నరక చతుర్దశి 2025 ఎప్పుడు! 19 లేదా 20 అక్టోబర్ 2025 ?
Naraka Chaturdashi Date: నరక చతుర్దశి 2025..దీనినే చిన్న దీపావళి అంటారు. ఈ ఏడాది తిథులు రెండు రోజులు రావడంతో కొంత గందరగోళం ఉంది.. నరకచతుర్థశి ఎప్పుడొచ్చిందంటే...

Naraka Chaturdashi 2025: హిందూ పంచాంగం ప్రకారం ఆశ్వయుజమాసం కృష్ణ పక్షంలో చతుర్దశిని నరక చతుర్దశి అంటారు. దీనిని చిన్న దీపావళి , రూప చౌదస్ అని కూడా అంటారు. ఈ రోజు రాత్రి పూజలు చేయడం వల్ల పాపాలు నశిస్తాయని, తెల్లవారుజామున అభ్యంగ స్నానం చేయడం వల్ల సౌందర్యం, ఆరోగ్యం, సంపద లభిస్తాయని నమ్ముతారు.
ఈ సంవత్సరం నరక చతుర్దశి అక్టోబర్ 19 మరియు 20 తేదీల్లో వస్తుంది. పంచాంగం ప్రకారం, చతుర్దశి తిథి అక్టోబర్ 19మధ్యాహ్నం 01:39 గంటలకు ప్రారంభమవుతుంది అక్టోబర్ 20, 2025 మధ్యాహ్నం 02:39 గంటలకు ముగుస్తుంది. కాబట్టి, పూజ అక్టోబర్ 19 రాత్రి జరుగుతుంది, అయితే అభ్యంగ స్నానం అక్టోబర్ 20 తెల్లవారుజామున చేస్తారు.
స్నానం, పూజ సమయం
నరక చతుర్దశి పూజ (సాయంత్రం పూజ చేసేవారికోసం అక్టోబర్ 19 )
విజయ ముహూర్తం: మధ్యాహ్నం 02:07 నుంచి 02:53 వరకు
గోధూళి ముహూర్తం: సాయంత్రం 05:58 నుంచి 06:23 వరకు
రూప చౌదస్ అభ్యంగ స్నానం (అక్టోబర్ 20, 2025 సూర్యోదయానికి ముందు తెల్లవారుజామున 05:13 నుంచి 06:25 వరకు)
సాయంత్రం పూజ చేయాలి అనుకునేవారు..ద్వారం దగ్గర దీపాలు వెలిగించేవారు అక్టోబరు 19 ఆదివారం నరకచతుర్థశి జరుపుకుంటారు. వాస్తవానికి సూర్యోదయానికి తిథి ఉండాలి కాబట్టి.. అక్టోబరు 20 సోమవారం ఉదయం నరకచతుర్థశి వచ్చింది. ఇదే రోజు సాయంత్రం అమావాస్య ఉండడంతో...ఒకేరోజు నరకచతుర్థశి, దీపావళి వచ్చాయ్
ఈ సంవత్సరం నరక చతుర్దశి నాడు అమృతసిద్ధి యోగం సర్వార్థసిద్ధి యోగం కూడా ఏర్పడుతున్నాయి, ఇవి పూజ , కొత్త పనులకు చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు
పురాణ కథ - ప్రాముఖ్యత
కార్తీక కృష్ణ చతుర్దశి రోజున శ్రీకృష్ణుడు నరకాసురుడిని వధించి 16,000 మంది కన్యలను విడిపించాడని హిందూ పురాణాల్లో, ముఖ్యంగా శ్రీమద్భాగవతంలో ఉంది. నరకాసురుడు తన బలంతో అనేక రాజ్యాలను ఆక్రమించి, 16,000 మంది రాజకుమార్తెలను బందీలుగా చేసాడు. శ్రీకృష్ణుడు, సత్యభామ సమేతంగా, నరకాసురుడిని సంహరించి, ఆ కన్యలను విముక్తి కల్పించాడు. వారు సమాజంలో గౌరవంగా జీవించేందుకు.. కృష్ణుడు వారిని తన భార్యలుగా స్వీకరించాడని పురాణాలు చెబుతున్నాయి. 16 వేలమంది గోపికలు అని చెబుతారు కదా..వాళ్లే వీళ్లు. ఈ విజయాన్ని స్మరించుకుంటూ దీపాలు వెలిగించారు .ఈ సంప్రదాయం నేటికీ చిన్న దీపావళి రూపంలో కొనసాగుతోంది. ఈ రోజున హనుమంతుడు, యమధర్మరాజు, శ్రీకృష్ణుడిని పూజించడం చాలా ముఖ్యం.
నరకచతుర్థశి రోజు తెల్లవారుజామున లేచి నలుగు పెట్టుకోవడం, చేదు ఆకులు (వేప, చిచడి మొదలైనవి) కలిపిన నీటితో స్నానం చేయడం లేదా నువ్వుల నూనెతో స్నానం చేయడం ఆచారం. దీనిని రూప చౌదస్ అంటారు, ఎందుకంటే ఈ స్నానం చేయడం వల్ల రూపం, అందం మరియు తేజస్సు లభిస్తాయి. స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం చాలా పుణ్యదాయకం.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ABP దేశం ఈ సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.






















