Suryakumar Comments on T20 Captaincy | కెప్టెన్సీ భాధ్యతపై SKY కామెంట్స్
గత కొన్నాళ్ల నుంచి చూసుకుంటే టీమ్ ఇండియా కెప్టెన్లు మారుతూ వస్తున్నారు. ప్రతి ఫార్మాట్ కు కొత్త కెప్టెన్ దర్శమిస్తున్నారు. టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత
సూర్యకుమార్ యాదవ్‌కి టీ20 కెప్టెన్ గా నియమించారు. అంతకన్నా ముందు హార్ధిక్ పాండ్యాకి ఆ భాద్యతలను అప్పగించారు. ఇతర ఫార్మాట్ లో శుబ్మన్ గిల్ కెప్టెన్ గా ఉన్నప్పటికీ ... టీ20లో మాత్రం సూర్య కుమార్ నే కెప్టెన్ గా ఎందుకున్నారు. శుబ్మన్ గిల్ ను వైస్ కెప్టెన్ గా నియమించారు. SKY నాయకత్వంలో టీమ్ ఇండియా ముందుకు దూసుకుపోతుంది. ఆసియా కప్ లో కూడా ... ఒక బ్యాట్స్మన్ గా రన్స్ చేయక పోయినప్పటికీ... కెప్టెన్ గా ఫుల్ ఫార్మ్ లో కొనసాగాడు.
తాజాగా టీ20 కెప్టెన్సీ గురించి సూర్యకుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘నాకు అబద్దం చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ ఆ భయం ఉంటుంది. అయితే ఆ భయం మంచిదే. శుభ్‌మన్ గిల్‌కీ, నాకు మధ్య చాలా మంచి రిలేషన్ ఉంది. అతనికి రెండు ఫార్మాట్ల కెప్టెన్సీ దక్కడం చాలా సంతోషంగా అనిపించింది. కెప్టెన్‌గా అతని సత్తా ఏంటో నాకు బాగా తెలుసు. నాకు భయం అంటే ఏంటో తెలీదు. భయపడితే అంతర్జాతీయ క్రికెట్‌లో నేను ఆడిన మొదటి బాల్‌కి సిక్సర్ కొట్టేవాడినా? ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితమే నేను భయాన్ని పక్కనబెట్టేశాను... ’ అంటూ కామెంట్ చేశాడు సూర్యకుమార్ యాదవ్.





















