Delhi News: వరుడి అత్యుత్సాహం కొంపముంచింది - పెళ్లి వేదిక వద్ద 'చోలీ కే పీచే క్యాహై' అంటూ డ్యాన్స్, మ్యారేజ్ క్యాన్సిల్ చేసిన వధువు తండ్రి
Wedding Calls Off: పెళ్లి వేదికపై వరుడు బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేయగా వధువు తండ్రి పెళ్లి క్యాన్సిల్ చేశాడు. 'ఆ పాటేంటి.? ఆ డ్యాన్సేంటి.?' అని ఆగ్రహంతో పెళ్లి రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు.

Bride Father Calls Off Wedding Due To Groom Dance In Delhi: పెళ్లంటే.. ఇల్లంతా బంధువులు, సన్నిహితుల సందడి. మేళతాళాలు, డీజే డ్యాన్సులు, విందు భోజనాలు గుర్తొస్తాయి. వేడుకలో స్నేహితులతో వరుడు, వధువుల సంభాషణలు.. నృత్యాలు, సరదా మాటలు కామన్. వారితో కూడా సరదాగా డ్యాన్స్ చేయించాలని స్నేహితులు భావిస్తారు. ఈ క్రమంలో అలా పెళ్లి వేదిక వద్ద వరుడు డ్యాన్స్ చేయగా.. ఆ అత్యుత్సాహమే అతని కొంపముంచింది. ఏకంగా పెళ్లే క్యాన్సిల్ అయ్యేలా చేసింది. ఈ ఘటన ఢిల్లీలో (Delhi) తాజాగా చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలో ఇటీవల ఓ వరుడు తన పెళ్లి ఊరేగింపుతో వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు. స్నేహితులు బలవంతం చేయగా డ్యాన్స్ చేశాడు. అయితే, వేదిక వద్ద కూడా డ్యాన్స్ చేద్దామంటూ వరున్ని స్నేహితులు పిలిచారు. దీంతో వారితో పాటు వెళ్లి వేదికపై కాలు కదిపాడు. బాలీవుడ్‌లో ఒకప్పుడు ఉర్రూతలూగించిన 'చోలీ కే పీచే క్యాహై' పాటకు డ్యాన్స్ చేశాడు. దీన్ని చూసిన బంధువులు హుషారుగా ఎంకరేజ్ చేశారు. అయితే, ఇదే వరుడికి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. వరుడి డ్యాన్స్ అనుచితంగా, ఇబ్బందికరంగా ఉందంటూ అతనికి కాబోయే మామ పెళ్లి క్యాన్సిల్ చేశాడు. 'ఆ పాటేంటి..? ఆ డ్యాన్సేంటి.?' అంటూ మండిపడుతూ వివాహం రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు. వరుడు తన తీరుతో కుటుంబ విలువలను అవమానించాడని అక్కడి వారు చెప్పినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.
వధువు కన్నీళ్లు..
ఈ హఠాత్పరిణామంతో అక్కడి వారు షాకయ్యారు. ఇదంతా సరదా కోసమే చేశామంటూ వరుడు వివరణ ఇచ్చేందుకు యత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇలా రోడ్లు మీద డ్యాన్సులు చేసే వ్యక్తికి తన కూతురును ఇచ్చి పెళ్లి చేయలేనని తేల్చిచెప్పాడు. ఆ తర్వాత ఎవరు ఎంతగా చెప్పినా ఆయన వినలేదు. తండ్రి నిర్ణయంతో చేసేదేం లేక వధువు సైతం కన్నీళ్లతో వేదిక పైనుంచి దిగిపోయింది. ఈ వ్యవహారం తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. తండ్రి చేసింది కరెక్టే అంటూ కొందరు కామెంట్ చేయగా.. కొందరు మాత్రం ఈ రోజుల్లో పెళ్లిల్లో ఇది కామన్ అని.. అంత మాత్రానికే పెళ్లి క్యాన్సిల్ చేస్తారా.? అంటూ ప్రశ్నిస్తున్నారు.
Also Read: Budget 2025 : విదేశాల్లో పిల్లల్ని చదివించే వారికి బిగ్ రిలీఫ్ - టీసీఎస్ లిమిట్ రూ.10 లక్షలకు పెంపు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

