Ayodhya MP Breaks in to Tears | నేను రిజైన్ చేసేస్తానంటూ కన్నీళ్లు పెట్టుకున్న అయోధ్య ఎంపీ | ABP Desam
అయోధ్య ఎంపీ గుక్కపట్టి ఏడ్చారు. సమాజ్ వాదీ ఎంపీ అవధేష్ ప్రసాద్ ఇలా తన కన్నీటిని ఆపుకోలేకపోయారు. దీనికి కారణం అయోధ్యకు చెందిన ఓ యువతి హత్యకు గురి కావటమే. మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఓ యువతి అత్యంత దారుణమైన స్థితిలో శరీరంపై కనీసం దుస్తులు లేకుండా యువతి మృతదేహం మూడురోజుల తర్వాత లభ్యం కావటంతో ఎంపీ అవదేష్ ప్రసాద్ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. మూడు రోజుల క్రితమే తల్లి తండ్రులు ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు స్పందించాల్సిందని అలా చేయకపోవటంతోనే ఇలా ఈ రోజు ఆ యువతి దారుణ స్థితిలో చనిపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీ. ప్రధాని నరేంద్రమోదీని కలిసి ఈ పరిస్థితిని వివరించి తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు ఎంపీ. అయోధ్య రామమందిర నిర్మాణం తర్వాత ఫైజాబాద్ ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించి అయోధ్యలో గెలిచి సమాజ్ వాదీ పార్టీ జెండా ఎగురేసి చరిత్ర సృష్టించారు అవదేశ్ ప్రసాద్





















