Diwali Special: దీపావళి వేడుకలు.. వివిధ ప్రాంతాల్లోని ఆచారాలు, విశేషాలు.. మీకోసం!
Deepavali Festival Celbrations: భారత్, శ్రీలంక, మలేషియా, అమెరికా, ఆష్ట్రేలియాలో... దీపావళి పండుగ ఎక్కడ ఎలా జరుపుకుంటారు...

Diwali Special: దీపావళి పండుగను భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో, ప్రపంచవ్యాప్తంగా హిందూ సిక్కు జైన్స్ ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగను ప్రధానంగా భారతదేశం, నేపాల్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఫిజీ, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, కెనడా, యుకె, యుఎస్‌లలో హిందువులు జరుపుకుంటారు. ప్రాంతాన్నిబట్టి కొంత వైవిధ్యం ఉంటుంది కానీ ఎక్కడైనా దీపాల పండుగే. దీపావళి సందర్భంగా ఇళ్లను శుభ్రపరిచి, దీపాలు వెలిగించి, లక్ష్మీపూజ చేస్తారు.. ఇల్లంతా ముగ్గులు - పూలు- దీపాలతో అలంకరిస్తారు. ఈ సందర్భంగా శ్రీ మహాలక్ష్మి, గణేషుడిని, కుబేరుడిని పూజిస్తారు. నూతనవస్త్రాలు ధరించి పూజ అనంతరం స్వీట్స్ పంచుకుని శుభాకాంక్షలు చెప్పుకుంటారు, బాణసంచా కాలుస్తారు.
ఉత్తర భారతదేశంలో... రావణ సంహారం అనంతరం శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా అయోధ్యకు వచ్చిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటారు
దక్షిణ భారతదేశంలో.. శ్రీ కృష్ణుడుడు- సత్యభామ నరకాసురుడిని సంహరించిన సందర్భంగా దీపావళి జరుపుకుంటారు
నేపాల్
నేపాల్ లో దీపావళి పండుగను తీహార్ అనే పేరుతో ఐదు రోజులు జరుపుకుంటారు. దీపాలు, రంగోలీలు, లక్ష్మీ పూజ, బహుమతులు, సోదరీసోదరుల సంబంధాన్ని జరుపుకునే "భాయ్ టికా" వంటి ఆచారాలు ఉంటాయి.
శ్రీలంక
మిళ హిందువులు దీపావళిని ఇళ్లలో దీపాలు వెలిగించి, ఆలయాల్లో పూజలు చేస్తారు. సాంప్రదాయ మిఠాయిలు, కొత్త బట్టలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు
మలేషియా, సింగపూర్
మలేషియా, సింగపూర్ లో దీపావళిని జాతీయ సెలవుదినంగా జరుపుకుంటారు. ఇళ్లు, వీధులు దీపాలతో అలంకరిస్తారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరితో కలసి సంతోషాన్ని పంచుకుంటారు
ఫిజీ, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, కెనడా, యుకె, యుఎస్
ఈ ప్రాంతాల్లో స్థిరపడిన హిందువులంతా ఓ చోటకి చేరి దీపావళి సంతోషంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా స్వీట్స్ పంచుకుంటారు.. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో బాణసంచా నిషేధం ఉన్నప్పటికీ ఇతర ఆచారాలు పాటిస్తారు
భారతదేశంలో దీపావళి సమయంలో సాధారణంగా పాటించే ఆచారాలు
ఇల్లంతా దీపాలు వెలిగిస్తారు
లక్ష్మీపూజ నిర్వహిస్తారు
మిఠాయిలు పంచుకుంటారు
బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు
బాణసంచా కాల్చుతారు
నూతన వస్త్రాలు ధరిస్తారు
ప్రాంతాన్ని బట్టి సంప్రదాయాలు పాటిస్తారు
రాముడు,కృష్ణుడు, లక్ష్మీదేవి కథలు చెప్పుకుంటారు
శ్రీకృష్ణుడి విజయానికి సంకేతంగా గోవాలో నరకాసురుడి దిష్టిబొమ్మ దహనం చేస్తారు. ఊరంతా దిష్టిబొమ్మను ఊరేగించి ఓ ప్రదేశంలో దహనం కానీ శిరస్సు ఖండనం కానీ చేస్తారు. ఈ తతంగం మొత్తం దీపావళి రోజు సూర్యోదయానికి ముందే జరుగుతుంది
మహారాష్ట్రలో దీపావళి సందడి వారం ముందునుంచే మొదలవుతుంది. చిన్నారులంతా మట్టితో కోటలు తయారు చేస్తారు. ఆ కోటల చుట్టూ పచ్చని మొక్కలు నాటుతారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటి మడుగుల్లో వీటిని ఉంచుతారు. ఇక్కడ దీపావళి పండుగకు గ్రీన్ కోటలు, వాటి చుట్టూ విద్యుత్ దీపాల అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తమిళులకు నరక చతుర్దశి ప్రత్యేకరోజు. ఈ రోజు ఉదయాన్నే లేచి కుండల్లో నీటిని వేడి చేసి ఇల్లంతా శుభ్రం చేస్తారు. రంగు రంగుల ముగ్గులతో ఇంటి ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతారు. ఆ తర్వాత కుండలను అలంకరిస్తారు. ఈ రోజు శీకాకాయ తో తలంటు స్నానం ప్రత్యేకత. జీర్ణశక్తి పెంచే లేహ్యాన్ని తీసుకుంటారు. ఈ రోజు తమిళతంబీలు నాన్ వెజ్ కూడా తీసుకుంటారు. ఇంకా ఉత్త రప్రదేశ్, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాల ప్రజలంతా దీపావళి రోజు ఇళ్లలో బురద ఇంటి ప్రతిమలు ఉంచుతారు..దీనిని 'ఘరోందాస్' ( దేవుడికి స్వాగతం పలకడం) అంటారు. దీపావళి జరిగిన నెల రోజుల తర్వాత హిమాచల్ ప్రదేశ్ లో వేడుకలు జరుపుకుంటారు. దీనిని బుద్ధి దీపావళి అంటారు. రాముడు అయోధ్యకు వచ్చిన నెల తర్వాత వీళ్లకు సమాచారం తెలిసిందట..అందుకే ఇక్కడి ప్రజలు నెల తర్వాత దీపావళి జరుపుకుంటారు
లక్ష్మీ పూజ అక్టోబర్ 20 లేదా 21 ఎప్పుడు చేయాలి? శుభముహూర్తం ఎప్పుడు? పూర్తి వివరాలు తెలుసుకోండి.
నరక చతుర్దశి 2025 ఎప్పుడు! 19 లేదా 20 అక్టోబర్ 2025 ? పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి






















