Ind Vs Eng Mumbai T20 Toss: భారత్ బ్యాటింగ్ జట్టులో ఒక మార్పు - మరో విజయంపై టీమిండియా కన్ను, పరువు కోసం ఇంగ్లాండ్ ఆరాటం
Ind Vs Eng: భారత్‌తో ముంబైలో జరుగుతున్న టీ20లో గెలిచి పరువు దక్కించుకోవాలని ఇంగ్లాండ్ ప్రయత్నిస్తోంది. పుణేలో కంకషన్ వివాదం జరగడంతో, దాని నుంచి కోలుకుని మంచి ఫలితాన్ని అందించాలని భావిస్తోంది.

Mumbai T20i Live Updates: ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య మరో టీ20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే భారత్ సిరీస్ నెగ్గిన నేపథ్యంలో ఈ మ్యాచ్ అంత ప్రాధాన్యమైనది కాదు. అయినా ఇరు జట్లు విజయం కోసం ప్రధాన ఆటగాళ్లనే బరిలోకి దింపాయి. ముంబైలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్ చేయనుంది. ఇక జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. వెటరన్ పేసర్ మహ్మద్ షమీ జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఇంగ్లాండ్ కూడా తన టీమ్‌లో ఒక మార్పు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో నెగ్గడం ఇంగ్లాండ్‌కు తప్పనిసరి కానుంది. ముంబైలో గెలిచి పరువు దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. పుణేలో జరిగిన నాలుగో టీ20లో కంకషన్ సబ్సిట్యూట్ వివాదం జరగడంతో, దాని నుంచి కోలుకుని మంచి ఫలితాన్ని అందించాలని ఇంగ్లాండ్ భావిస్తోంది. ఇక కొత్త సంవత్సరంలో టీ20 సిరీస్ సాధించిన భారత్.. అదే జోరును కొనసాగించి, 2025 ఫస్ట్ హాఫ్‌లో ఆడబోతోన్న చివరి టీ20లో విజయంతో ముగించాలని భావిస్తోంది. దీంతో ఈ నెల 6 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగనుంది.
Tonight's Playing XI in Mumbai 👌
— BCCI (@BCCI) February 2, 2025
Live ▶️ https://t.co/B13UlBNLvn#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/C2uFvHYA3k
బ్యాటర్లు గాడిన పడాలి..
టీమిండియాను బ్యాటింగ్ లైనప్ విఫలం కావడం వేధిస్తోంది. టాపార్డర్ వరుసగా విఫలం కావడం టీమ్ మేనేజ్మెంట్‌ను కలవరపరుస్తోంది. ముఖ్యంగా ఓపెనర్ సంజూ శాంసన్ ఒకే తరహాలో ఔట్ కావడంపై పలువురు పెదవి విరస్తున్నారు. ఈ సిరీస్‌లో తన నుంచి భారీ ఇన్నింగ్స్ బాకీ ఉంది. నాలుగు మ్యాచ్‌ల్లోనూ తను విఫలమయ్యాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ తొలి మ్యాచ్‌లో స్టన్నింగ్ ఫిఫ్టీ చేసినా, తన నుంచి మెరుగైన ఇన్నింగ్స్ రావాల్సి ఉంది. ఇక కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ వరుసగా విఫలం కావడం కలవరపరుస్తోంది. గత నాలుగు మ్యాచ్ ల్లోనూ తను విఫలమయ్యాడు. సొంతగడ్డపై తొలిసారి సారథ్యం వహిస్తున్న నేపథ్యంలో తనదైన స్టైల్లో ఫామ్‌లోకి వచ్చి, భారీ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక తిలక్ వర్మ రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనా, ఒక్క ఇన్నింగ్స్‌తో తను గాడిన పడగలడు. ఇక మిడిలార్డర్లో హార్దిక్ పాండ్యా నిలకడగా రాణిస్తున్నాడు. గత మ్యాచ్‌లో శివమ్ దూబే కీలకమైన మ్యాచ్ ఆడాడు. తను కంకషన్ గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చాడు. ఇక బౌలర్లు సత్తా చాటుతున్నారు. వరుణ్ చక్రవర్తి 12 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అతనికి పాండ్య, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ చక్కని సహకారం అందిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో షమీ బరిలోకి దిగబోతుండటంతో వన్డే సిరీస్‌కు ముందు తను ఫామ్‌లోకి రావాలని భావిస్తున్నాడు.
ఒత్తిడిలో ఇంగ్లాండ్..
ఇప్పటికే సిరీస్ కోల్పోయిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పరువు కోసం పోరాడుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి గురువారం నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగాలని అనుకుంటోంది. ఇక బెన్ డకెట్ రాణిస్తున్నా, ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ల నుంచి భారీ ఇన్నింగ్స్ బాకీ ఉంది. గత మ్యాచ్‌లో హారీ బ్రూక్ ఫిప్టీ చేసి ఫామ్‌లోకి వచ్చాడు. లియామ్ లివింగ్ స్టన్ సత్తా చాటాల్సిన అవసరం ఉంది. జేకబ్ బేతెల్, జామీ ఓవర్టన్‌పై ఉన్న అంచనాలను నిలబెట్టుకోవాల్సి ఉంది. ఇక పేస్ బౌలర్లను నమ్ముకుని ఇంగ్లాండ్ బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌లో ఆడిన సాకిబ్ మహ్మూద్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. అయినా కూడా తనను పక్కన పెట్టి, మార్క్ వుడ్‌ని జట్టులోకి తీసుకుంది. జోఫ్రా ఆర్చర్ స్థాయికి తగ్గ ఆట తీరు ప్రదర్శించాల్సి ఉంది. ఆదిల్ రషీద్.. తన నెం.1 బౌలింగ్‌ను ప్రదర్శిస్తున్నాడు. ఏదేమైనా ఇరు జట్లు విజయంపై కన్నేయడంతో ఈ మ్యాచ్ చాలా ఆసక్తిగా జరగనుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

