PM Modi Promoting Nara Lokesh : నారా లోకేష్‌పై ప్రధానిమోదీ అమితమైన అభిమానం..అసలు రీజన్ ఇదే | ABP Desam
చంద్రబాబు తర్వాత ఎవరు.. ఈ ప్రశ్నకు టీడీపీలో అయితే ఆన్సర్ వెంటనే వస్తుంది నారా లోకేష్ అని..! మరి కూటమి ప్రభుత్వంలో ఎవరు..? అది చెప్పడం కొంచం కష్టం.. అయితే ఆ కష్టాన్ని ప్రధాని మోదీ ఈజీ చేస్తున్నారా.. ? నారా లోకేష్‌ను ఫ్యూచర్ లీడర్‌గా రెడీ చేస్తన్నారా..?
2019- కర్నూలు ఎన్నికల ప్రచారసభలో ప్రధాని మోదీ:
“ఏపీలో ఎన్నికలు కొత్త 'సన్‌రైజ్'ను తీసుకురావచ్చు, కానీ 'సన్ సెట్' కూడా జరుగుతుంది" అని మోదీ చంద్రబాబు, లోకేష్‌లను ఉద్దేశించి విమర్శించారు. ఇక్కడ సన్‌సెట్ అంటే నారా లోకేష్ రాజకీయ భవితవ్యం ఆ ఎన్నికలతో ముగిసిపోతుందన్నది మోదీ మాటల అంతరార్థం అదే నరేంద్రమోదీ .. అదే కర్నూలులో ఇప్పుడు ప్రధానిగా అధికారిక హోదాలో నారా లోకేష్ కు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. అవసరానికి మించి ఎలివేషన్ ఇస్తున్నారు. చిన్నబాబుతో ప్రత్యేక సమావేశాలు.. ఆయన్ను ప్రత్యేకంగా పొగడటాలు.. ట్వీట్‌లలో ప్రత్యేక ప్రస్తావనలు..వీటన్నింటి ద్వారా ప్రధాని మోదీ నారా లోకేష్ ఫ్యూచర్ లీడర్ అన్న సంకేతాలు ఇస్తున్నారా..?





















