అన్వేషించండి
Cheteshwar Pujara Records: చతేశ్వర్ పుజారా 5 బిగ్ రికార్డ్స్.. ఎన్నో విషయాల్లో కోహ్లీ కంటే ముందున్న నయా వాల్
Cheteshwar Pujara Retirement | చతేశ్వర్ పుజారా క్రికెట్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్లో తనదైన ముద్రవేసిన పుజారా భారత్ నుంచి బెస్ట్ టెస్ట్ బ్యాటర్లలో ఒకడిగా నిలిచాడు.
భారత క్రికెటర్ చతేశ్వర్ పుజారా
1/6

చతేశ్వర్ పుజారా ఒక టెస్ట్ ఇన్నింగ్స్ లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న భారతీయ బ్యాటర్. పూజారా 16 మార్చి 2017న రాంచీలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో 525 బంతులు ఎదుర్కొన్నాడు. అందులో భాగంగా ఏకంగా 672 నిమిషాల పాటు బ్యాటింగ్ ఉన్నాడు. ఈ జాబితాలో అతని తరువాత రాహుల్ ద్రావిడ్ (495 బంతులు) ఉన్నాడు.
2/6

చతేశ్వర్ పుజారా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన భారత బ్యాటర్. అతను తన కెరీర్లో మొత్తం 18 డబుల్ సెంచరీలు చేశాడు. ఓవరాల్ జాబితాలో పుజారా నాల్గవ స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో డాన్ బ్రాడ్‌మన్ ఉండగా.. ఆయన పేరిట 37 డబుల్ సెంచరీలు ఉన్నాయి.
3/6

టెస్ట్ మ్యాచ్ విజయాలలో అత్యధికంగా 50+ స్కోర్లు చేసిన 3వ భారత క్రికెటర్ చతేశ్వర్ పుజారా. ఈ విషయంలో విరాట్ కోహ్లీ కంటే పుజారానే ముందున్నాడు. అతను మొత్తం 36 సార్లు భారత విజయాలలో 50 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు. విరాట్ భారత్ నెగ్గిన టెస్టుల్లో 30 సార్లు 50 ప్లస్ స్కో్ర్ చేశాడు. ఈ జాబితాలో తొలి స్థానంలో సచిన్ టెండూల్కర్ (44), రాహుల్ ద్రవిడ్ (38) రెండవ స్థానంలో ఉన్నాడు.
4/6

చతేశ్వర్ పుజారా గత 40 సంవత్సరాలలో ఒక టెస్ట్ మ్యాచులో మొత్తం 5 రోజులు బ్యాటింగ్ చేసిన ఏకైక భారత క్రికెటర్. 2017లో అతను శ్రీలంక జట్టుతో మ్యాచ్ లో అన్ని రోజులు బ్యాటింగ్ చేశాడు. క్రికెట్ చరిత్రలో అలా చేసిన రెండవ భారతీయుడు. ఇప్పటివరకు కేవలం 13 మంది బ్యాటర్లు మాత్రమే ఈ ఘనత సాధించారు.
5/6

SENA (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలలో అత్యధిక టెస్ట్ విజయాలు సాధించిన భారత క్రికెట్ జట్టులో సభ్యుడు చతేశ్వర్ పుజారా. అతను 11 సార్లు SENA దేశాలలో విజయం సాధించిన జట్టులో భాగస్వామిగా ఉన్నాడు. ఈ జాబితాలో పుజారా తర్వాత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, అజింక్యా రహానే, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్ ఉన్నారు. వీరందరూ 10-10 సార్లు SENA దేశాలలో గెలిచిన భారత జట్టులో సభ్యులుగా ఉన్నారు.
6/6

చతేశ్వర్ పుజారా ఆగస్టు 24, 2025 న క్రికెట్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. కెరీర్లో మొత్తం 103 టెస్ట్ మ్యాచ్‌లాడిన పుజారా 43.60 సగటుతో 7195 పరుగులు సాధించాడు. చేశాడు. 5 వన్డేలు ఆడిన పుజారా 51 పరుగులు చేశాడు.
Published at : 24 Aug 2025 05:18 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పర్సనల్ ఫైనాన్స్
ఇండియా
ఆట
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















