Dhanteras 2025 Date: 2025 ధన త్రయోదశి తేదీ, బంగారం కొనుగోలు చేసేందుకు శుభ ముహూర్తం తెలుసుకోండి!
Dhanteras 2025 Date Auspicious Time Puja Vidhi: 2025 లో ధనత్రయోదశి ఎప్పుడొచ్చింది? దీపావళి ఐదు రోజుల్లో ధన త్రయోదశి ప్రాముఖ్యత ఏంటి? ఈ రోజు బంగారం కొనేందుకు ముహూర్తం ఏంటి?

Dhanteras 2025 Date: దీపావళి ఐదు రోజుల పండుగ...ఇందులో మొదటి రోజు ధన త్రయోదశి. ఈ రోజు ధనం, సంపదల దేవుడు కుబేరుడు, లక్ష్మీ దేవి , ఆరోగ్య దేవత ధన్వంతరిని పూజిస్తారు. అకాల మరణం భయం నుంచి విముక్తి కోసం యమ దీపం కూడా వెలిగిస్తారు. అలాగే కొన్ని వస్తువులు కొనుగులో చేసేందుకు ఈ రోజు శుభసమయంగా భావిస్తారు.
ఆశ్వయజు మాసం కృష్ణ పక్షం 13వ రోజున అంటే త్రయోదశి రోజున ధంతేరస్ జరుపుకుంటారు..ఈ రోజే ధన్వంతరి జయంతి. ఈ రోజునే ధన్వంతరి దేవుడు సముద్రం నుంచి అమృత కలశంతో ఉద్భవించాడు. 2025లో ధంతేరస్ ఎప్పుడు జరుపుకుంటారో తేదీ, ముహూర్తం తెలుసుకోండి.
2025లో ధంతేరస్ ఎప్పుడు? (Dhanteras 2025 Date)
ఈ సంవత్సరం ధన త్రయోదశి అక్టోబర్ 18 శనివారం రోజు వచ్చింది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి త్రయోదశి తిథి ప్రారంభమైంది. సాయంత్రం యమదీపం వెలిగించి..పూజ ఆచరించేవారంతా ఈ రోజే త్రయోదశి జరుపుకుంటారు. స్థిర లగ్నం (వృషభ లగ్నం) సమయంలో ధంతేరస్ పూజ చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుందని నమ్ముతారు. ధంతేరస్ నాడు కొనుగోలుకు ప్రాముఖ్యత ఉంది..పూజను సూర్యాస్తమయం తర్వాత చేయడం శుభప్రదంగా భావిస్తారు
ధంతేరస్ 2025 పూజా ముహూర్తం
ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి తిథి ప్రారంభం 2025 అక్టోబర్ 18 శనివారం మధ్యాహ్నం 1.10
ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి తిథి సమాప్తం అక్టోబర్ 19 ఆదివారం మధ్యాహ్నం 1.39
ధంతేరస్ పూజా ముహూర్తం అక్టోబర్ 18 శనివారం రాత్రి 07:16 నుంచి 08:20 వరకూ
యమ దీపం వెలిగించాల్సిన సమయం సాయంత్రం 5.48 నుంచి 7.04 మధ్యలో
ప్రదోష కాలం సాయంత్రం 05:48 నుంచి రాత్రి 08:20
వృషభ కాలం రాత్రి 07:16 నుంచి రాత్రి 09:11
ధనత్రయోదశి రోజు బంగారం కొనుగోలు చేయడానికి ముహూర్తం
ధన త్రయోదశి రోజు బంగారం కొనుగోలు చేయడం అంటే లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించడమే అని విశ్వాసం. ఈ రోజున బంగారం కొనడానికి శుభ ముహూర్తం అక్టోబర్ 18 మధ్యాహ్నం 1.10 నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం 01:51 వరకు ఉంటుంది.
ధన త్రయోదశి కి సంబంధించి తరచూ అడిగే ప్రశ్నలు
Q. ధంతేరస్ నాడు ఏమి కొనాలి?
బంగారం, వెండి, ఇత్తడి కొనడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. దీనితో పాటు ఈ రోజున ధనియాలు , చీపురు కొనడం కూడా చాలా శుభప్రదం.
Q. ధంతేరస్ ఎందుకు జరుపుకుంటారు?
దివాలికి రెండు రోజుల ముందు ధన్వంతరి దేవుడు సముద్ర మథనం నుంచి అమృత కలశంతో ఉద్భవించాడు, ఆరోగ్యాన్ని గొప్ప ధనంగా భావిస్తారు.
Q. ధంతేరస్ రోజు యమదీపం ఎందుకు?
ధంతేరస్ రోజున ప్రదోష కాలంలో ఇంటి వెలుపల దక్షిణ దిశలో యమరాజు పేరు మీద దీపం వెలిగించే వారికి అకాల మరణం భయం ఉండదు. దీర్ఘాయువు లభిస్తుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ABP దేశం ఈ సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.






















