Abhishek Century: అభిషేక్ స్టన్నింగ్ సెంచరీ - సిక్సర్లతో ఊచకోత, టీ20ల్లో రెండో వేగవంతమైన సెంచరీ నమోదు
Ind Vs Eng: అభిషేక్ శర్మ మైదానం నలువైపులా బౌండరీలు బాదుతూ అద్భుత శతకాన్ని సాధించాడు. ముఖ్యంగా 10 సిక్సర్లతో ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

Ind VS Eng Mumbai T20 Live Updates: భారత ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి చెలరేగిపోయాడు. ఇంగ్లాండ్‌పై 37 బంతుల్లోనే అద్భుత సెంచరీని సాధించాడు. టీ20ల్లో ఇది రెండో వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు తుపాన్ ఆరంభాన్ని అందించాడు. మైదానం నలువైపులా బౌండరీలు బాదుతూ అద్భుత శతకాన్ని సాధించాడు. ముఖ్యంగా 10 సిక్సర్లతో ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అలాగే కళ్లు చెదిరే నాలుగు బౌండరీలను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక దశలో 35 బంతుల్లోపలే సెంచరీ చేసి రోహిత్ శర్మ వేగవంతమైన సెంచరీ రికార్డును అధిగమిస్తాడని భావించినా, తిలక్ వర్మ (24) వికెట్ కోల్పోవడం, బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కాస్త లేటయ్యింది. మొత్తానికి టీ20ల్లో రెండో సెంచరీతో సత్తా చాటాడు. కెరీర్లో 17వ మ్యాచ్ ఆడుతున్న అభిషేక్ రెండో సెంచరీని సాధించడం విశేషం. ఇంతకు ముందు జింబాబ్వేపై తొలి సెంచరీని సాధించాడు.
Hundred reasons to celebrate! 📸📸
— BCCI (@BCCI) February 2, 2025
Live ▶️ https://t.co/B13UlBNdFP#TeamIndia | #INDvENG | @idfcfirstbank pic.twitter.com/qQUC6EAOlh
17 బంతుల్లోనే ఫిఫ్టీ..
టాస్ గెలిచి ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించడం ఎంత పెద్ద పొరపాటో పవర్ ప్లే ముగిసే లోపే ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌కు తెలిసొచ్చింది. ముఖ్యంగా ఇద్దరు ఓపెనర్లు సంజూ శాంసన్ (7 బంతుల్లో 16), అభిషేక్ విధ్వంసమే ఎజెండాగా బరిలోకి దిగారు. ముఖ్యంగా సంజూ రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో మంచి టచ్‌లోకి వచ్చినా, అతడిని వుడ్ పెవిలియన్‌కు పంపాడు. దీంతో 23 పరగుల వద్ద తొలి వికెట్‌ను భారత్ కోల్పోయింది. అయితే ఆ తర్వాత అభిషేక్ బీస్ట్ మోడ్‌లోకి వచ్చి, ఎడాపెడా బౌండరీలు బాదాడు. ముఖ్యంగా సిక్సర్లతో ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ నేపథ్యంలో 17 బంతుల్లోనే అర్థ సెంచరీని సాధించాడు. ఇక అభిషేక్‌తో పాటు తిలక్ కూడా రెచ్చిపోవడంతో పవర్ ప్లేలో భారత్ 95 పరగులు సాధించింది.
పలు రికార్డులు బద్దలు..
ఇక పవర్ ప్లేలో అత్యధిక స్కోరును ఈ మ్యాచ్‌లోనే భారత్ నమోదు చేసింది. 2021లో స్కాట్లాండ్‌పై చేసిన 82 పరుగుల రికార్డు తెరమరుగైంది. అలాగే గతేడాది హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌పై 82 పరుగుల స్కోరును సాధించింది. మరోవైపు పవర్ ప్లే ముగిసిన మూడో బంతికే వంద పరుగుల మార్కును సాధించింది. దీంతో టీ20ల్లో అత్యంత వేగవంతంగా వంద చేసిన రికార్డును సవరించుకుంది. గతేడాది బంగ్లాపై 7.1 ఓవర్లలోనే సెంచరీ చేయగా, నాలుగు బంతుల తేడాతో ఆ రికార్డు ఈ మ్యాచ్‌లో తెరమరుగైంది. ఇక, 35 బంతుల్లో 115 పరుగులను రెండో వికెట్ జోడించాక తిలక్ ఔటయ్యాడు. ఇక ఫిఫ్టీ తర్వాత జోరు పెంచిన అభిషేక్ ఎనిమిదో ఓవర్లో రషీద్ బౌలింగ్ రెండు భారీ సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత ఓవర్లో లివింగ్ స్టన్ ఓవర్లో మరో రెండు కళ్లు చెదిరే సిక్సర్లు బాదాడు. తర్వాత ఒక ఫోరు, సిక్సర్‌తో సెంచరీకి చేరువలోకి వచ్చాడు. ఆ తర్వాత 11వ ఓవర్లో బ్రైడెన్ కార్స్ బౌలింగ్‌లో సెంచరీని సాధించాడు. 17 బంతుల్లోనే ఫిఫ్టీ చేసిన శర్మ.. మరో 20 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

