(Source: Poll of Polls)
Deepavali 2025 : దీపావళి ఎప్పుడు అక్టోబర్ 20 లేదా 21? ఎందుకీ అయోమయం? అమావాస్య ఎప్పుడొచ్చింది?
LakshmiPuja 2025: ఈ ఏడాది (2025) దీపావళి ఎప్పుడొచ్చింది? అక్టోబరు 20 లేదా 21..ఎందుకీ అయోమయం? లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం ఏంటి? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి...

Diwali In 2025 Date Puja Muhurat: దీపావళి పండుగ వచ్చేస్తోంది. ఆశ్వయుజ మాసం అమావాస్య రోజు దీపావళి జరుపుకుంటారు. అయితే ఎప్పటిలానే ఈ ఏడాది కూడా దీపావళి తేదీ విషయంలో కొంత గందరగోళం ఉంది. కచ్చితమైన తేదీ ఎప్పుడు అనే డిస్కషన్ జరుగుతోంది. ఈ ఏడాది దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి? లక్ష్మీపూజ ఎప్పుడు చేయాలి? శుభ ముహూర్తం ఏంటి?
సాధారణంగా ఏ పండుగ అయినా సూర్యోదయానికి తిథి ఉన్నరోజునే పరిగణలోకి తీసుకుంటారు...
కానీ..
దీపావళి అమావాస్య, కార్తీక పౌర్ణమి లాంటి రాత్రి వేళ జరుపుకునే పండుగలకు సూర్యాస్తమయానికి తిథి ఉండడం ప్రధానంగా భావిస్తారు. ఈ స్పష్టత లేకపోవడం వల్లే పండుగల విషయంలో పదే పదే గందరగోళం జరుగుతోంది
దీపావళి అమావాస్య ఎప్పుడు?
అమావాస్య తిథి ప్రారంభం: 2025 అక్టోబర్ 20 సోమవారం మధ్యాహ్నం 2:40 గంటలకు
అమావాస్య తిథి ముగింపు: 2025 అక్టోబర్ 21 మంగళవారం సాయంత్రం 4:05 గంటలకు
అంటే సూర్యాస్తమయానికి అమావాస్య ఉన్న రోజు అక్టోబర్ 20 సోమవారం... దీపాలు వెలిగించేది, లక్ష్మీపూజ చేసేది అమావాస్య ఘడియల్లోనే.. అందుకే ఎలాంటి సందేహాలు లేకుండా దీపావళి అక్టోబర్ 20 సోమావారం జరుపుకోవాలని పండిదులు, పంచాంగాలు స్పష్టం చేస్తున్నాయ్.స
అక్టోబర్ 21 రాత్రి వరకు అమావాస్య ఉండదు అందుకే మంగళవారం దీపావళి జరుపుకోవడాన్ని శాస్త్రం సమ్మతించదు అని చెబుతారు. అయితే ఉదయం తిథిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం అనుకుంటే మంగళవారం కూడా పూజలు చేసుకోవచ్చు. కానీ పండితుల అభిప్రాయం ప్రకారం అక్టోబర్ 20నే దీపావళి.
2025 అక్టోబర్ 20 పూజా ముహూర్తం
రూప చతుర్దశి స్నానం: ఉదయం 4:46 నుంచి 6:25 వరకు
అభిజిత్ ముహూర్తం: 11:48 నుంచి 12:34 వరకు
సాయంత్రం పూజ: సాయంత్రం 5:57 నుంచి 7:12 వరకు
లక్ష్మీ పూజ: సాయంత్రం 7:23 నుంచి 8:27 వరకు
ప్రదోష కాలం: 5:57 నుంచి 8:27 వరకు
వృషభ కాలం: 7:23 నుంచి 9:22 వరకు
నిషిత్ పూజ: రాత్రి 11:47 నుంచి 12:36 వరకు
చౌఘడియా (అక్టోబర్ 20)
అమృతం: 6:25 నుంచి 7:52 వరకు
శుభం: 9:18 నుంచి 10:45 వరకు
లాభం: 3:04 నుంచి 4:31 వరకు
అమృతం: 4:31 నుంచి 5:57 వరకు
చర: 5:57 నుంచి 7:31 వరకు
లాభం: రాత్రి 10:38 నుంచి 12:11 వరకు
( ప్రాంతాలను బట్టి సమయాలలో 2 నుంచి 5 నిముషాల వ్యత్యాసం ఉండవచ్చు)
లక్ష్మీ పూజ విధానం
సూర్యోదయానికి ముందే నిద్రలేచి.. ఇల్లు, దేవుడి మందిరం శుభ్రం చేసుకోవాలి. దేవుడి మందిరంలో లక్ష్మీదేవి విగ్రహం లేదా ఫొటోని ఎర్రటి లేదా పసుపు వస్త్రంపై ఉంచాలి. విగ్రహాన్ని శుభ్రంచేసి బొట్టుపెట్టండి. అనంతరం పూజా సామగ్రి సిద్ధం చేసుకుని పూజ ప్రారంభించండి. ధ్యానం, ఆవాహనం, ఆసనం, ధూపం, దీపం, నైవేద్యం సహా షోడసోపచారాలతో పూజ చేయండి. పూలు, కుంకుమతో పూజ చేసి.. మీరు సిద్ధం చేసిన నైవేద్యాలు సమర్పించండి. ఆఖర్లో హారతి ఇచ్చి..ప్రసాదం అందరకీ పంచిపెట్టండి. అనంతరం ఇంటి బయట దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని ఆహ్వానించండి
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ABP దేశం ఈ సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
దీపావళి నుంచి 6 నెలల పాటూ ఈ 5 రాశుల వారి అదృష్టం వెలిగిపోతుంది! మీ రాశి ఉందా ఇందులో తెలుసుకోండి






















