India vs Australia 2025 Preview | నేడే ఇండియా ఆసీస్ వన్డే మ్యాచ్
నేటి నుంచి ఇండియా ఆస్ట్రేలియా మధ్య వన్ డే సిరీస్ మొదలు కానుంది. అయితే ఏడు నెలల తర్వాత రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ మళ్ళి క్రీజ్ లో సందడి చేయనున్నారు. అంతే కాకుండా కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్ మొదటి వన్ డే సిరీస్ ను ఆడబోతున్నాడు.
ఇంక టీమ్ ఇండియా ప్లేయింగ్ 11 విషయానికి వస్తే మాజీ కెప్టెన్ రోహిత్, ప్రస్తుత కెప్టెన్ శుబ్మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ మొదలు పెడతారు. టాపార్డర్‌తో పాటు మిడిలార్డర్ విరాట్, శ్రేయాస్, రాహుల్ తో బాగానే కనిపిస్తుంది. హార్దిక్ లేకపోవడంతో ఆల్‌రౌండర్‌గా నితీశ్ కుమార్ ఆడవచ్చు. అలాగే అక్షర్ పటేల్ తోపాటు స్పిన్నర్లు కుల్దీప్, వాషింగ్టన్ సుందర్‌లలో ఒకరిని సెలెక్ట్ చేయొచ్చు. పేసర్లుగా సిరాజ్, అర్షదీప్ కి తోడుగా ప్రసిద్ధ్ వస్తాడా.. లేదా హర్షిత్ రాణా ను సెలెక్ట్ చేస్తారా చూడాలి.
ఆస్ట్రేలియా టీమ్ లోను రెగ్యూలర్ కెప్టెన్ పాట్ కమిన్స్ లేడు. అతని స్థానంలో మిచెల్ మార్ష్ ఆసీస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే ఆస్ట్రేలియాకు సొంత మైదానంలో ఆడటం కలిసి రానుంది. కానీ టీమ్ లో చాలామంది స్టార్ ప్లేయర్స్ లేరు. స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్ లేకపోవడంతో మిడిల్ ఆర్డర్ చాలా బలహీనంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో పాట్ కమిన్స్, ఆడమ్ జంపా లేరు. హేజిల్ వుడ్, మిచెల్ స్టార్క్ ఉంటంతో పేసర్లు ప్రమాదకరంగా మారవచ్చు.





















