Mumbai T20i Update: భారత్ భారీ స్కోరు , అభిషేక్ బ్లాస్టింగ్ సెంచరీ, పలు రికార్డులు బద్దలు..
Abhishek Sharma Century: పలు రికార్డులు నమోదు చేయడంతో పాటు అభిషేక్ సూపర్ సెంచరీతో ముంబై టీ20లో భారత్ భారీ స్కోరు సాధించింది. ఇక బౌలర్లు రాణిస్తే 4-1తో ఇండియా తిరుగులేని ఆధిక్యాన్ని దక్కించుకుంటుంది.

India Vs England 5th T20 Live Updates: అభిషేక్ శర్మ మెరుపు సెంచరీ (54 బంతుల్లో 135, 7 ఫోర్లు, 13 సిక్సర్లు)తో రెచ్చిపోవడంతో ముంబై టీ20లో భారత్ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లో 9 వికెట్లకు 247 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ ద్వారా భారత్ తరపున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేసిన ప్లేయర్‌గా అభిషేక్ నిలిచాడు. సొంతగడ్డపై ఇంగ్లాండ్‌పై ఇప్పటికే టీ20 సిరీస్ సాధించిన భారత్.. 4-1తో ఆధిక్యాన్ని సాధించేందుకు ముందడుగు వేసింది. శివమ్ దూబే (13 బంతుల్లో 30. 3 ఫోర్లు, 2 సిక్సర్లు), తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (15 బంతుల్లో 24, 3 ఫోర్లు, 1 సిక్సర్) స్టన్నింగ్ క్యామియోలతో రెచ్చిపోయి భారీ స్కోరు సాధించడంలో తమ వంతు పాత్ర పోషించారు. అటు బ్యాటింగ్‌కు స్వర్గధామమైన ఈ పిచ్‌పై బ్యాటర్లు తమ ఫైర్ పవర్ చూపించారు. మరోవైపు ఇప్పటికే సిరీస్‌ను 3-1తో గెలిచిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో గెలిస్తే 4-1తో తన ఆధిక్యాన్ని పెంచుకుంటుంది. బౌలర్లలో బ్రైడెన్ కార్స్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. ఆదిల్ రషీద్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్‌లో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. అర్షదీప్ సింగ్ స్థానంలో మహ్మద్ షమీ జట్టులోకి వచ్చాడు. ఇక ఇంగ్లాండ్ సాకిబ్ మహ్మూద్ స్థానంలో మార్క్ వుడ్‌ను జట్టులోకి తీసుకుంది.
End of an explosive 135-run knock from Abhishek Sharma 👏👏
— BCCI (@BCCI) February 2, 2025
He finishes with 1⃣3⃣ sixes - the most ever for an Indian batter in T20Is in Men's Cricket 🙌
Live ▶️ https://t.co/B13UlBNdFP#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/Jb9Le56aBX
స్టార్టింగ్ నుంచే ధనాధన్..
ఈ ఇన్నింగ్స్ అంతా అభిషేక్ వన్ మేన్ షో చూపించాడు. అధ్బుత సెంచరీతో టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన ఇండియన్‌గా నిలిచాడు. టాస్ గెలిచి ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించడం ఎంత పెద్ద పొరపాటో పవర్ ప్లే ముగిసే లోపే ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌కు తెలిసొచ్చింది. ముఖ్యంగా ఇద్దరు ఓపెనర్లు సంజూ శాంసన్ (7 బంతుల్లో 16), అభిషేక్ విధ్వంసమే ఎజెండాగా బరిలోకి దిగారు. సంజూ రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో మంచి టచ్‌లోకి వచ్చినా, అతడిని వుడ్ పెవిలియన్‌కు పంపాడు. దీంతో 23 పరగుల వద్ద తొలి వికెట్‌ను భారత్ కోల్పోయింది. అయితే ఆ తర్వాత అభిషేక్ బీస్ట్ మోడ్‌లోకి వచ్చి, ఎడాపెడా బౌండరీలు బాదాడు. ముఖ్యంగా సిక్సర్లతో ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ నేపథ్యంలో 17 బంతుల్లోనే అర్థ సెంచరీని సాధించాడు. ఇక అభిషేక్‌తో పాటు తిలక్ కూడా రెచ్చిపోవడంతో పవర్ ప్లేలో భారత్ 95 పరుగులు సాధించింది. ఇక పవర్ ప్లేలో అత్యధిక స్కోరును ఈ మ్యాచ్‌లోనే భారత్ నమోదు చేసింది. పవర్ ప్లే ముగిసిన మూడో బంతికే వంద పరుగుల మార్కును సాధించింది. దీంతో టీ20ల్లో అత్యంత వేగవంతంగా వంద చేసిన రికార్డును సవరించుకుంది. గతేడాది బంగ్లాపై 7.1 ఓవర్లలోనే సెంచరీ చేయగా, నాలుగు బంతుల తేడాతో ఆ రికార్డు ఈ మ్యాచ్‌లో తెరమరుగైంది. ఇక, 35 బంతుల్లో 115 పరుగులను రెండో వికెట్ జోడించాక తిలక్ ఔటయ్యాడు.
13 సిక్సర్లతో రెచ్చిపోయిన శర్మ..
ఇక వరుసగా వికెట్లు పడుతున్నా అభిషేక్ జోరు ఏమాత్రం తగ్గలేదు. 13 సిక్సర్లతో తన సత్తా చాటాడు. ఒక వైపు అభిషేక్ జోరు చూపిస్తూ ఉంటే మిగతా బ్యాటర్లు అంతగా రాణించలేదు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (2) విఫలమయ్యాడు. ఆ తర్వాత దూబే, అభిషేక్‌కి చక్కని సహకారం అందించాడు. ఇక ఫిఫ్టీ తర్వాత జోరు పెంచిన అభిషేక్ ఎనిమిదో ఓవర్లో రషీద్ బౌలింగ్ రెండు భారీ సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత ఓవర్లో లివింగ్ స్టన్ ఓవర్లో మరో రెండు కళ్లు చెదిరే సిక్సర్లు బాదాడు. తర్వాత ఒక ఫోరు, సిక్సర్‌తో సెంచరీకి చేరువలోకి వచ్చాడు. ఆ తర్వాత 11వ ఓవర్లో బ్రైడెన్ కార్స్ బౌలింగ్‌లో సెంచరీని సాధించాడు. 17 బంతుల్లోనే ఫిఫ్టీ చేసిన శర్మ.. మరో 20 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సెంచరీ తర్వాత కూడా తన జోరును తగ్గించలేదు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. అయితే ఒక ఎండ్ లో హార్దిక్ పాండ్యా (9) రింకూ సింగ్ (9) స్కోరు వేగం పెంచే క్రమంలో ఔటయ్యాడు. ఆఖరికి రషీద్.. అభిషేక్‌ను ఔట్ చేయడంతో భారత్ 250 పరుగుల మార్కును చేరలేకపోయింది. ఆఖర్లో అక్షర్ పటేల్ (15) కాస్త పోరాడాడు. బౌలర్లలో మార్క్ వుడ్‌కు రెండు, రషీద్, జోఫ్రా ఆర్చర్, జామీ ఓవర్టన్‌కు తలో వికెట్ దక్కింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

