం కాదు!
Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఫిబ్రవరి 3 రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు మీకు మంచిరోజు. స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. కొన్నాళ్లుగా వెంటాడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. మతపరమైన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రోత్సాహం పొందుతారు. లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి.
వృషభ రాశి
ఈ రోజు మీకు ఒత్తిడి పెరుగుతుంది. అనుకోని వాదనలుంటాయి. అహంకారం ప్రదర్శించవద్దు. అనవసరమైన పనులలో మీ సమయాన్ని వృథా చేయకండి. ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు కొత్త వ్యక్తుల పట్ల ఆకర్షితులవుతారు
మిథున రాశి
ఈ రోజు మీరు మీ ఆలోచనలను నియంత్రించగలుగుతారు. కొత్త ఆదాయ మార్గాల కోసం ఖర్చు చేయవచ్చు. మీరు ఒక లక్ష్యం గురించి ప్రతిజ్ఞ తీసుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభిస్తాయి. ఉన్నతాధికారులతో సత్సంబంధాలు ఉండేలా చూసుకోండి.
కర్కాటక రాశి
చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి. వివాహ సంబంధిత చర్చలకు సమయం శుభం కాదు. మీరు ఎక్కువగా విశ్వసించేవారు కూడా మీకు సహాయం చేయలేరు. శత్రువులు మీకు భయపడవచ్చు. ఈ రోజు మీ సమయాన్ని శాంతియుతంగా గడపండి.
Also Read: సరస్వతీ కటాక్షం కోసం వసంతపంచమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!
సింహ రాశి
ఈ రోజు మీరు చేపట్టే పనిలో ఇబ్బందులుంటాయి కానీ ప్రణాళిక ప్రకారం పూర్తిచేస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఏదో విషయం గురించి ఆలోచిస్తారు, భయపడతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
కన్యా రాశి
ఈ రోజు మీ టైమ్ చాలా బావుంటుంది. వివేకవంతమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా మీరున్న రంగంలో గౌరవం పొందుతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మోకాలి నొప్పితో ఇబ్బందిపడతారు. అనవసర చర్చల్లో పాల్గొనవద్దు.
తులా రాశి
ఈ రోజు మీరు మీ ప్రణాళికలను అమలు చేయడంలో విజయవంతమవుతారు. ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. విద్యార్థులు చదువులో అడ్డంకులు ఎదుర్కొంటారు. ముఖ్యమైన విషయాలపై నిర్ణయం తీసుకునేముందు మరోసారి ఆలోచించండి.
వృశ్చిక రాశి
నిర్లక్ష్యం కారణంగా ఈ రోజు మీరు చేపట్టాలి అనుకున్న పని దెబ్బతింటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. రహస్య విభాగాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది. మీరు చేయాల్సిన పనిపై శ్రద్ధ పెట్టండి. ఆస్తులకు సంబంధించిన పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
Also Read: రథసప్తమి సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి!
ధనస్సు రాశి
ఈ రోజు ఉద్యోగం, వ్యాపారంలో ఉండే ఈ రాశివారు లాభపడతారు. బంధువులకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితుల నుంచి శుభవార్త వింటారు. సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి పెరుగుతుంది. ఇంటర్యూలలో విజయం సాధిస్తారు.
మకర రాశి
ఈ రోజు చట్టపరమైన విషయాల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీవిత భాగస్వామి నుంచి మీకు సహకారం లభిస్తుంది. పరిశోధన పనులతో సంబంధం ఉన్న వ్యక్తులకు రోజు చాలా మంచిది. ఉద్యోగం, వ్యాపారంలో లాభాలుంటాయి
కుంభ రాశి
ఏదో విషయంపై ఈ రోజు ఆందోళన చెందుతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే బాధపడక తప్పదు. గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోండి. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది.
మీన రాశి
ఈ రోజు మీకు పాఠం నేర్పించబోతోంది. గతంలో చేసిన తప్పుల నుంచి నేర్చుకోండి. స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. నూతన ప్రారంభానికి ఈ రోజు శుభసూచన. వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Also Read: రథసప్తమి ఎప్పుడు..ఆదిత్యుడి ఆరాధన వల్ల ఎలాంటి ప్రయోజనం పొందుతారు!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

