దీపావళి రోజు లక్ష్మీపూజలో ఇవి తప్పనిసరి

Published by: RAMA

ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 20న వచ్చింది...ఈ రోజులు ప్రతి ఇల్లు దీపాల వెలుగులతో నిండిపోతుంది

దేవి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం సమర్పించాల్సిన వస్తువుల జాబితా చెబుతున్నారు పండితులు

లక్ష్మీదేవికి అష్టగంధం తిలకం పెట్టండి. ఇది మీలో ప్రశాంతతను పెంచుతుంది

కమలం సమర్పించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది

తీపి పదార్థాలు (లడ్డు, హల్వా, కేసరి), పండ్లు లక్ష్మీ దేవికి సమర్పిస్తారు

తామర గింజలు, కొబ్బరి, బెల్లం నైవేద్యంలో ఉండేలా చూసుకోండి

లక్ష్మీ అష్టకం, శ్రీ సూక్తం, లక్ష్మీ గాయత్రీ మంత్రం లేదా ఇతర లక్ష్మీ స్తోత్రాలను పఠించండి

వ్యాపారస్తులు కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ప్రారంభించడానికి ఖాతా పుస్తకాలను పూజిస్తారు.

పూజ అనంతరం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు ప్రసాదం పంచండి