Women's ODI World Cup 2025 | India vs England | ఒత్తిడిలో టీమ్ ఇండియా
మహిళా వన్డే వరల్డ్ కప్ లో భాగంగా విజయాలతో మొదలు పెట్టిన టీమ్ ఇండియా జర్నీ ... చివరకు చేరుతున్న కొద్దీ దారుణంగా మారుతుంది. వరుసగా మ్యాచులు ఓడిపోతూ చిక్కులో పడింది. సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియాతో ఓడిపోవడంతో టీమ్ ఇండియాపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం భారత్ ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు సిద్ధమవుతోంది. సెమీస్ చేరాలంటే హర్మన్‌ప్రీత్ సేన ... ఇంగ్లాండ్, బంగ్లాదేశ, న్యూజీలాండ్ తో ఆడాలి. ఈ మూడు మ్యాచులో కనీసం రెండు మ్యాచ్‌లలో గెలవాలి.
దాంతో ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని చూస్తుంది టీమ్ ఇండియా. ఈ క్రమంలో పేసర్ రేణుక, స్పిన్నర్ రాధా యాదవ్‌లో ఒకరికి టీమ్ లో చోటు దక్కే అవకాశం ఉంది. టాపార్డర్ స్మృతి మంధాన, ప్రతీక రావల్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ నిలకడగా ఆడాల్సి ఉంటుంది. ఇంకోవైపు ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండ ముందుకు దూసుకెళ్తున్న ఇంగ్లాండ్.. ఈ మ్యాచ్ గెలుస్తే సెమీస్ బెర్త్ ను దాదాపు ఖరారు చేసుకుంటుంది. టీమ్ సెలక్షన్, స్ట్రాటజీపై ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న టీమ్ ఇండియా ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ లో ఎలా సమాధానం చెప్తుందో చూడాలి.





















